S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

07/29/2017 - 22:09

నియాన్ లైట్ల వెలుగులో
సుఖమెరుగని నిద్ర...
రోడ్డు పక్కన చెత్తకుండీలో
రుచి ఎరుగని ఆకలి
డబ్బున్న తాగుబోతుల వినోదానికి
భద్రతలేని బతుకు భయం
నగర మృగాళ్ల విహారానికి
మూలన దాక్కొన్న పసిలేడి కూనలు
పగలంతా రెక్కలు ముక్కలు అయినా
రాత్రి భయం వెంటాడుతుంది
కాలుష్యపు కాటుకి బలైపోతూ
బక్కచిక్కిన దేహాలు

07/16/2017 - 04:49

పరిమళ శ్వాసతో పరవశిస్తున్న నిశ్శబ్దం
ప్రాగుదిత చరణ స్పర్శకు
తొంగలి ఱెప్పలెత్తి
మంగళ గళం విప్పింది
పుడమి ఒత్తిగిలినట్టు పుటను త్రిప్పుతూ వాడు-
రస పౌత్తికంలో తడిసిన పద సౌమనస్యాన్ని పద్యం చేస్తూ
ఆ క్షణాన్ని అనుభూతిగా శాశ్వతీకరించే
పదచిత్ర భంగిమల్ని వెలారుస్తూ వాడే-
లోకం నుండి భిన్నం కానిదాన్ని లోలుపజేసి
కలలు నేస్తూ - కౌముదులు కాస్తూ

07/16/2017 - 04:48

ఓ చిన్నారి ఆలోచన
కనువిప్పు...
మనస్సు కంచెలను
తెంపుకొని
నేను వెళ్తున్నాను...
చలికి వణికే
దేహానికి
నా పాత రగ్గులేమైనా...
రాళ్లూ ముళ్లుగా
నడిచే పాదాలకు..
కొంతైనా...
మూలకు విడిచిన
పాదరక్షలు...
చిల్లులు పడ్డ
పాలితిన్ కవరుగా
తడుస్తున్న దేహానికి
పాత గొడుగుతో..
ముల్లెలుగా
కట్టిన బట్టలకు

07/16/2017 - 04:47

నిన్న నేనొక
కన్నీటి బొట్టు మీద సంతకం పెట్టాను
నిప్పురవ్వల ఎగిరిందేమిటీ?
లాఠీల ప్రశ్న
అది
అమరుల ఆత్మత్యాగం నుండి వచ్చిన కన్నీరు
రైతుల ఆత్మహత్యల నుండి వచ్చిన కన్నీరు
వాడిపోయిన చెట్టు వేడివేడిగా కార్చిన కన్నీరు
ప్రపంచాన్ని దహించే కన్నీటి బొట్టు మీద
సంతకం పెట్టాను తెలుసా?
ప్రపంచ కన్నీరు నా కన్నీటిలో కల్సిపోయింది
అది వరద

07/16/2017 - 04:45

చిన్నప్పుడు మా అమ్మ
అప్పుడప్పుడు పొద్దునే్న లేపి
పాలు తేవడానికి పంపేది.

మసక చీకట్లను విసర్జిస్తున్న
సడక్ మీద
బిక్కుబిక్కుమంటూ వెళ్లేవాడిని.
దానిపై నేను నడుస్తున్నట్టు కాక
అదే నన్ను నడిపిస్తున్నట్టు అనిపించేది.

07/16/2017 - 04:44

ఒక్కటే బల్బ్
జగమంతా వెలుగు
నిండు చంద్రుడు

నిన్ను చూసింది
ఒక్క క్షణం
తపిస్తున్నా అనుక్షణం

చీకటిలో
వెతుకుతున్నా
వెలుగులా వస్తావని

రోడ్డున పడ్డారు
త్వరలో
ఉపఎన్నికల కోలాహలం

07/16/2017 - 04:42

తెగిన వాక్యాల్ని తిరిగి సిద్ధం చేసుకుని
భాషల్ని లోలోపలికి అనువదించుకుని
ఆశల్ని ఆవాహనం చేసుకుని
కొత్త గొంతును సవరించుకున్నాక
మరో ప్రయాణం మొదలైంది
నిర్బంధాల వంతెనమీద నడుస్తుంటే
సహస్ర స్వరాల వెదురుగొంతుల వేదన
ఆర్తుల్ని దిద్దుతున్న అమ్మ గుండె అనిపించింది
నిజమే.. హృదయ ప్రమిదల్లో ఎన్ని చీకట్లో
నిశ్శబ్ద స్వరాల ప్రసారంలో

07/08/2017 - 21:52

మనసు సృష్టించే
ప్రకంపనలు
అలల్లా
కళ్లల్లో తొణికిసలాడి
కనురెప్పల్లో దాగి
చెవుల్లో ప్రతిధ్వనిస్తూ
పెదవులు దాటి రాని
మాటలకు భాష
ఏ లిపిలో కూడా దొరక్క
గొంతులో తడబడుతూ
హృదిలో తచ్చాడుతూ
భావ వ్యక్తీకరణలోనే
కాలం గడిచిపోతుంటే
భావం భాషపై
యుద్ధం చేస్తూ
వైరాగ్యంతో
మూగభాషని ఎంచుకొని
భావాన్ని

07/08/2017 - 21:51

నొచ్చుకున్నదెందుకో
కుచ్చుకున్న దేమిటో
తెలియకుండానే
జట్టు చెట్టు నుంచి
పిచ్చుకొక్కటెగిరిపోయిన ప్రతిసారీ
చిన్నబుచ్చుకుంటుంది నా మనసు
నా ప్రమేయం
ఉంటుందేమోనని ఊహించుకుంటూ.

నా కలం కార్చే పదం

నా గొంతులో ఇరుక్కుని
నన్నుక్కిరిబిక్కిరి చేసినా
భరిస్తాను!
మరకై
మరో మనస్సుని చిరాకు పెట్టకుంటే చాలు!

07/08/2017 - 21:49

కోనసీమలో..
సముద్రాన్ని చూసేను
యానగాలిపాడే
ఆకుపచ్చని పాటకు
మురిసిపోతున్న
లేత కొబ్బరి మొవ్వుల్లో...!

రాయలసీమలోనూ..
సముద్రాన్ని చూసేను
కరువుగాలి పాడే
అనంత దుఃఖపు దుర్భిక్ష గీతానికి
తెగటారిపోతున్న ఎడారి పల్లెల కళ్లల్లో...!!
*

Pages