S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

08/20/2016 - 22:07

వినీల ఆకాశమే సాహిత్య పుష్టికి
బహు విశాల దృశ్య కావ్యం

కారు చీకటులను తరిమే సూర్యోదయమే
సాహిత్యానికి ఎక్స్ కిరణాల దివ్యదృష్టి

దోబూచులాడే వాయువే
భిన్న అభిరుచుల సాహిత్యానికి
మూల ప్రాణ ధాతువు

తేలియాడే మబ్బులే
ఊహల లోకాల కవిత్వానికి
సయ్యాటల ఊయలలు

కిలకిలరావాలతో ఎగిరే పక్షులే

మనోస్వైర విహార రచనలకు
వినసొంపైన శృతిలయలు

08/20/2016 - 22:04

నా గుండెల్లో ఎవరో కాగడాను పెట్టి తిప్పినట్లు
నే బతికుండగానే నా తలకు కొరివి పెడుతున్నట్టు
నా అవయవాలన్నిటినీ చప్పుడు కాకుండా కొరికి తింటున్నట్టు
నా శరీరంలోని రక్తమంతా బయటకు వచ్చి అట్టలు కట్టినట్లు
ఎవరో నన్ను అధః పాతాళానికి తొక్కేస్తున్నట్లు
తెలియని వెలితేదో నా హృదయాన్ని కప్పేస్తుంది
ఆకాశాన్ని కురవని మేఘం కప్పేసినట్లు
సగం కాలిన కవురుకంపు

08/12/2016 - 23:01

వాన
బాట రెమ్మకు గొడుగు పూలు
గొడుగు పూలపై ముత్తెపు చినుకులు

వాన
రైతు గుండెలో ఆనందపు చెలక
ఆనందపు చెలకన తలెత్తి ఆకుమడి

వాన
పిల్లల మనసంతా మొలిచే రెక్కలు
మొలిచిన రెక్కల తడుస్తూ సీతాకోకచిలుకలు
వాన
చెట్లను కౌగిలించుకున్న చిరుసవ్వడులు
చిరుసవ్వడుల జాలువారుతూ పచ్చదనం

08/12/2016 - 22:59

ఈ ఆలోచన
నాలో ఓ తీర్పు!
సుదూరపు అలల పోట్లు మధ్య ప్రయాణం
చేసిన నన్ను లాగి
ఒడ్డున పడేసింది
ఈ ఆలోచన నాలో
ఓదార్పు!
దుఃఖసాగరం మధ్య వెలువెత్తే కన్నీటి
కడలిని రెప్పలమాటున పొదివిగా దాచుకుని
పైకి స్థిరంగా నిలదొక్కుకునే
మనోస్థయిర్యం ఇచ్చింది
ఈ ఆలోచన నాలో మార్పు!
దుర్మార్గపు చేష్టలుడిగి అనేకానేక చర్యలతో

08/12/2016 - 22:59

అతడిప్పుడు
నాతో మాట్లాడుతున్నాడు
గుండెల్ని పెనుమంటల్ని చేసినవాడు
పిడికిలితో సూర్యుడి నెత్తి మీద ఈడ్చి తన్నినవాడు
రణరంగంలో అశోకునివలే బౌద్ధ దీక్ష తీసుకున్నవాడు!
బుద్ధుడిలా ప్రజ్ఞని ప్రకటించినవాడు
అంబేద్కర్ చూపుడు వేలుతో
మనువు కళ్లను సూదితో గుచ్చినవాడు
భేతాళుడిలా సంచరించినవాడు
పరమ చండాల చరిత్రని పదిలపరచినవాడు

08/06/2016 - 22:19

ఒక్కసారి
బ్యాటరీ తినిపిస్తే చాలు
చాకిరీ చేస్తుంది
గడియారం
* * *

గవ్వలే
చలామణిలో వుంటే
సముద్రాలను
బతకనిచ్చేవారా?
* * *

నీ ఒంటికి పూసిన
అత్తరు ఎక్కడిది?
గులాబీలు చిందించిన
రక్తమే!
* * *

08/06/2016 - 22:17

ఏ రాత్రి
ఏ పగలు
నా యింటి ముందు తోరణం నవ్వటం
నేను చూడలేదు

ఏ ఉదయం
ఏ సాయంకాలం
నా ఇంటి వెనుక మల్లెతీగ
మందహాసం నేను చూడలేదు

08/06/2016 - 22:15

బెజవాడ కనకదుర్గమ్మ చల్లని చూపులతో
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడగా
తెలుగింట కళకళలాడే కళావైభవంగా
కదలి వచ్చింది కృష్ణా పుష్కరం

అమరావతి రాజధాని శోభతో
అలరారే కృష్ణానదీ తరంగాల
తెలుగు తల్లికి మంగళ హారతులు అందిస్తూ
కదలి వచ్చింది కృష్ణా పుష్కరం

07/30/2016 - 22:39

వ్యక్తిత్వ వికాసమిచ్చే
సౌందర్య జీవనశైలి సభ్యత
సామాజిక జీవనానికి స్వేచ్ఛా వారధి
సభ్యత మధుర ఫలాల మహావృక్షం
విశ్వమానవాళి సేదతీర్చే విశాల హృదయం
సభ్యత జీవన పయనంలో
ముందుకు నడిపే రాస్తాగా మలుపుతిప్పే చౌరస్తాగా
పడినా లేపి నిచ్చెనేసి నింగికి ఎగదోస్తుంది
సభ్యత నిరంతర చైతన్య జీవవాహిని
ఉద్రేకం ఉన్మాదాల మురికి కడిగేస్తుంది

07/30/2016 - 22:39

వనం కోసం మనమై...
కోటి గొంతుకల నినాదమై...
అంకురార్పణ చేసి..
పిడికిలెత్తి జైకొట్టి...
దోసిలిలో మొక్కనిలిపి...
తెలుగు రాష్ట్రాల కల్పవల్లి...
తెలంగాణ తెలుగు తల్లి మెడలో
పచ్చల హారమై మెరసి...
హరిత హారతినిచ్చి...
రేపటి తరాల వెలుగు పూల వనమై...
సంజీవనమై...
కదులుదాము కదులుదాము
జనులంతా ఏకమై...
ఒకరికొకరు చేయికలిపి

Pages