S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

10/12/2017 - 20:11

ఉద్యోగుల్లో సరికొత్త నైపుణ్యాలను పెంపొందిస్తూ, వారిని సమర్ధులుగా తీర్చిదిద్దేందుకు నేడు కార్పొరేట్ సంస్థలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ముఖ్యంగా ఐటి రంగంలో తాజా సాంకేతిక విషయాలపై అవగాహన ఉన్నవారికే ఉపాధి లభించే పరిస్థితి ఏర్పడింది.

10/12/2017 - 20:09

విజ్ఞాన దీపకాంతుల కింద అకృత్యాల చీకట్లు తాండవిస్తున్నట్లు’ అంతర్జాలంలో శ్రుతిమించుతున్న సైబర్ నేరాల తీవ్రత నేడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కంప్యూటర్ మీటలు, స్మార్ట్ఫోన్ల మీదే కాలక్షేపం చేస్తున్న ఆధునిక యువత తెలిసో, తెలియకో కష్టాలపాలవుతోంది.

10/12/2017 - 20:07

కొన్ని వృత్తుల్లో ఉన్నవారిలో 30 శాతం మంది తీవ్ర ఒత్తిడి, కుంగుబాటు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు మానసిక వైద్యులు తేల్చిచెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితి ఉండడంతో యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలు దెబ్బతింటున్నాయని తేలింది. ‘ఆన్‌లైన్ డాక్టర్స్ కన్సల్టేషన్ ప్లాట్‌ఫామ్’ నిర్వహించిన తాజా సర్వేలో పలు ఆందోళనకరమైన అంశాలు వెలుగు చూసాయి.

10/05/2017 - 19:49

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారూ నేడు విరివిగా వినియోగిస్తున్నందున ‘వాట్సాప్’కు నానాటికీ క్రేజ్ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తున్న ఈ ‘మెసేజింగ్ యాప్’ మరో అడుగు ముందుకేసింది. వాట్సాప్‌లో మనం పంపించుకొనే సందేశాలను స్టోర్ చేసుకునే అవకాశం ఇంతవరకూ లేదు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు వంటివి మాత్రమే ఫోన్ మెమొరీలో ఉంటాయి.

10/05/2017 - 19:48

ఉన్నత విద్యలో, ఉపాధి అవకాశాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న నేటి ఆధునిక యుగంలో తమ కెరీర్‌కు సంబంధించి యువత ఒక నిశ్చితాభిప్రాయం కలిగి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ‘డాలర్ల వేట’లో విదేశీ ఉద్యోగాల కోసం పరితపించే వారి సంఖ్య ఇటీవల తగ్గుముఖం పడుతోంది.

10/05/2017 - 19:46

ఉదయం నిద్ర లేవగానే- ఆ రోజంతా శుభం జరగాలని దేవుడి ఫొటో చూడడం ఒకప్పటి అలవాటేమో గానీ.. ఇప్పుడు చాలామంది నిద్ర లేస్తూనే చేతిలోకి స్మార్ట్ఫోన్ తీసుకుని తమదైన లోకంలో మునిగిపోతున్నారు. తమ పరిసరాలను గానీ, కుటుంబ సభ్యులను గానీ పట్టించుకోనంత వరకూ ‘స్మార్ట్ఫోన్’ వ్యసనం మితిమీరిపోతోంది. స్మార్ట్ఫోన్‌కు బానిసలైతే ఆరోగ్యపరంగా సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా ఎలాంటి ఫలితం ఉండడం లేదు.

10/05/2017 - 19:45

ఏ అంశానికి సంబంధించైనా సమాచారం, ఫొటోలు కావాలన్నా ‘గూగుల్’లో ‘శోధించడం’ అందరికీ అలవాటుగా మారింది. అయితే, ఒకే అంశానికి సంబంధించి వందలాది పేజీల సమాచారం, లెక్కలేనన్ని వెబ్‌సైట్ల వివరాలు మనకు చిరాకు తెప్పించడం సహజం. మనకు కావాల్సిన సమాచారం కుప్పలు తెప్పలుగా రావడంతో ఈ ‘వెతుకులాట’ ఎవరికైనా విసుగు తెప్పించడం ఖాయం.

10/05/2017 - 19:43

ఉన్నత చదువులు పూర్తిచేసి, భారీగా జీతభత్యాలున్నా ఆ యువకుడు సమాజసేవకే సుముఖత చూపి ఇతరులకు స్ఫూర్తిదాతగా నిలిచాడు.. తాను ఇబ్బందుల పాలైనా సరే- పేదవర్గాల పిల్లలకు అక్షరదానం చేయాలని అకుంఠిత దీక్షతో ముందుకు కదిలాడు.. దీంతో ఆ యువకుడికి ఇపుడు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది.

09/28/2017 - 18:35

ఇంజనీరింగ్ చదివినా, ఎంబిఎ పూర్తి చేసినా తమకు నచ్చిన కెరీర్‌నే ఎంచుకునేందుకు నేటి యువత ఆసక్తి చూపుతున్నారు. అమెరికా వెళ్లి సాఫ్ట్‌వేర్ రంగంలో భారీగా సంపాదిస్తున్నా అది కాస్త బోర్ కొట్టి స్వదేశానికి చేరుకుని స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తున్న యువకులూ ఉన్నారు.. కార్పొరేట్ కొలువుకు ‘గుడ్ బై’ కొట్టి సమాజ సేవలో పాల్గొనేందుకు మొగ్గు చూపుతున్న యువతులూ ఉన్నారు..

09/28/2017 - 18:33

ఆడపిల్లల పట్ల ఇప్పటికీ వివక్ష కొనసాగుతున్న మన దేశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమవుతోంది. విద్యారంగంలో ఇపుడు అమ్మాయిల ప్రాతినిధ్యం అనూహ్యంగా పెరుగుతోంది. విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే ఆడపిల్లల సంఖ్య పెరగడంతో- అబ్బాయిలు వెనుకపడుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచం మొత్తమీద చూస్తే భారత్‌లోనే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని ఓ అధ్యయనంలో తేలింది.

Pages