S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

01/05/2016 - 01:36

విద్యార్థులు నవసమాజ నిర్మాతలంటూ ప్రబోధాత్మక గీతాలు ఎన్ని వచ్చినా..కొంత మంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులంటూ వారిలో నిద్రాణంగా ఉన్న ప్రతిభను తట్టి లేపేందుకు ప్రయత్నించినా..నేటి యువతే రేపటి భవిత అంటూ నాయకులు ఉత్తేజిత ప్రసంగాల జోరుతో హోరెత్తించినా..అది ఎంత వరకూ యువశక్తికి ఉద్దీపన అవుతోంది?

01/05/2016 - 01:32

సైకిల్‌పై వెడుతున్నప్పుడు వర్షం వస్తే మహా చిరాకు. దగ్గర్లో ఏ చెట్టు నీడనో తలదాచుకోవలసిందే. అయితే బాంచో అనే వాటర్‌ప్రూఫ్ రెయిన్‌కోట్ మీ దగ్గరుంటే ఆ బాధలేమీ ఉండవు. ఎంత వర్షం కురుస్తున్నా, హాయిగా తడవకుండా సైకిల్‌పై చక్కర్లు కొట్టొచ్చు. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న రెయిన్‌కోట్లతో ఓ చిక్కుంది. వాటిని వేసుకుంటే తలనుంచి ఉదర భాగం వరకూ తడవకుండా ఉండొచ్చు గానీ కాళ్లు తడవడం ఖాయం. బాంచోతో ఆ సమస్య లేదు.

01/05/2016 - 01:29

డెర్బీ అనే కుక్కపిల్ల చాలామందికి గుర్తుండే ఉంటుంది. ముందు కాళ్లు బలహీనంగా ఉండటంతో ఏడాదిన్నర కిందట డెర్బీకి త్రీడీ ప్రింటింగ్ సాయంతో రూపొందించిన చిన్న సైజు కాలిపర్స్‌ను అమర్చిన సంగతి అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే డెర్బీ పెరిగి పెద్దది కావడంతో ఆ కాలిపర్స్ సరిపోవడం లేదు.

01/05/2016 - 01:27

జిప్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని వెడుతున్నారంటే...అయితే వాళ్లు స్టూడెంట్లయినా అయి ఉంటారు లేదా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ అయినా అయి ఉంటారు. ఈ మధ్య ఇలాంటి బాగ్‌ల వాడకం పెరిగిపోయింది. వాటితోపాటే దొంగతనాల బెడదా పెరిగింది. దానికి కారణం...ఈ బ్యాగ్‌లకు జిప్‌లు బయటవైపే ఉండటం. బ్యాగ్‌ను భుజానికి తగిలించుకుని బస్సులోనో, రైలులోనో వెడుతుంటే వెనకాలనుంచి దొంగలు తమ పని కానిచ్చేస్తారు.

01/05/2016 - 01:25

బరువు తగ్గాలని అందరికీ ఉంటుంది. ఒబేసిటీతో బాధపడేవారి సంగతి అలా ఉంచితే, సాధారణంగా లావుగా ఉండేవారందరికీ బరువు తగ్గాలని, నాజూగ్గా మారాలనీ ఉంటుంది. కానీ, లైపోసక్షన్ వంటి చికిత్సా విధానాల పట్ల భయం. అలాగని బరువు తగ్గడంలో సులభమైన మార్గాలేమిటో తెలియక తికమక. ఇలాంటి వారికోసం ఓ చిన్న సలహా. చాలామందికి పొట్టవద్ద, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి లావుగా కనబడతారు.

01/05/2016 - 01:22

వానలో తడవటం బాగానే ఉంటుంది. కానీ...వర్షం తగ్గాక తడిబట్టలతో తిరగాలంటే మాత్రం ఇబ్బందే. అయితే ఫాల్యాన్ అనే స్టార్టప్ కంపెనీ దీనికో చక్కటి పరిష్కారాన్ని కనిపెట్టింది. ఈ సంస్థ రూపొందించిన జాకెట్ వేసుకుంటే, హాయిగా వర్షంలో తడవచ్చు. వర్షం ఆగాక, జాకెట్ దానంతట అదే ఆరిపోతుంది. నమ్మలేకపోతున్నారు కదూ! అసలు కిటుకేమిటంటే...జాకెట్‌లోపల ఎయిర్ యాంప్లిఫయర్స్‌ను అమర్చారు.

01/05/2016 - 01:21

ఒక చేత్తో ఓ పని చేస్తూ, మరో చేత్తో స్మార్ట్ఫోన్‌ను ఆపరేట్ చేయడం ఎవరికైనా కష్టమే. కాదని చేస్తే, స్మార్ట్ఫోన్ కిందపడి పగలడమో లేదా స్క్రాచ్‌లు పడటమో ఖాయం. ఈ సంగతి చాలామందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఉదయమే జాగింగ్ చేసేవారికి స్మార్ట్ఫోన్‌ను తీసుకువెళ్లే అవకాశమే ఉండదు. జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేసేవారి విషయంలోనూ అంతే.

01/05/2016 - 01:19

మనుషులకీ, రోబోలకీ మధ్య అంతరం చెరిగిపోతోంది. అచ్చం మనుషుల్లా పనిచేసే రోబోలు కూడా వచ్చేస్తున్నాయి. కాకపోతే, రూపురేఖల్లోనే తేడా. అయితే సింగపూర్‌కు చెందిన కొందరు శాస్తవ్రేత్తలు ఆ అంతరాన్ని కూడా చెరిపేశారు. అచ్చం మనిషిని పోలిన రోబోని సృష్టించి, అందర్నీ ఔరా అనిపించారు.

12/29/2015 - 08:27

ఇది యువ ప్రపంచం..యువత తలచుకుంటే అసాధ్యమేమీ లేదన్నంత విస్తృతంగా అవకాశాలు వెల్లువెత్తుతున్న ప్రపంచం..రంగం ఏదైనా అద్భుతంగా రాణించేందుకు ఇప్పుడున్నన్ని అవకాశాలు గతంలో ఎప్పుడూ లేవని చెప్పడం అవాస్తవం ఏమీ కాదు. అయితే.. విజయాలు సునాయాసంగా రావు. పట్టుదల, సామర్థ్యం, సాధనా పటిమను రంగరించినప్పుడే జయాలు చేకూరుతాయి. నేటి యువత జీవతం వడ్డించిన విస్తరి కాదు.

12/29/2015 - 08:25

స్మార్ట్ఫోన్లతో ఉన్న సమస్య ఏవిటంటే- బ్యాటరీ లైఫ్. చూస్తుండగానే చార్జింగ్ అయిపోతుంది. తిరిగి చార్జ్ చేయాలంటే కనీసం గంటయినా వేచి ఉండాలి. ఈ సమస్యను పరిష్కరించేందుకు సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ రాచిడ్ యజామి ఓ మైక్రో చిప్‌ను కనిపెట్టారు. దీనిని బ్యాటరీలో అమర్చితే, పది నిమిషాల్లో చార్జింగ్ పూర్తయిపోతుందట.

Pages