S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

12/10/2016 - 21:28

అందాలతార నయనతారపై తాజాగా వస్తున్న రూమర్స్ ఆమెను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మళ్లీ..మళ్లీ..ఇలా పుట్టుకొస్తున్న పుకార్లపట్ల ఈ భామ తెగ ఇదైపోతుందట. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయికగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస ప్రేమాయణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

12/10/2016 - 21:26

‘అవునా.. ఇది నిజమా!?’ అని కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌లోనూ అందాలతార హన్సిక గురించి తెలిసిన వాళ్లు అనుకుంటున్నారట. ఈ విషయం తెలుసుకున్న హన్సికే కాదు, ఆమె తల్లి మొనా మోత్వాని కూడా ఇలా పుట్టికొచ్చిన రూమర్ వల్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిందట. చాలా మంది హీరోయిన్ల తల్లుల మాదిరిగానే హన్సిక తల్లి కూడా తన కూతురి వయసు గురించి మాట్లాడారు. ‘హన్సికకు ఈ మధ్యే 24 ఏళ్లు పూర్తయ్యాయి.

12/10/2016 - 21:23

‘‘బాలీవుడ్ గురించి తెలియాలంటే ముందు ప్రపంచం గురించి మొత్తం తెలియాలి. బాలీవుడ్‌ని ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకుంటానని అనుకోవడం లేదు. నేనే కాదు పరిశ్రమలో యాభై ఏళ్లుగా వుంటున్న వాళ్లు కూడా ఇలాగే నాలాగే ఫీలవుతుంటారు’’అని చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. బాలీవుడ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పటం చాలా కష్టం. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు.

12/10/2016 - 21:05

బికినీకి సై..! ...అంటోంది అందాల తార కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్..అటు తర్వాత బాలీవుడ్‌లోకి తొంగిచూసిన ఈ అమ్మడు ఇన్ని సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉంటున్నా, పరిమితికి మించి అందాల ఆరబోత కానీ, బికినీ కానీ వేయలేదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇవి తప్పని సరి అనుకుందో ఏమో తను కూడా అందుకు రెడీ అయిపోయిందిట. ప్రస్తుతం చాలామంది తారలు బికినీ వేయడానికి ఏ మాత్రం సిగ్గు పడడంలేదు.

12/04/2016 - 07:01

అందాల తార అమలాపాల్ ఇక కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటోంది. దర్శకుడు విజయ్‌తో వివాహాన్ని తెగతెంపులు చేసుకున్న ఈ భామ ఇక కెరీర్‌పైనే దృష్టిసారించాలనుకుంటోంది. హీరో ధనుష్‌తో సినిమా చేయడం భర్త విజయ్‌కి ఇష్టం లేకపోవడంతో వీరి దాంపత్యం ఈ విధంగా చెడిపోవడానికి కారణం అయింది.

12/04/2016 - 06:59

ఇంతకాలం గ్లామర్..గ్లామర్ అంటూ తెగ ఇదైపోయిన సినీ ప్రేక్షకులకు ఇక హాట్ హాట్‌గా కనిపించి కనువిందు చేయాలనుకుంటోందిట అందాల భామ ఇలియానా. హఠాత్తుగా ఈ గోవా బ్యూటీకి ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చిందోనని చాలా మంది ఆమె సన్నిహితులే గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఇలియానా ఇలా కనిపించాలనుకోవడం వెనక చాలా కథనే వుందట.

12/04/2016 - 06:57

అందాలతార అమీజాక్సన్ ప్రేమలో పడిందట. అదీ..బాలీవుడ్ హీరో సల్మాన్‌తోనట! అవునా..నిజమా? అని అనుకుంటున్నారా? అదే మరి నిజమేనట! ఇప్పటి వరకు సల్మాన్‌కు ఎంతో మంది హీరోయిన్లతో అఫైర్ వుందని వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ సల్మాన్ సోదరుడు సొహైల్ నటించిన ‘ఫ్రీకీ అలీ’లో నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

12/03/2016 - 22:54

అందాలతార క్రేజీ గర్ల్ టాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ రాశీఖన్నా ఊహలు గుసగుస లాడుతూనే వున్నాయట. టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. చక్కటి అవకాశాలను సొంతం చేసుకుంటూ కెరీర్‌లో రివ్వున ముందుకు దూసుకెళుతోంది. యువతరం హీరోలతో పాటు పెరుకున్న హీరోల చిత్రాలో నటించే అవకాశం కూడా రాశీకి దక్కుతోంది. డైరీ ఏ మాత్రం ఖాళీగా లేకుండా యమ బిజీగా వుంది.

12/03/2016 - 22:52

బాలీవుడ్ నటి విద్యాబాలన్ ‘కహానీ’లో తప్పిపోయిన భర్త ఆచూకీ కోసం వెతికే భార్య క్యారెక్టర్‌ను ఎంతో ఉన్నంతగా పోషించి అందరి చేత ప్రశంసలందుకుంది. ఆ పాత్రలో విద్య చూపిన నటన ప్రేక్షకులకే కాదు, విమర్శకుల్ని సైతం ఎంతగానో ఆకట్టుకుంది. అలా తన పాత్రకు జీవం పోసి అందర్నీ కదిలించింది కాబట్టే ‘కహానీ 2’లోనూ మరోసారి తన పాత్ర ద్వారా అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది.

12/03/2016 - 22:51

ఎస్.ఎస్.రాజవౌళి ‘బాహుబలి ది కన్‌క్లూజన్’తో పాటు ‘బాగ్‌మతి’ సినిమాల్లో నటిస్తూ యమ బిజీ బిజీగా వుంది టాలీవుడ్ బ్యూటీ అనుష్క. నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’తో ప్రారంభమైన ఈమె జైత్రయాత్ర పదేళ్లు పూర్తి చేసుకుంది. గొప్ప గొప్ప చిత్రాలు.. అంతకంటే వైవిధ్యమైన పాత్రలు వేటికవే ప్రత్యేకంగా వుండడంతో కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదిగింది.

Pages