S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

12/23/2017 - 17:14

ఇదేదో.. యాడ్‌కు సంబంధించిన పేరు అనుకునేరు. శ్రీలంక నుండి వచ్చి భారత్‌లో తన హవా చాటుకున్న నటి జాక్వెలిన్ ప్రారంభించిన ఓ రెస్టారెంట్ పేరు ఇది. ఆశ్చర్యపోతున్నారా? సూపర్ మోడల్‌గా భారత్‌లో ఎదిగిన ఈ అమ్మడు కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్‌గా బాగా క్రేజ్‌ని కొట్టేసింది. అంతటితో ఆగకుండా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సల్మాన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటింది.

12/23/2017 - 17:13

బాలీవుడ్‌లో 2005లో ‘పరిణీత’ చిత్రంతో అడుగుపెట్టిన బ్యూటీ విద్యాబాలన్. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని నమోదు చేసింది. దాంతో దాదాపు మూడేళ్లు ఆమె చేతినిండా చిత్రాలే. ఆయా సినిమాల షూటింగ్‌లతో బిజీ బిజీగానే కెరీర్‌ని సాగించింది. అయితే అలా సాగిపోతున్న విద్య జీవితంలో 2008 వచ్చే సరికి ఆమె ఆలోచనలు నెమ్మదిగా మారడం మొదలుపెట్టాయి. తనకు పూర్తి సంతృప్తినిచ్చే పాత్రలే చేయాలి అనుకుంది.

12/15/2017 - 19:54

అక్కినేని అఖిల్ మొదటి చిత్రం ‘అఖిల్’తో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయిన నటి సాయేషా సైగల్ ఆ తరువాత పూర్తిగా తమిళ పరిశ్రమపైనే దృష్టిపెట్టి అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే తమిళంలో జయం రవితో కలిసి ‘వనమాగన్’ అనే సినిమా చేసిన ఆమె, ప్రస్తుతం విజయ్ సేతుపతి చేస్తున్న ‘జుంగా’ సినిమాలో నటిస్తూనే మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకుంది. అదే హీరో ఆర్య సినిమా.

12/15/2017 - 19:53

బాలీవుడ్‌లో తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కరీనాకపూర్, పెళ్లిచేసుకున్న తరువాత సినిమాలకు దూరంగా వుండి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కరీనా ముందుగా ఫొటో షూట్స్‌తో ఎక్కువగా అందరినీ ఆకట్టుకుంటోంది. కొన్ని ప్రముఖ యాడ్స్ కూడా చేస్తోంది. అయితే కరీనా కనిపించిన ప్రతిసారీ చాలా కొత్తగా కనిపిస్తోంది.

12/15/2017 - 19:52

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైన కొత్త హీరోయిన్‌లలో సురభి ఒకరు. బీరువా సినిమాతో ఫిలింనగర్‌లో అడుగుపెట్టిన సురభి, ఆ తరువాత జెంటిల్‌మాన్, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి చిత్రాల హిట్‌తో గుర్తింపు పొందింది. అయినా కానీ సురభికి సరైన అవకాశాలు తలుపుతట్టలేదు. ఇప్పటివరకూ గ్లామర్ పరంగా ఆకట్టుకునే పాత్రలు తాను చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని గుర్తించినట్లుగా వుంది.

12/15/2017 - 19:51

సొట్టబుగ్గల తాప్సీ బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. పింక్, జుడవా-2 సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడికి సౌత్‌లో సక్సెస్ రాలేదన్న బాధ కూడా మరిచిపోయేలా విజయాలు వరించాయి. అందుకే కాస్త గ్లామర్ డోస్ పెంచి బాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా స్థిరపడడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికీ తాప్సీకి అవకాశాలు భారీగా వస్తున్నాయట. తాజాగా తాప్సీ మరో బాధ్యత కూడా చేపట్టింది.

12/02/2017 - 18:59

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫోకస్ మొత్తం.. ఇప్పుడు హాలీవుడ్‌లోనే వుంది. బాలీవుడ్‌లో ఎలాగో టాప్ స్టార్ హీరోయిన్ అనే క్రేజ్‌ని దక్కించుకుంది. అయితే ఇక అదే తరహాలో హాలీవుడ్‌లో కూడా నిలదొక్కుకోవాలని ఆకాశపు అంచున ఉన్న కోరికను కోరుతోంది. అయితే మరీ అమ్మడు ఆ అంచుల వరకు వెళుతుందో లేదో తెలియదు గాని తన వరకు హాలీవుడ్‌లో వచ్చిన పాత్రలను ఏ మాత్రం రిజెక్ట్ చేయడం లేదు.

12/02/2017 - 18:58

నా మీద మీడియా రాసే అవాకులు చవాకులు అన్నీ చూస్తూనే ఉన్నాను. అయితే వౌనంగా ఉన్నానని, ఏదిపడితే అది రాయొద్దని చెబుతోంది బ్యూటీ లావణ్య త్రిపాఠి. ‘కాదల్ 100%’ చిత్రం తెలుగులో వచ్చిన ‘100% లవ్’కి రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో మొదట లావణ్యనే హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో అర్జున్‌రెడ్డి ఫేం షాలినీపాండేను ఎంపిక చేశారు.

12/02/2017 - 18:57

ప్రయాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వాళ్లకు కొత్త ప్రాంతాలను చూడడం బాగా ఇష్టం. అందుకే ఇప్పుడు సౌత్ బ్యూటీ అమలాపాల్ కూడా ఓ అందమైన ప్రాంతంలో చక్కర్లు కొడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న లడఖ్ టూర్‌కి వెళ్లడం ఓ మధురానుభూతి. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా.. కాసింత గ్యాప్ దొరకడంతో మంచు కొండల్లో షికార్లకు వెళ్లిపోయింది అమల. ఈ సీజన్‌లో లడఖ్ మరింత అందంగా ఉంటుంది.

12/02/2017 - 18:56

బిపాసా బసు.. ఇప్పటికీ రసిక హృదయాలను గిలిగింతలు పెట్టే పేరు. బిపాసా ఏకంగా రెండు దశాబ్దాలపాటు బాలీవుడ్‌ని ఏలిన హాట్ భామ. ఈ బ్యూటీ అందాలకు ఫిదా కానీ రసిక హృదయం లేదు. ఈమధ్యే సన్నీ రాకతో బిపాసాకు బ్యాండ్ పడింది. దాంతో బాగా అవకాశాలు తగ్గాయి. ఈ తరువాత పెళ్లి చేసుకుని కొంత గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో బిజీ అవడానికి రెడీ అయింది.

Pages