S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మండి! ఇది నిజం!!

03/05/2016 - 21:02

మొగల్ చక్రవర్తి షాజహాన్, తన భార్య ముంతాజ్ 1632లో మరణించినప్పుడు ఆమె మీది ప్రేమకి ఓ ఆకృతిని ఇచ్చాడు. అదే ఆగ్రాలోని తాజ్‌మహల్. చక్రవర్తులకే కాదు. ప్రేమ అనే సంపద మానవులు అందరికీ ఉంటుంది. అందరూ ఆ ప్రేమని బయటికి వ్యక్తీకరించలేరు. కానీ కొందరు సామాన్యులు తమ భార్య లేదా ప్రియురాలి మీద ప్రేమని వింత పద్ధతుల్లో వ్యక్తీకరించారు. వారిలో ఒకరు ఫైజుల్ హసన్ ఖాద్రీ.

02/28/2016 - 16:55

ప్రపంచంలోని కొన్ని వ్యాపారాలు, వృత్తులు ప్రమాదకరమైనవి. వాటిలో ఒకటి విమానాలని రికవరీ చేసే ఉద్యోగం. ఇలాంటి సేవని ప్రపంచంలో అతి తక్కువ కంపెనీలు అందిస్తున్నాయి.

02/14/2016 - 18:37

అబద్ధం చెప్పేవారిని ఎవరూ ఇష్టపడరు. అబద్ధం ఆడటం పాపం అని ప్రతీ మతం చెప్తుంది. అంతేకాక సమాజం, ఆఖరికి ప్రతీ మనిషి కూడా అబద్ధం చెప్పడం తప్పని ఒప్పుకుంటాడు. కానీ అబద్ధాలని ప్రోత్సహించే ఓ ప్రదేశం ఉందని మీకు తెలుసా?

02/01/2016 - 08:36

సంవత్సరంలో ఒక రోజుని కోల్పోవడం సాధారణంగా జరగదు. కానీ ఫిలిప్పీన్స్ సంవత్సరంలో ఓ రోజుని కోల్పోయింది!

01/23/2016 - 18:21

జపాన్ దేశస్థులకి పని వత్తిడి అధికం. వారి సంస్కృతి ఏ పనైనా విడవకుండా సమర్థవంతంగా, లోపరహితంగా చేయడం. సగటు జపనీస్ ఉద్యోగి పని గంటలకన్నా ఎక్కువ కాలం ఆఫీస్‌లో గడుపుతాడు. దాంతో వారిలో మానసిక వత్తిడి అధికంగా ఉంటుంది. దీన్ని అణచడానికి జపాన్‌లో అనేక చిత్రమైన సేవలు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని కేవలం ఆడవారికే పరిమితం.

01/14/2016 - 17:59

పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లడం ప్రపంచంలోని చాలా దేశాల్లో జరుగుతూనే ఉంది. ఇండియా నించి దుబాయ్‌కి, బంగ్లాదేశ్ నించి ఇండియాకి కూలీలు వలస వెళ్తూంటారు. ఇలాగే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా యూరప్‌కి వలస వెళ్తున్నారు. కాని వారి సంఖ్య తక్కువ.

01/09/2016 - 17:49

వజ్రాల గనుల్లో పనిచేసేవారు పనయ్యాక బయటికి వచ్చేప్పుడు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కాని పంపరు. అలాగే సందర్శకులని కూడా. వజ్రాల గని నించి ఎవరూ వజ్రాలు తీసుకెళ్లకూడదని ఈ భద్రతా చర్యలు చేపడతారు. కానీ ప్రపంచంలో ‘నీకు దొరికిన వజ్రం నీదే’ అనే ఆదర్శంతో ఓ వజ్రాల గని నడుస్తోంది!

01/02/2016 - 17:45

టెక్సాస్‌లోని కోర్సికానా అనే ఊరు. డాలస్‌కి 50 మైళ్ల దూరంలోని ఆ ఊళ్లో 28 జూలై 2015 సోమవారం పధ్నాలుగేళ్ల టీనేజర్ (పేరు గుప్తంగా ఉంచారు) తల్లిదండ్రులు బయటికి వెళ్తూ, వాడి ఆంటీని చూడమని చెప్పి వెళ్లారు. ఆవిడ టీవీ చూస్తూండగా ఆ కుర్రాడు బయటికి వెళ్లిపోయాడు. టీవీ కార్యక్రమం పూర్తయ్యాక వాడి కోసం ఇల్లంతా వెదికితే ఎక్కడా లేడు!

12/26/2015 - 23:59

పెద్ద నగరాలలోని ప్రధాన సమస్య ఇంటి అద్దె. సామాన్యులు దాన్ని భరించలేరు. దాంతో అనేక ప్రత్యామ్నాయాలని కనిపెడుతున్నారు. టోక్యోలో కేవలం మనిషి పడుకునేంత కొలతలు గల పెట్టెలని అద్దెకి ఇస్తారు. కామన్ బాత్‌రూమ్స్ వాడుతూ రాత్రి పడుకుని పగలు ఆఫీసులకి వెళ్లిపోతారు. విలువైన వస్తువులను దాచుకోవడానికి చిన్న ఐరన్ సేఫ్‌లను ఇస్తారు.

12/19/2015 - 18:26

ప్రపంచంలో అనేక రకాల క్లబ్స్ ఉన్నాయి. క్రీడాకారులకి, తపాలా బిళ్లలు లేదా నాణేల సేకరణదారులకి, పేదలకి సహాయం చేసేవారికి... ఇలా లక్షలాది అంశాల మీద క్లబ్స్ ఉన్నాయి. వీటిలో అధిక భాగం అమెరికాలో పుట్టినవే. ముగ్గురు అమెరికన్స్ కలిస్తే ఓ క్లబ్ పుడుతుందనే నానుడి కూడా ఉంది. 1954లో కేలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఓ వింత క్లబ్ పుట్టింది. దాని పేరు ట్రావెలర్స్ సెంచరీ క్లబ్, లేదా టిసిసి.

Pages