S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

08/18/2017 - 20:43

ప్రశ్నించాలని ఉంది
ఈ నవ నవీన సమాజాన్ని?
అసలు భగవంతుడు మనిషిని సృష్టించాడా?
లేక మనిషిని భగవంతుడు సృష్టించాడా?
జ్ఞానం వున్న మనిషి తప్ప
ఏ జీవి భగవంతుడిని తలవనప్పుడు?
ఏ జీవికి భగవంతుడు
అవసరం లేనప్పుడు?
భగవంతుడు ఎక్కడ పుట్టాడు?
మనిషి తలపులోనా?
భగవంతుడికి రూపాన్ని ఇచ్చిన పాపం
మనదే అనాలనిపిస్తుంది?
కులం కులం?
మతం మతం??

08/18/2017 - 20:42

ఒంటరి గదిలో ఒక్కడిగానే ఉంటాను
బయటకి వెళ్లినప్పుడు
బాహ్య ప్రపంచం నన్నావరిస్తుంది
లౌకిక ప్రయోజనాలకు
పిచ్చిపిచ్చి ఆలోచనకు
లోనైపోతుంటాను.
ఒక్కొక్కప్పుడు ఒంటరి గదిలో
ఒక్కడినే ఉంటుంటాను
నాకెదురుగా నా కవులున్నారు
వారికి నీరాజనం సమర్పిస్తాను
నాతో వారు మాటాడుతున్న అనుభూతి
నాకేదో సూచనలేస్తున్న స్ఫూర్తి

08/18/2017 - 20:40

ఆమె
తూర్పున ఉదయిస్తున్న
నులివెచ్చని రవిబింబం

అవనిపై
గలగల పారుతున్న
అభిసారిక లాంటి సెలయేరు

ఆహ్లాదపరచే
తొలకరి చినుకుల్లోని
సన్నని నీటి తుంపర

నేలపై పరచిన
పచ్చని పంటల తివాచి

ఉదయానే్న
పచ్చికపై దొర్లుతున్న
తుషార బిందువులోని
ఇంద్రధనస్సు.
*

08/11/2017 - 23:31

ప్రతిబింబం
* అలలేని
కొలనులో
శిలలా
జాబిలి

హోళీ
* చిక్కినట్టే చిక్కి
తప్పించుకుంది
తుమ్మెద
వేళ్లకు రంగులు పూసి

హరివిల్లు
* నింగిదార్లో
రంగులొలికాయి
నేల మీది
చూపులు
పరుగెత్తాయి.

తారలు
* నింగి పుష్పాలకు
ఒకే వర్ణం
పరిమళించవు
ప్రకాశిస్తాయి

08/11/2017 - 23:30

నడుస్తూ నడుస్తూ కొలుస్తూ పోతే
నా దారి పొడవు.. నూరేళ్లు
ప్రియా,
నిన్ను తలుస్తూ తలుస్తూ మెరుస్తూ
మైమరుస్తూ పోతే...
ఏడేడు జన్మాలూ, ఓ గుప్పెడు క్షణాలే.

08/11/2017 - 23:28

సీతాకోక రెక్కలతో ఎగిరే
రంగుల ముగ్ధ మోహనత!
హరివిల్లులా విరబూసే
అందాల అద్దకపు కలనేత!

చీరంటే మన దేశ చరితకు ముఖచిత్రిక
చీరంటే మగువ మనసుకు భావ గీతిక
చీరంటే ప్రతి కంటికి ప్రశాంత వీచిక

అమ్మమ్మ కడితే తరతరాల కలబోత
అమ్మ కడితే అనురాగాల ఆప్యాయత
అమ్మాయి కడితే వలపుల పూదోట
పాపాయి కడితే పాలనవ్వుల దొంతర

08/11/2017 - 23:26

ఆశ్రీత మందార నిరామయ తన్మయ
అమందానంద జగదానంద నిలయ
నిర్మల సౌభాగ్య సుధాంబుధి చంద్ర
మనోజ్ఞ మనోహర మానస బింబ
సువాసినీ సహిత సకల స్ర్తి కరుణాలాలస
సత్సమ్మోహన నిత్య సుమంగళీ వరప్రదాయిని
శ్రావణ సమీర సంకేత గగన పతాక
గంగా, కావేరీ, సింధు సమేత సర్వ నదీ సమన్వయాంతరంగ
మాతా, పిత సమ ఆశీర్వాద భరిత
భోగ, సౌభాగ్య సువర్ణ మహిత.

08/11/2017 - 23:25

ఒక హృదయం నోచిన ఫలములు
ఒక మదిలో పండిన వరములు
అన్నాచెల్లెళ్లు అనురాగపు చంద్రికలు మమకారపు మాలికలు
చెల్లాయి నవ్వులో కురిసే ముత్యాలు
అన్నయ్య ఇంటిలో వెలసే భాగ్యాలు
చెల్లి ఆశాలతకు జీవజలం అన్న
అన్న సన్నిధిలో ఆకాశం అందుకొను చెల్లి
చెల్లి ఇల్లాలై వెళ్లి కంటికి దూరమైనా
అన్న అరచేతిలో ఆమె అడుగుల గుర్తు చెదిరేనా
అన్నకు చెల్లి ఆరోప్రాణం

08/11/2017 - 23:23

అండల కొండ మీద నిలిచిన చెట్టు
నిశ్శబ్దానే్నం నేరుస్తుంది?
ఏ గాలికైనా బాకా ఊదుతూనే ఉంటుంది

నూరుపేజీల బరువైన ‘మూట’
పాతిక పేజీల ‘మొహమాట’లూ
పాతిక పేజీల ముఖస్తుతులూ
‘సరుకు’ చాలా ఉంది
మహాకవిత్వానికి ఈలలూ, చప్పట్లూ!

07/31/2017 - 22:23

మారెమ్మల్లా బోరు బావులు పసిపిల్లల
బలి కోరుతున్నాయి
నిర్లక్ష్యం, నిరక్షరాస్యత,
పేదరికం, అమాయకత్వం
బోనాలను సమర్పిస్తున్నాయి
ఎన్నిసార్లు ఎన్ని వార్తలు
దున్నపోతు మీద కురిసిన
వాన చినుకులవుతున్నాయి
కన్నతల్లులకే కాదు
వార్తలు కన్నవారికి విన్నవారికి
పేగులు కదలిపోతున్నాయి.
ప్రమాదం జరిగినపుడు
పరుగెత్తి పెద్దఎత్తున

Pages