S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

10/09/2016 - 22:47

నేను, నా సహచరుడు, మా అబ్బాయి, మా కోడలు వారాంతపు సెలవులలో సియాటిక్ నగరం నుండి కెనడాలోని వాంకూవర్ విక్టోరియా సందర్శనకు ప్లాన్ చేసుకున్నాం. మా ఓడ ప్రయాణానికి ముందుగానే టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్నాం. మేం అమెరికా వీసాతోపాటు, కెనడా వీసా కూడా భారత్‌లోనే తీసుకున్నాం.

10/01/2016 - 21:28

మన దేశంలోని అటవీ ప్రాంతాలు విభిన్న రకాలకు చెందిన వేలాది వన్యప్రాణులకు నిలయమై జీవ వైవిధ్యానికి పేరుగాంచాయి. అయితే ఇటీవలి కాలంలో పారిశ్రామికీకరణ, అభివృద్ధి పేరుతో - అటవీ ప్రాంతాలలో కూడా ప్రాజెక్టులు, ఆనకట్టలు నిర్మించడం, గనుల త్రవ్వకాలు, అలానే రోడ్లు వేయడం వంటి పనులను చేపట్టడం వలన వన్యప్రాణుల మనుగడకు పెనుముప్పు ఏర్పడి, చాలా జాతుల వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోవడం..

08/20/2016 - 22:17

చైనాలో మేం చేసిన పర్యటన జ్ఞాపకాలు ఇంకా మదిలో మెదలుతూనే ఉన్నాయి. మా ప్రయాణం జరిగి అప్పుడే ఏడాది కావస్తున్నా నిన్న మొన్నటి పర్యటనగా ఉంది. అందుకే ఆనాటి విశేషాలు మరోసారి గుర్తు చేస్తున్నా...

07/24/2016 - 02:31

రాజసానికి అది చిహ్నం...
అందానికి అది గుర్తు..
సాహసానికి మారుపేరు..
దూకుడుతోకూడిన జీవనశైలికి చిహ్నం..
అదే పెద్దపులి...బెబ్బులి...
ఇప్పుడు దానికి పెద్దకష్టమొచ్చిపడింది.
ఆ జాతి ఇప్పుడు అంతరించిపోయే దశకు చేరుకుంది..అతివేగంగా..
భావి తరాలకు పులుల గురించి చెప్పాల్సి వస్తే బొమ్మలు చూపించే చెప్పే పరిస్థితులు దాపురించాయి. ఈ పరిస్థితికి మనమే కారణం.

06/26/2016 - 01:27

గురువుగారు లేకుండా అప్పుడే ఏడాది గడిచింది. ఇంటా బయటా ఏ సమస్య వచ్చినా గురువుగారికి చెప్పుకుంటే తీరిపోతుంది; ఏ చిక్కునైనా ఆయనే విప్పాలి; ముఖ్యమైన ఏ నిర్ణయమైనా ఆయనే చేయాలి; ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక ఫోన్ చేస్తే చాలు; అన్నిటికీ ఆయనే ఉన్నారు - అన్న భరోసాతో ఇన్నాళ్లూ ధీమాగా బతికేశాం.
ఆ లగ్జరీ ఇప్పుడు లేదు. ఆ ప్రివిలేజి మరి రాదు.

06/26/2016 - 00:18

పూజ్య సద్గురు కందుకూరి శివానందమ్తూగారి శివసాయుజ్యంతో భారతీయ ధార్మిక ఇతిహాసంలో ఒక అపురూప ఉజ్వల ప్రకరణం ముగిసింది. ఆరు దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ప్రజాజీవన, సేవా రంగాల్లో లక్షల మందిని ప్రభావితులను చేసి ధర్మ మార్గాన నడిపించి, విలక్షణ పౌరులుగా తీర్చిదిద్దిన ఒక దివ్యశక్తి చరిత్రాత్మక జీవనయాత్ర చాలించింది.

03/20/2016 - 00:38

నేపాల్ రాజధాని ఖాట్మండు. ఇదొక లోయ. వ్యాపార రాజకీయ సాంస్కృతిక కేంద్రం కూడా. ఈ లోయ 24 కి.మీ. పొడవు, 19 కి.మీ. వెడల్పు చుట్టూ ఆకుపచ్చని వృక్షాలతో ఉన్న పర్వతం. అక్కడక్కడ ఎర్రటి పెంకులు కప్పబడినట్లు ఉంటుంది. సంప్రదాయానికి అద్దంపట్టే ఎన్నో దేవాలయాలు, బౌద్ధారామాలు ఉన్నాయి.

03/20/2016 - 00:20

‘నేను చాలా అదృష్టవంతుడిని’ అని భావించేవారినే అదృష్టం వరిస్తుంది. శుభప్రదమైన ఆలోచనలు అయస్కాంతం వంటివి. ఒక అయస్కాంతం ఇనుమును ఏ విధంగా ఆకర్షిస్తుందో శుభప్రదమైన ఆలోచనలు అదృష్టాన్ని ఆ విధంగా ఆకర్షిస్తాయి.

03/13/2016 - 21:03

ప్రపంచంలోనే ఎతె్తైన శిఖరాల్లో మూడవది కాంచనగంగ. దీని ఎత్తు 8,586 మీటర్లు. నేపాల్, సిక్కింలు తూర్పు తీరంలో వుండే భారతీయ స్వయంపాలిత ప్రాంతం కాంచనగంగ. ఈ పర్వతం దిగువ నుండే ప్రజానీకం ఎల్లప్పుడూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తారు. సిక్కిం ప్రజలు ఈ పర్వతాన్ని తమ దేవతగా పూజిస్తారు. ఐదు శిఖరాలతో ఉండటంవల్ల వారి తలలకు ఐదు పుర్రెలు ధరిస్తారు.

03/13/2016 - 08:31

ఎవరైనా మిమ్మల్ని ఫలానా సబ్జెక్టులో పనికిరాని వాడివని అంటే మీరు ఘనత చెందిన మేధావుల జాబితాలో ఉన్నట్లే. ఐన్‌స్టీన్ బాల్యస్థితిలో మాట్లాడటం, ఆలస్యంగా వచ్చింది. చదువులో చురుగ్గా ఉండేవాడు కాదు. తెలివితక్కువవాడని తండ్రి భయపడుతూ ఉండేవాడు.

Pages