S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

02/17/2018 - 23:49

మహావైద్యనాథయ్యర్
(1844 - 1893)
తంజావూరుకు సమీపంలోని ‘వాయచెరి’ స్వగ్రామంలో జరిగిన ఆయన గాత్ర సంగీత కచేరీకి సుమారు ఇరవై వేల మంది హాజరై ‘మైకులు’ లేకపోయినా హాయిగా విని ఆనందించారు. అటువంటి దివ్యమైన శారీరం ఆయనది.

02/10/2018 - 23:39

అర్థవంతమైన మాటలు, సారవంతమైన సంగీతంతో కలిస్తేనే నిజమైన సార్థకత.

02/03/2018 - 21:34

త్రికరణ శుద్ధిగ జేసిన పనులకు దైవము మెచ్చును, లోకము మెచ్చును.. అంటాడు తాళ్లపాక అన్నమయ్య.
త్యాగరాజ కీర్తనలకున్న అర్థం తెలిసి పాడితే చాలు. ఆ కీర్తనల్లోని రాగాలు భావంతో పాడేలా చేస్తాయి.
‘అంతా గాయకులే, అంతరంగమున ఆత్మానంద చిన్మూర్తితో పంతాలాడెడు పందెగాడు ఒక్కడూ లేడయ్యా’ అనేవారు, కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులనే సంగీతజ్ఞుడు.

01/27/2018 - 23:40

‘తెలిసి రామ చింతనతో నామము
సేయవే ఓ మనసా’
తలపులన్ని నిలిపి నిమిషమైన
తారక రూపుని నిజ తత్త్వార్థము
రామాయణ చపలాక్షుల పేరు
కామాదుల పోలు వారు వీరు
రామాయన బ్ర హ్మమునకు పేరు
ఆ మానవ జన నార్తులు దీరు ॥
అర్కమనుచు జిల్లేడునకు పేరు
మర్కట బుద్ధులెట్లు ధీరు
అర్కుడనుచు భాస్కరునకు పేరు
తర్కమనే అంధకారము దీరు ॥
అజమనుచును మే షమునకు పేరు

01/20/2018 - 20:44

మన అరచేతిని చూసుకుంటే అందులో అడ్డదిడ్డంగా ఎన్నో రేఖలుంటాయి. ఒక్క గీత మనం గీయగలమా?
మన కంటికి కనిపించకుండా ఎవ్వరూ వెదికే వీలు లేకుండా గూఢంగా ఎక్కడో వుంటూ, మన తలరాతలు రాస్తున్నాడే! ఆ మహానుభావుడు? ఎంత గొప్ప శిల్పియో చూడండి.
అర్థరహితంగా కనిపించే భగవంతుని చర్యలోనే అనంతమైన విజ్ఞత దాగి వుంది. ఈ సత్యాన్ని ముందుగా మనకంటే తెలుసుకున్న వారినే మనం పూర్తిగా నమ్మేయాలి.

01/06/2018 - 21:40

సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి (1759-1847)
ఆరాధనోత్సవాల సందర్భంగా ప్రత్యేకం
*
‘మనిషి జన్మకు మూలం అన్నం. ఆనందం మానవుని గమ్యం - అన్నగత ప్రాణియైన మనిషి ప్రాణాన్ని కుదుటపరచుకుని జ్ఞానం సంపాదించి ఆనంద స్థితికి చేరుకుంటాడు’ అని ఉపనిషత్తులు చెప్పే మాట.

12/23/2017 - 21:57

లోకంలో సాధారణంగా మనుషుల ప్రవృత్తులకీ, చేసే వృత్తులకీ పొంతన కనిపించదు. వినేవారి చెవుల్ని పట్టి ‘నాదం’తో పాట పాడి మెప్పించటం ఒక కళ.
పాడాలనే ఉత్సాహం ఉంటుంది. శ్రుతి పక్వమైన కంఠస్వరం వుంటుంది. చేసే వృత్తులు వేరై పోతాయి. నేర్చుకోవాలని వున్నా వీలుపడదు కొందరికి. కంఠస్వరాలు శ్రుతిలో వుండవు. ఎంతో నేర్చుకుని పాడేయాలని ఉంటుంది. కానీ ఎంత నేర్చుకున్నా దారీతెన్నూ దొరకదు కొందరికి.

12/03/2017 - 00:20

డిసెంబర్ 4 ఘంటసాల జయంతి
*
అమృతవర్షిణి పాఠకుడైన సంగీతాభిమాని నాలుగు రోజుల పాటు మా ఇంటికి వస్తూ కూర్చుంటే చెప్పిన మాటల సారాంశమే యిది.

11/25/2017 - 21:00

వక్తా.. శ్రోతాచ దుర్లభా! అంటారు. సంగీత రసజ్ఞత, సంస్కారం కలిగిన శ్రోతలెదురుగా ఉంటే విద్వాంసుడు గజారోహణం చేసినంతగా సంబరపడతాడు. తన విద్యకు సార్థకత లభించినంతగా పొంగిపోతాడు. సర్వసాధారణంగా మహా విద్వాంసుల కచేరీకి బొత్తిగా సంగీత సాహిత్య వాసన లేని ప్రముఖుల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తూంటారు. సంగీతం గురించి తెలిసీ తెలియని మాటలేవో నాలుగు చెప్పి వేదిక దిగి వెళ్లి మొదటి వరుసలోనే ఆశీనుడౌతారు.

11/18/2017 - 22:20

మనసులో ఏర్పడిన అనుభూతి శబ్దాన్ని ఆశ్రయిస్తే మంచి పాటవుతుంది. సుస్వరంతో కలిస్తే సుమధుర నాదంతో గుండెల్లో నిల్చిపోతుంది. మాటల కంటే పాటకు ఓ శక్తి వుంది. మాటల కందని భావాలు పాటతో సుసంపన్నవౌతాయి. అందుకే పాటకు ఆకర్షణ ఎక్కువ. అంతర్ముఖుడై గానం చేసేవారికి అసలు పునర్జనే్మ లేదు. సాహిత్య సరస్వతికి నాదం చీరె. పద సముదాయమంతా దేహం. అర్థం ప్రాణం. భావం ఆత్మ.

Pages