S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

01/06/2018 - 19:58

తెలుగు
వెలుగై వెలిగిన
పల్లె వెలుగు..
పల్లె వెలుగనేమి
తెలుగు వెలుగు..
అమ్మ ఆవు ఇల్లు
శిశువు మురిపాలు తెలుగు
తెలుగు వెలుగు
చేతవెన్నముద్ద
తేనతీపిమాట
తీయనైన
కోకిలమ్మ పాట తెలుగు
చిలుక పలుకు తెలుగు
చెఱకుగడ తెలుగు
కదళీఫలము తెలుగు
నారికేల నీరము శుచి తెలుగు
తేట తెలుగు
సుమము తెలుగు

01/06/2018 - 19:56

అది ఒక కళ
శ్రీరామ పాదంలా
శిలని స్పృశించే కళ.
ముత్యం చిప్పలు వొలుస్తున్నట్టు
నిధి తొవ్వుతున్నట్టు
రాతి వొంట్లో
శిల్పం చెక్కుతూ
ఊహలు వెతుకుతున్న
మల్లెమొగ్గల్లాంటి చేతివేళ్ల కొసలు
చితికి దూకే దుఃఖం
కంటి చూపులో
శకలమై రగిలే ఎర్రటి విధ్వంసం.
లయ తప్పని శబ్ద సౌందర్యం
అరచేతిలో పొక్కులై భగ్గున మండే భాస్వరం

12/23/2017 - 18:26

చెడు కనకు
చెడు వినకు
చెడు మాట్లాడకు-
ఇది నిన్నటి నీతి!

చెడు కను
చెడు విను
చెడు మాట్లాడు
కానీ చెడిపోకు-
ఇదీ నేటి రీతి
మరి రేపు-
మంచి కనకు,
మంచి వినకు,
మంచి మాట్లాడకు -గా
మారుతుందేమో నన్నదే
ఎప్పుడూ..
అంతా మంచే జరగాలని
కోరుకునేవాళ్ల భీతి!

12/23/2017 - 18:26

విశ్రాంతి కోరిన తనువు
పానుపుపై ఒకింత వొరిగింది
అయినా మనసు మాట వినదు కదా?!
తనువుకు సంబంధం లేకుండా
జ్ఞాపకాల తలుపులు తెరిచింది
ఎప్పటివో పసితనపు పరుగులు
అప్పటి నేస్తాలతో తిన్న కాకెంగిళ్లు
అట్లతద్దినాడు వెనె్నల్లో బువ్వారగింపులు
చెట్లకు కట్టిన ఉయ్యాలల సయ్యాటలు
అలకల కొలికివంటూ అమ్మ మురిపాలు
మా ఇంటి మాలచ్చి వంటూ నానమ్మ దిష్ఠితీతలు

12/23/2017 - 18:24

పరిచయం లేని ప్రపంచంలో
నా తొలి పరిచయం
అమ్మ
పులకించిన నా పెదవులకు
చిరునవ్వులు నేర్పింది
అమ్మ
తొలకరి మూటల పలకరింపులే
కేరింతల సవ్వడుల కోసం
నా ఎదపై నర్తించింది
అమ్మ చేతివేళ్ల సరిగమలే
కుదిరీ కుదరని కుదురు కోసం
పారాడిన నా పాదాలు చూసి
పొంగిపోయింది అమ్మ మనసే
ముద్దులొలికే ముద్దమాటలు
పెదవి దాటి వస్తుంటే

12/23/2017 - 18:22

ఒకప్పుడు నేనంటే ఎంత గౌరవం
మూర్త్భీవించిన విలువలు...
నిస్వార్థ ప్రజాసేవతో
ప్రతి గుండె పులకించింది..

మేమున్నామంటూ
విద్యావంతులు, నిపుణుల
మేధోమథనంతో
జనానికి మరింత దగ్గరయ్యాను

12/23/2017 - 18:21

లేతప్రాయంలో ఆలోచనలతో
మొలకెత్తే బాల్యాన్ని, కేజీల
బరువులతో వీపులపై మోయిస్తున్నారు కన్నవాళ్లు
వాళ్లు మోయలేక పోతున్నారు!
ఆటలాడే సమయంలో
విస్తీర్ణత లేని గదుల్లో యిరికిస్తున్నారు
తెల్లారితే చాలు. చదువు, చదువు
కన్నవాళ్ల ఆశలను మోయలేక పోతున్నారు!
యుక్త వయస్సులో ‘కోరికల వలయం, పోటీలమయం’
ఎటువైపు తూగాలో తెలియని సందిగ్ధం

12/23/2017 - 18:20

ఆ పూలచెట్టు లేకుంటే
ఆ ఇల్లు ఒక నిర్జీవ చిత్రం.
కింద నీళ్లు లేకుంటే
ఆ వంతెన వొట్టి రాతి గొలుసు.
వాహనం ఒక్కటీ లేక
ఆ రోడ్డు ఒక నిరర్థక సుందర శూన్యం.

మనిషే అన్నిటికి మూలం
ఒక ఊహ లేక
కించిదావేశం లేక
భావుక సీమల్లో
ఎడారులు పరుచుకుంటున్నప్పుడు
అదొక వికీర్ణ విశీర్ణ దృశ్యం.

12/23/2017 - 18:19

ప్రపంచ పఠం మీద
యుద్ధ మేఘాలు
విమాన విన్యాసాలు
మానవ మేధస్సు
ప్రకాశించిన ఆనవాళ్లు
సామాన్యునికి బ్రతుకు భయం!

దేశం నలుమూలలా
అత్యాచారాలు
హత్యలు ఆత్మహత్యలు
కుప్పలు తెప్పలుగా
పెరిగిపోయిన కోర్టు కేసులు
రక్షణ కరువైన రోజులు!

12/16/2017 - 20:03

మనసు అద్దంలో అక్షరాలే
హృద్రోగం పడగ నీడలో చిన్నారులు
మంటల్లో ఆహుతయ్యే పసిమొగ్గలు
పారాణి ఆరక ముందే బలి అయ్యే పడతులు
వెన్నుదన్ను చూసుకొనే రాజకీయ నాయకులు
రోజూ వచ్చే రోజులాగే రైతన్నల ఆత్మహత్యలు
ప్రతి నిమిషం
ప్రభుత్వ సహాయానికై ప్రాకులాటలు...
తిరగరాయండి జాతకాలు
సాటి వ్యక్తికి సహాయపడే
విశాల హృదయముంటే
చిన్నారులకు జీవితం ప్రసాదమే!

Pages