S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

12/02/2017 - 19:42

మంచులో తడిసిన
మల్లెపువ్వులా ఉండాలి మనస్సు
అప్పుడే వస్తుంది
జీవితంలోకి
సుందరోషస్సు
మనస్సు మధుభాండమైతే
మనిషి బ్రతుకు అవుతుంది
పూర్ణమిదం
పూర్ణ పురుషుడే ప్రపంచంలో
పుణ్య పురుషుడౌతాడు
పుణ్య పురుషుని చరిత్రే
భావి పౌరులకు పాఠవౌతుంది
‘మనుర్భవ’ అన్నది వేదం
మనిషీ! నీలోకి చూసుకో
అంటున్నది వేదాంతం

12/02/2017 - 19:42

మట్టిని కలనుగనక్కర్లేదు
మట్టి మీదేగా మనమున్నాం

మట్టినెవడు ఉద్ధరించనక్కర్లేదు
మట్టితోనే మన మనుగడ

మట్టి గుండెల్ని చీల్చుతాం
ఐనా పచ్చని ప్రేమే చూపిస్తది మట్టి

మట్టి మాయలు చేయదు
మట్టిపైన మనిషి చేసే మాయలు కొల్లలు

మట్టి మిడిసిపడదు
మిడిసిపడే మనిషి మట్టిలో కొరుగుతాడు

11/25/2017 - 18:41

ప్రభాత సమయంలో
లేలేత రవి కిరణాల స్పర్శతో
రేకులు విప్పుకుని
సుగంధాలను వెదజల్లుతాయి
సుమ బాలలు!
ఆయుర్దాం ఒక్కరోజే అయినా
అందం, ఆకర్షణ, సౌకుమార్యం, సౌరభం
అన్నిటితో మురిపిస్తాయి
మనసును పరవశింపజేస్తాయి
పొదలలో ముళ్లున్నా తమ
ఎదలో మధువును నింపుకుని
తుమ్మెదలకు కమ్మని విందునిస్తాయి!
మాల కట్టిన దారానికి సైతం

11/25/2017 - 18:39

పత్ర దళాల కదలికలు
గాలిని పుట్టిస్తాయి
వాటిని కదలనివ్వండి.

విదిలించుకున్న పక్షి రెక్కలు
స్వేచ్ఛకు అర్థాన్ని వివరిస్తాయి
వాటిని ఊగనివ్వండి.

ఉరుకులాడే ఉడుత పాదాలు
ఉత్సాహాన్ని సాక్షాత్కరిస్తాయి
వాటిని ఉరకనివ్వండి.

పడగ విప్పిన పాముల బుసలు
సమయస్ఫూర్తిని ప్రబోధిస్తాయి
వాటిని బుసలు కొట్టనివ్వండి.

11/25/2017 - 18:37

క్షమించడమంటే
ఒక ఉన్నత స్థానంలో నిల్చుని
క్రింది వాడిని తిరస్కారంగా
నిర్లక్ష్యపరచడం కాదు.
ఆంతర్యం నిండా
ఆధిక్య భావాన్ని నింపుకుని
లెక్కలేనితనాన్ని
ప్రదర్శించడం కాదు
ఒక అల్పుని మీద
దయా వర్షాన్ని కురిపిస్తున్నట్లు
నటించడం కాదు.
ఒక మహోత్తమ కార్యాన్ని దేన్నో
ఉదారంగా నిర్వహిస్తున్నట్లు
ఆడంబరం ఒలకబోయడం కాదు.

11/25/2017 - 18:35

సత్యం పలికి చూడు..
నిత్యం నీతో ఉండకపోతే అడుగు
ధర్మం నడిచి చూడు..
దయ చూపకపోతే అడుగు
నా దారిలో తిరిగి చూడు..
నీ దారులన్నీ తెరవకపోతే అడుగు
నా వైపు వచ్చి చూడు..
నిన్ను చూసుకోకపోతే అడుగు
నా నీడలోకి వచ్చి చూడు..
నీ పీడలు వదలకపోతే అడుగు
నా చరిత్ర చదివి చూడు..
నీ చరిత్ర మారకపోతే అడుగు
నా నామజపం జపించి చూడు..

11/25/2017 - 18:34

* ఉద్యోగి
నెల మొదట్లో
కుబేరుడు
నెలాఖర్లో
కుచేలుడు

* బడి పిల్లలు
కార్పొరేట్ బడి పిల్లలు
బంగారు పంజరంలో
చిలుకలు
సర్కారు బడి పిల్లలు
స్వేచ్ఛగ ఎగిరే
గువ్వలు
* కాటికి కాళ్లు
వృద్ధాప్యంలో జబ్బులు
దీపం ఆర్పే పురుగులు

11/25/2017 - 18:31

రెక్కలు విప్పని శాబకం
రెమ్మపై పడి
రెపరెపలాడినట్టు
పాలందక గిలగిలలాడే
పసివాడి గోల
వెలుగని పొయ్యిలో
ఎలుకల సందడి
పూనకం వచ్చిన గాలికి
పూలరెమ్మ లెగిరినట్టు
కమ్మల గుడిసెలో
నిమ్మలం లేని కాపురం
పట్టెడు కూడైన పెట్టక
కష్టమంత కల్లు దుకాణం పాలుజేసి
వొట్టి చేతులు చూపే
నికృష్టపు మొగడు
నిలదీస్తే

11/18/2017 - 19:43

తాతల నాటి
సేంద్రియ సేద్యం
చద్దన్నం మూట

జలపాతం
ప్రకృతి నిర్మించిన
అద్భుత కట్టడం
కలప శిల్పి
వడ్రంగి కొంపలో
కత్తి ‘పీట’ కరువు

చావు
మనిషిగా ఒకసారి
జాతిగా రెండోసారి

పీక కోసినా
గడ్డి చావదు
పశువుల కోసం

దీపావళి యుద్ధం
టపాసుల
ఛిద్ర కళేబరాలు

11/18/2017 - 19:42

సాకీ చల్లగాలిలా తాకింది
చర్మవ్యాధులు సమసిపోయేలా
పిల్లనగ్రోవి ఎవరో పిలుస్తున్నట్టు,
ఏ ఊర్థ్వ లోకాల నుంచో, గగన విహారిలా,
ఆహ్వానం పలుకుతున్నట్టు,
గుండె నాళాల్ని పట్టి లాగుతుంది.
తబలా డోలక్ మమేకమై, మెల్లగా
పసిపిల్లాడి నడకలా, జీవన వొడిదుడుకుల్ని గుర్తు చేస్తున్నాయి
మువ్వలు తోడై లయను పరిపుష్టం చేస్తూ, మనిషి మనుగడా,

Pages