S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

07/08/2017 - 21:47

వీచే గాలి అలా ఊరికే సాగిపోదు!
పలు నడకల పదనిసలై అలుపెరగని దుమారవౌతుంది..
ప్రచండమో ప్రశాంతమో పలు భంగిమల ప్రవాహవౌతుంది!
మురళితో రవళిని కొలిచి గాంధర్వాన్ని చిలికినా
ప్రతిమని మనిషిగ మలిచి గానామృతాన్ని పంచినా...
అరవీచికలై పెనవేస్తూనే ఆహ్లాదంగా లంఘిస్తుంది!
పెగలని ప్రేమ పరాగాన్ని మీటుతూ
పుప్పొడి పదనిసలని దేహమంతా అద్దుతుంది!

06/25/2017 - 20:52

అందరూ నా వాళ్లనుకుని
తమ వాళ్లను వూళ్ల వద్దనే వదిలేసి
పొలిమేరలలో పహారా కాస్తున్నారు
పరాయి వాడి పాదం సరిహద్దు మీద
ముద్ర వేయకూడదని దీక్షబట్టి
చప్పుడు పడనీయని రెప్పలతో
చలి దుప్పటిని చీల్చుకుని
మరీ దృష్టిని సారిస్తున్నారు
ఎక్కడో చిన్న అలికిడి
దుప్పిని మించిన వేగంతో
శబ్దం దిశగా పరుగులు
వురుముల్లేని పిడుగుల్లా

06/25/2017 - 20:51

ఒళ్లంతా
ఉప్పుమేటలుగా
ఎకసెక్కాలు పోయిన దేహం
వానచినుకును
శరీరమంతా తొడుక్కొని
సేదతీరింది...
చేతి అల్చిప్పల్లో
చినుకులను ముత్యాలుగా మార్చి
మొలక పాదులకు దోసిళ్లతో
బదులుగా
గులాబీ తన పెదవులపై
చిరునవ్వుల
తుశారాలు పూయించింది...
నవ్వు ఇంత గొప్పదా అనుకుంటూనే
నవ్వి చూడు...
ముఖ పుష్పమూ వికసించింది

06/25/2017 - 20:50

వృద్ధాప్యంతో ఒంటరిగా మిగిలాను
చెట్టుకూ నాకూ పెద్ద తేడా లేదు!
మోడుబారి వౌనంగా నిలిచాను
మట్టికీ నాకూ పెద్ద తేడా లేదు!
అవసరానికి వాడుకొని,
అవసాన దశలో అసహ్యించుకుంటారు!
పీల్చి పిప్పి చేసుకొని,
చివరి దశలో చీదరించుకుంటారు!

06/25/2017 - 20:48

నాలోని... తీవ్ర సంఘర్షణలకు..
నా తార్కిక తీర్మానాలకూ...
పరాకాష్ఠ.. నా సాహిత్యమే..!
నా మది వేదనలను మొరపెట్టుకునేది..
నా అనన్య స్నేహితుడైన సాహిత్యంతోనే...
నా సాహిత్యం.. తన ఏకాంతంలో...
నన్ను అనంత లోకాల్లో.. విహరింపజేస్తుంది..!
తన పారలౌకికతతో...
నాకు అలౌకికానందాన్ని అందిస్తుంది..!
చలన రహిత నిస్సారమైన నా బ్రతుకుకి...

06/18/2017 - 23:52

నిలువెత్తు నీడ
నాకు తోడొస్తుంది
ఎంతెత్తు కట్టడాలనైనా
చిటికెలో అధిగమించేస్తుంది
కడలి సుడుల అడుగు
అగాధంలో సైతం
సంవత్సరాల తరబడి
‘శ్వాస’ పీల్చకుండా
సాహసయానం చేస్తుంది
అందరినీ అలరించి
ఆశ్చర్యంలో ముంచెయ్యాలని
ఎన్ని అద్భుతాలు చేసినా
తనని ఎవరూ గుర్తించలేదని
‘మాట’ మానేసి వౌనంగానే
తన సాహసాలను సాగిస్తుంది

06/18/2017 - 23:51

అలా ఒంటికాలితో
జపం చేస్తున్నదేం
కొంగ
చేపల్ని వేటాడ్డానికా...

కావ్... కావుమంటూ
మందిని కాకి
పిలుస్తున్నది
సమష్టి ఆరగింపుకా...

తోటంతా గాలించి
శోధించీ చిలుక
ఓ తియ్యని జాంపండుని
సాధించి వదిలి వెళ్లిందే...

06/18/2017 - 23:49

మా ఇంటి చూరు కింద కుంపటి
పస్తుల పూటల్ని దాటుకుంటూ
ఇయ్యాల.. కాస్తంత రాజుకొంటుంది
ఒళ్లంతా పేదరికాన్ని కప్పుకున్న
కట్టెలు కూడా కనికరంగా
పెళపెళమంటున్నాయ

06/18/2017 - 23:47

సన్నగా పొందిగ్గా
పొడుగ్గా పెరిగి
పక్వానికొచ్చి
ఎర్రగా మిలమిల మెరిసే
నన్ను అల్లారుముద్దుగా పెంచుకున్న
నా రైతు బతుకుటకై
మార్కెట్టుకు తరలించగా
వేలంలో వెర్రిగా బలై
కూడబలుక్కున్న దళారీల దగుల్బాజీల
మూడుముక్కలాటలో
ముప్పుతిప్పలపాలై
అప్పుల రొంపిలో
ఎగబోస్తూ ఎగాదిగా
తూలనాడుతూ
తక్కెడలో తూస్తున్న నన్ను చూసి

06/18/2017 - 23:45

వెంటాడే వేధించే భయానివి నువ్వు
నీ కోసం వెతుకుతూ వేచి ఉన్న ప్రేమని నేను
అందనంత దూరంలో నువ్వున్నా...
అందుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నా!
సముద్రంలోని అలలా ఎప్పుడూ పారిపోతూనే ఉన్నావ్!
నీ శ్వాసనై నీలో చేరిపోదామనుకున్నా...
కానీ నిఛ్వాసనై విడిపోతానేమోనని భయం
నీ నీడనై ఉందామంటే చీకటితో చెరిపేస్తావని భయం
వాననై వచ్చి పలకరిద్దాం అంటే

Pages