S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

01/26/2017 - 21:19

హంస మధిర!
పదకొండేళ్ల ఈ చిన్నారి సాధించింది తక్కువేమీ కాదు!
పద్నాలుగేళ్ల లోపు బాలబాలికలకు నిర్వహించిన చిన్న కథల పోటీల్లో హంస మూడో స్థానాన్ని సంపాదించింది. అయితే ఈ పోటీ రాష్ట్ర స్థాయిలోనో, జాతీయ స్థాయిలోనో జరిగింది కాదు. 52 కామన్‌వెల్త్ దేశాల స్థాయిలో జరిగిన పోటీలు. బ్రిటిష్ కౌన్సిల్ ఈ పోటీలను నిర్వహించింది.

01/26/2017 - 21:15

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారా?
మహిళలను గౌరవిస్తారా?
అయితే సచిన్ శర్మ ఆటోలో ఫ్రీగా ప్రయాణించొచ్చు!
ఎవరా సచిన్ శర్మ?...ఏమా కథ? అనుకుంటున్నారా? అయితే చదవండి మరి...

01/26/2017 - 21:11

ఐటి పరికరాల ఉత్పత్తి సంస్థ జెబ్రానిక్స్ రెండు కార్ వౌంట్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. యఉఱళ్హ702శ్రీ, యజీఱళ్హ60శ్రీఅనే ఈ రెండ గాడ్జెట్లూ స్మార్ట్ఫోన్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. యఉఱళ్హ60శ్రీలో ఉండే వాగ్నటిక్ స్టాండ్ హోల్డర్ స్మార్ట్ఫోన్‌ను కదలకుండా గట్టిగా పట్టుకుని ఉండే గుణం కలిగి ఉంటుంది. ఇందులో ఉంచిన స్మార్ట్ఫోన్‌ను 360 డిగ్రీల కోణంలో తిప్పవచ్చు.

01/26/2017 - 21:09

కంప్యూటర్ టేబుల్ అంతా ఇయర్‌ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, చార్జర్లతోనూ నిండిపోతే ఎలా? వాటిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి వాడుకునేటట్టు ఉంటే బావుంటుంది కదూ! ఫోటోలో చూస్తున్నారుగా...హెడ్‌ఫోన్లకోసం చేసిన ఏర్పాటిది. కంప్యూటర్ డెస్క్ కింద చేతికి అందేలా హెడ్‌ఫోన్స్ ఉన్నాయి కదూ. యాంకర్ అనే చిన్న హుక్‌ను టేబుల్ కింద తగిలించుకుంటే చాలు.. హెడ్‌ఫోన్స్‌ను దీనికి వేలాడదీసుకోవచ్చు.

01/26/2017 - 21:07

మీరు ఫొటోలో చూస్తున్నది ఓ స్లీపింగ్ బ్యాగ్. అబ్కో టెక్ కంపెనీ తయారు చేసిన ఈ స్లీపింగ్ బ్యాగ్...నిరంతరం ప్రయాణాలు చేసేవారికి పనికొస్తుంది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనూ కనీస ఉష్ణోగ్రత ఉండేలా చేయడం ఈ బ్యాగ్ ప్రత్యేకత. విహార యాత్రలకు వెళ్లేవారు, ట్రెక్కింగ్, సైక్లింగ్‌కు వెళ్లేవారు రాత్రిపూట నిదురించేందుకు సరైన చోటుకోసం వెదుక్కోనక్కర్లేదు. హాయిగా ఈ బ్యాగ్‌లోకి దూరి పడుకుంటే సరి.

01/26/2017 - 21:04

రెజ్లింగ్, జూడో, బాక్సింగ్ వంటి క్రీడలగురించి అందరికీ తెలుసు. కానీ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ గురించి తెలిసిన వారు చాలా తక్కువమందే. ఇంతకీ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏమిటి? నిజానికి ఇది కూడా ఓ ఆటే. రెజ్లింగ్, జూడో, బాక్సింగ్, మ్యూ థాయ్...ఈ నాలుగు క్రీడల కలబోతే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్.

01/19/2017 - 21:50

వైర్‌లెస్ చార్జింగ్ పరికరాలు మార్కెట్లోకి చాలానే వచ్చాయి. అలాంటిదే మరొకటి- నార్డ్‌మార్క్ ట్రిపుల్ వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్. ఒకేసారి మూడు గాడ్జెట్లను చార్జ్ చేసుకునే వెసులుబాటు ఉండటం ఇందులో ప్రత్యేకత. గూగుల్, శామ్‌సంగ్, మోటోరోలా, నోకియా తదితర అన్ని రకాల గాడ్జెట్లనూ దీని సాయంతో చార్జ్ చేసుకోవచ్చు.

01/19/2017 - 21:46

టీనేజీ హుషారు.. సరదా మాటలు..
షేక్ హుస్నా సమీరాను చూస్తే ఎవరికైనా సాదాసీదా కాలేజీ విద్యార్థిని గుర్తుకొస్తుంది. ఎలాంటి ప్రత్యేకతలు లేనట్టు కనిపిస్తుంది.
కానీ, ఆమె క్యారమ్ బోర్డు ముందు కూర్చున్న మరుక్షణం ఆమె తీరు మారిపోతుంది.

01/19/2017 - 21:41

ఎన్నో అవార్డులు.. రివార్డులు.. రికార్డులు హుస్నా సమీర ఖాతాలో చేరి మురిసిపోతున్నాయి. 2013లో కాలిగ్రఫీలో ఆమె నిపుణ జాతీయ అవార్డును స్వీకరించంది. 2014లో అవుట్‌స్టాండింగ్ క్యారమ్ ప్లేయర్‌గా ప్రఫుల్లా స్మారక అవార్డును తీసుకుంది. స్పీడ్ మాథమాటిక్స్‌లో ‘లిటిల్ స్టార్’ అవార్డు లభించింది. మల్టీ టాలెంటెడ్ చైల్డ్ బాలప్రభ అవార్డు, తెలంగాణ బాలరత్న అవార్డులను సొంతం చేసుకుంది.

01/19/2017 - 21:39

దంగల్ సినిమా చూస్తున్నంతసేపూ పదహారేళ్ల అమ్మాయి మహిమా రాథోడ్ కళ్లు వర్షిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే- ఆ సినిమా కథ అచ్చం తన జీవిత కథనే పోలి ఉండటం.
అదేంటి? దంగల్ ..మహావీర్‌సింగ్ ఫోగట్ గురించి, అతని కూతుళ్ల గురించీ తీసిన సినిమా కదా అనేగా మీ సందేహం?

Pages