S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

11/11/2016 - 00:41

చిత్ర విచిత్రమైన లేజర్ లైట్లు, ఫ్లాష్‌లైట్లను తయారుచేసే ‘వికెడ్ లేజర్స్’ తాజాగా ఓ చిత్రమైన ఫ్లాష్ టార్చ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది కేవలం లైటరే కాదు, దీంతో నిప్పు పుట్టించవచ్చు. దీని ఆధారంగా చిన్న సైజు వంట కూడా చేసేయొచ్చు. దీని పొడవు కేవలం ఎనిమిదిన్నర అంగుళాలు మాత్రమే. గతంలో వచ్చిన ఫ్లాష్‌టార్చికి ఇది మినీ వెర్షన్ అన్నమాట.

11/11/2016 - 00:36

జగ్గా జాసూస్...త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ ఎకో ఫ్రెండ్లీ దుస్తులతో అలరించబోతోంది. లాస్‌ఏంజెలిస్‌లోని ఓ స్టోర్‌నుంచి కత్రినా ఈ దుస్తుల్ని ఎంపిక చేసుకుంది. ఈ ట్రెండ్ కేవలం బాలీవుడ్‌కో, ఇండియాకో పరిమితం కాలేదు. బ్రిటిష్ నటి ఎమ్మా వాట్సన్ ధరించేదీ వీటినే. తన అభిమానుల్ని కూడా ఇవే దుస్తులు ధరించమని ఆమె పిలుపునిస్తోంది.

11/11/2016 - 00:31

‘నేను పెట్టిన స్టార్టప్ స్వయం సమృద్ధి సాధించడం నా ఆశయం. దానిని నడిపేందుకు తరగతుల్లో పాల్గొనే విద్యార్థులిచ్చే ఫీజులు చాలు. వారినుంచి వసూలు చేస్తున్నది కూడా చాలా తక్కువే. అలాగే ఫీజులు చెల్లించుకోలేని వారికి మా తరగతులు ఉచితం

11/03/2016 - 21:20

సప్నా వ్యాస్ పటేల్
సోషల్ మీడియాలో మునిగి తేలేవారికి ఆమె పేరు చిరపరిచితమే.
బరువు ఎక్కువై బాధపడేవారికి ఆమె కేరాఫ్ అడ్రస్.
ఒకప్పుడు 86 కేజీల బరువుతో పంధొమ్మిదేళ్లకే ఆంటీ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ, తనంతట తానుగా కష్టపడి, బరువు తగ్గి, చక్కనమ్మ చిక్కినా అందమే అనిపించుకుంది.

11/03/2016 - 21:18

జీవితం ఓ పరుగుపందెం...
పరుగుపెడుతున్నంత మాత్రాన గెలుపు లభిస్తుందని చెప్పలేం...
అలాగని పరిగెట్టకుండా ఉంటే గెలుపుఎలా సాధ్యమవుతుంది?
కాబట్టి...
పరుగెట్టాలి... పడినా లేస్తూ పరిగెట్టాలి..
అప్పుడే గెలుపు తలుపుతడుతుంది..
కనీసం గెలిచేందుకు చేసిన ప్రయత్నం సంతృప్తినిస్తుంది.
ఆ ప్రయత్నంలో ఏదో ఒకటి..

11/03/2016 - 21:14

పాఠశాలల్లో బాలికల డ్రాపౌట్ శాతం పెరగడానికి కారణం....
టాయిలెట్లు లేకపోవడం!
అయితే అదొక్కటే కాదు. మరో ప్రధానమైన కారణం కూడా ఉంది. అది..రుతుచక్రం!

11/03/2016 - 21:12

ఒకప్పటి సంగతేమో కానీ, కంప్యూటర్, ఇంటర్నెట్ లేకుండా ఇప్పుడు జీవితాన్ని ఊహించుకోలేం. అంతలా కంప్యూటర్ మన జీవన విధానంలో భాగమైపోయింది. ప్రపంచం ఒక్క క్లిక్ దూరంలో ఉంది అన్నది అందుకేనేమో! ఇదంతా బాగానే ఉంది కానీ, మరి దివ్యాంగుల సంగతేమిటి? మల్టిపుల్ స్ల్కెరోసిస్, మస్కులార్ డిస్ట్ఫ్రొ, ఏఎల్‌ఎస్ వంటి మహమ్మారి వ్యాధులతో బాధపడేవారు వౌస్‌ను సైతం క్లిక్ చేయలేరు. అలాంటివారు కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడమెలా?

11/03/2016 - 21:11

బస్సులోనో, కారులోనో లేదా విమానంలోనో ప్రయాణిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కునుకిపాట్లు పడుతూంటాం. నిద్రలో పక్కన కూర్చున్నవారిపైకి జారిపోతూ, వారు నిద్ర లేపితే ‘సారీ’ చెప్పడం, మళ్లీ నిద్రలోకి వెళ్లిపోవడం ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. ‘ఫేస్ క్రెడిల్ ట్రావెల్ పిల్లో’తో ఇక ఆ సమస్యకు చెల్లుచీటీ పాడేయొచ్చు. దీనిని ఇట్టే సీటుకు అమర్చుకుని హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు.

10/27/2016 - 21:47

హెల్మెట్ తలకు రక్షణ ఇస్తుందన్న మాట నిజమే కానీ, దానిని ఎక్కడకు వెళ్లినా వెంట పెట్టుకుని వెళ్లడం మహా చిరాకు. ఒకవేళ ఏ ఆఫీసుకో వెంటతీసుకు వెడితే, ఎక్కడో అక్కడ పెట్టేసి మరచిపోవడం సహజం. దీనికి పరిష్కారంగా ఇప్పుడు ఫెండ్ (ళశజూ) అనే హెల్మెట్ మార్కెట్లోకి వచ్చింది. పని లేనప్పుడు దీనిని మడిచి, బ్యాగ్‌లో పెట్టేసుకోవచ్చు. అయితే ఇది కేవలం సైకిళ్లకోసం డిజైన్ చేసిన హెల్మెట్ మాత్రమే. దీని ధర 89 డాలర్లు.

10/27/2016 - 21:43

తెలంగాణ అమ్మాయి దీక్షిత వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చూపిస్తోంది. నిజాం కాలేజీలో బిఏ చదువుతున్న దీక్షిత ఇప్పటికే అనేక ప్రపంచస్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. ప్రస్తుతం ఈ నెల 13నుంచి మెక్సికోలో జరిగే ప్రపంచ యూనివర్శిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ పోటీల్లో గెలుపొందాలనేది ఆమె కల. అయితే ఆరంభంలో ఆమెకు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి.

Pages