S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

11/18/2017 - 19:41

ఆకులు కొమ్మలకు అందం
కొమ్మలు చెట్లకు అందం
చెట్లు జగతికి అందం
ఈ జగతి సృష్టికే అందం

పాదుకొన్న మూలాల్లో అవ్వా తాతయ్యల
విచ్చుకొన్న కొమ్మలు నాన్నైతే
ఆమె చాటుపిందెలు
అమ్మచాటు బిడ్డలే అవుతాయి
ముకుళించిన మూకుమ్మడి పూలమొగ్గల బిడియాలు
విరిసిన దరహాసపు పూరేకుల పరదాలు

11/18/2017 - 19:37

అక్షర లక్ష్యం కూడా
అభ్యుదయానే్న కాంక్షిస్తుంది
అణువణువునా తన
తనువును తాకట్టు పెట్టి
అభివృద్ధి కోసం నిరీక్షిస్తుంది!
అడుగడుగునా తన
మాటల బాటల్లో సుందర
భవిష్యత్తును వేడుకగా వెతుక్కుంటుంది!
అక్షరం - తనో ఆయుధం కావాలి - అని
అరాచక శక్తుల్ని అణచివేయాలని
అన్యాక్రాంతమై - విధినేల్తున్న అన్యాయాల్ని
బెదిరించి, ఎదిరించి, అదిలించి

11/18/2017 - 19:36

భౌతిక సూత్రాల
అధ్యయనం
సౌకర్యాల పెంపుదల
రోదసీ యాత్రల పరంపర
సాంకేతిక విజ్ఞతకు
కొలమానాలే కాని
హృదయ వైశాల్యతను
కొలిచే కొలబద్దలా
వికసిత మనసుల చేయునా!
అహాన్ని పెంచే చదువులు
అదో అథో ప్రపంచానికి లాగి
ఒంటరితనాన్ని మిగిల్చే యాంత్రికత
పదార్థ ప్రపంచ పరిజ్ఞాన
పరిష్వంగంలో
మానవుడు పూర్ణుడవుతాడా!

11/18/2017 - 19:33

ఏమిటో రంధీగా ఉంది
సమస్తం గందరగోళంగా వుంది
ఆకాశం మేఘావృతమయ్యింది
వర్షం పడవచ్చు పడకపోవచ్చు
ఉరుములు మెరుపులు
అగుపిస్తున్న దృశ్యాలు
సూర్యుడు వెలుగుతాడా లేదా తెలియదు
తెల్లారినట్టే కోడి కూసింది
ఎర్రబారినట్టే సూర్యుడు కనిపించాడు
తూర్పు అదృశ్యం సూర్యుడు మాయం
మనసు నల్లటి కొండతో నిండిపోయింది
సాగరం ప్రశాంతంగా వుంది కాని

11/16/2017 - 22:42

బుకాయించడం
అతడి నైజం
బుద్ధం శరణం గచ్ఛామి
దుమ్మెత్తి పోయడం
అతడి పని
ధర్మం శరణం గచ్ఛామి
సతాయించడం
అతడి పోకడ
సంఘం శరణం గచ్ఛామి
విగ్రహ స్వామ్యం
అతడి కాంక్ష
తమసోమా జ్యోతిర్గమయ

11/16/2017 - 22:40

ఆల్చిప్పల వంటి కళ్లలోంచి
జాలువారుతున్నాయి కన్నీళ్లు
కన్నీళ్లు చెపుతాయి కన్నీటి కథలు
కథలలో దాగున్నాయి వ్యథలు

అంతరిక్షానికి రాకెట్లు పంపగల మనిషి
అంతరాత్మలో గూడుకట్టుకున్న
చింతలను తెలుసుకోలేడు
శాంతిని పొందలేడు

చిన్న విత్తనం
వటవృక్షానికి మూలం
చిన్న ఆలోచన
మార్చు సమాజ స్వరూపం

11/16/2017 - 22:39

విష ఔషధాల వినియోగంతో
విరక్తి చెందిన నేలతల్లి
విముక్తి కోసం చేతులెత్తి మొక్కుతోంది
నా హృదయ క్షేత్రంలో
నాటిన విత్తనాల పిల్లల్ని-
పదిలంగా కాపాడమని-
ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేయమని!
విష రసాయనాల కృత్రిమ సేద్యంతో
విసుగెత్తిన పుడమి తల్లి-
విశాల హృదయంతో వేడుకుంటోంది-
ఎక్కువ దిగుబడి కోసం
ఎగబడి - తనలో శక్తిని హరించవద్దని

11/16/2017 - 22:38

నిరాడంబరంగా బ్రతుకుతున్న వారి
ఒంటిపైనుండి గోచీని సైతం గుంజుకుని
ఇంకా నిరాడంబరంగా బ్రతకమని
ఎగతాళి సలహాలు ఇచ్చేవాళ్లున్నట్టి
స్వార్థ ప్రగతి మాత్ర కాముకమైన ఈ జగతిలో...

11/16/2017 - 22:36

ఎప్పుడో అల్లిన పూలు
వాడినా వాడొచ్చు లేదా
విరహంలో పడి
రాలినా రాలొచ్చు
ఏ కాలానో ‘మోనాలిసా’
షహనాయి ఊదినట్లుగ ఉంది
నీడలో కదిలే ఓ బొమ్మ
కనిపించని నీడలో నుండి
పాట వినిపిస్తుంది.
కూలిన మొఘల్ దర్బార్
లో నుండి జాస్మిన్ తాజా పరిమళం
ఇంకా పరిమళిస్తూనే ఉంది
ఇష్టంగా ఈ దారిన
నడిచే వాళ్లకి ఇప్పుడు
కొంచెం ఇబ్బందిగానే ఉంది

11/16/2017 - 22:35

మనసొకటి సూచిస్తుంది
జిహ్వ మరొకటి మాట్లాడుతుంది
కర్మ ఇంకోటి జరుగుతూ ఉంటుంది
ఇదే దిగజారిన విలువల సమాజ పోకడ
మనిషి యొక్క అపభ్రంశపు జీవిత నాటక తక్కెడ
ఆలింగనం బాహ్యంలో
విష చుంబనం అంతరంలో
ఎవరు మనవారో
ఎవరు పగవారో
కనిపెట్టుట అగ్నిపరీక్షే

Pages