S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

11/05/2016 - 21:50

‘బాలీవుడ్ కత్రీనాకైఫ్ రూటే వేరు’ అంటున్నారు ఆమె సన్నిహితులు. నిజమే మరి! నటించే చిత్రాల విషయంలోనూ... పోషించే పాత్రల ఎంపికలోనూ ఎప్పటికప్పుడు రూటు మార్చేస్తూనే వుంటూ తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే వుంది. కథ నచ్చి.. అందులో పాత్రకు సెట్ అవుతుందో లేదో చూసుకుంటుందే తప్ప.. హీరో ఎవరనేది మాత్రం అస్సలు పట్టించుకోదట. నిజమేనా..? నమ్మేద్దామా మరి? ఈ విషయం గురించే కత్రీనాను ఒక్కసారి కదిలిస్తే- ‘‘ఎస్. అంతే!

11/05/2016 - 21:49

...ఉన్నానంటోంది అందాలతార అమలాపాల్. ఇటీవల కాలంలో ఈ అమ్మడు నిత్యం వార్తల్లో వుంటూ వస్తూనే వుంది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త దర్శకుడు విజయ్‌తో విడాకుల విషయంలో ఎన్నో వివాదాలు..విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయి ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. మరి విజయ్ నుంచి విడిపోయాక అమలాపాల్ జీవితం ఎలా వుంది అని ఆమెనే కదిలిస్తే- ‘‘ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా...వుంది.

11/05/2016 - 21:45

బాలీవుడ్‌లో ‘ఆషికి-2’తో బాగా పాపులర్ అయిన బ్యూటీ శ్రద్ధాకపూర్. అందం.. అభినయంతో అందర్నీ అలరిస్తున్న ఈ అమ్మడు పరిశ్రమకు వచ్చి అప్పుడే ఆరేళ్లు నిండిపోయాయి. అయితే తాజాగా చేతినిండా చిత్రాలతో బాగా బిజీ బిజీగా మారింది. ప్రస్తుతం ‘రాక్ ఆన్ 2’, ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’. ‘హసీనా’ చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో పరుగులు పెడుతోంది. ఆరేళ్ల కెరీర్ ఎలా వుంది అని శ్రద్ధాను కదిలిస్తే- ‘‘చాలా హ్యాపీగా వుంది.

10/30/2016 - 07:03

-అంటోంది అందాల బాలీవుడ్ భామ డయానా పెంటీ. ‘‘పేరున్న తారలంటే మీడియాకు వాళ్లో బంగారుబాతుల్లా కనిపిస్తారు. ఎదుగుతున్న తారలపట్ల, ఎదిగిన భామల విషయంలో వీరికున్న ఆసక్తి మరెవరికీ వుండదంటే ఆశ్చర్యం కాదు. అదే వాళ్ల ఎదుగుదలకు కారణం అనుకుంటారు. ఇలాంటి మీడియా విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి’’ అంటూ తోటి నటీమణులకు సలహాలు కూడా ఇస్తుంది డయానా.

10/30/2016 - 07:01

ఇప్పుడొస్తున్న అగ్ర కథానాయకులు, అగ్ర దర్శకుల చిత్రాలకు నవతరం కథానాయికలే ప్రధాన ఆకర్షణ అవుతున్నారు. వెండితెరపై అడుగుపెడుతూనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వీరు భారీ చిత్రాలకు భలే బాక్సాఫీస్‌ని పెంచేస్తున్నారు. వీరిపైనే పరిశ్రమ దృష్టి. అలాంటి తారల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ‘అఆ’తో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ‘ప్రేమమ్’తో మరోసారి అడుగుముందుకేసింది.

10/30/2016 - 06:59

టాలీవుడ్‌లో ప్రస్తుతం కథల కొరత బాగానే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రొటీన్ కథలకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తాకొట్టడం ఖాయం అంటున్నారు చిత్రసీమకు చెందిన పెద్దలు. అదే దారిలో నడుస్తుంది యువతరం కథానాయిక కీర్తి సురేష్. ‘నేను శైలజ’తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అమ్మడు అటు తర్వాత ‘నేను లోకల్’తో మరోసారి టాలీవుడ్ వైపునకు చూసింది.

10/30/2016 - 06:58

ఎలాంటి గాడ్‌ఫాదరేకాదు.., సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏమాత్రం లేని తారల్లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ముందుంటుంది. ఎన్నో ఆశలతో వెండితెరపై అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ చేసిన పాత్ర ద్వారానయితేనేమి.. వచ్చిన అవకాశాల ద్వారా అయితేనేమి నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆయా పాత్రల ద్వారానే బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకుంది.

10/22/2016 - 21:17

బాలీవుడ్‌లో ఎంతో కాలంగా విభిన్న పాత్రలు పోషిస్తూ అగ్ర నటులతో ఆడిపాడిన అందాలభామ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లోనూ పాపులర్ స్టార్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకుంటోంది. తాజాగా ఓ అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్‌పేజీపై దర్శనమిచ్చి అందర్నీ ఆశ్యర్య చకితుల్ని చేసింది. ‘హాలీవుడ్ రాయల్’ అంటూ సదరు పత్రిక ప్రియాంక గురించి వ్యాఖ్యానించడం విశేషం. బాలీవుడ్‌లో పేరుతెచ్చుకున్నాక హాలీవుడ్ ప్రయాణం ఎలా అనిపిస్తోంది?

10/22/2016 - 21:14

నార్త్‌లో హాట్ హాట్‌గా నటిస్తూ అందరి మనసులను కొల్లగొడుతున్న బ్యూటీ రాధికా ఆప్టే. ఎప్పటికప్పుడు హాట్‌న్యూస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారుతూ తనకంటూ ఓ ఇమేజ్‌ని సృష్టించుకుంటోంది. అందరి తారల్లాగాక, తనేమిటో..తన పవరేమిటో వెండితెరకు చూపించాలనుకుంటోంది. అందుకే చేసే ప్రతీ చిత్రమూ, పోషించే ప్రతి క్యారెక్టర్‌లో ఆచి తూచి అడుగులు వేస్తూ తన స్టామినాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే వుంది.

10/22/2016 - 21:12

అందాల భామ రెజీనాకు టాలీవుడ్‌లో కాలం కలిసిరావడంలేదట. ఎన్నో ఆశలు... మరెన్నో కోరికలతో తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిపోవాలని కలలుగన్న ఈ భామకు నిరాశే ఎదురవుతోందిట. ఆమె తర్వాత వచ్చిన భామలు తనను దాటి ఎంతో ముందుకు వెళ్లిపోతున్నారని.. ఎందుకనో తనకు అవకాశాలు అంతగా రావడంలేదని తెగ బాధపడిపోతుందిట. కెరీర్ ప్రారంభంలో ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటాననడం అప్పట్లో ఆఫర్లకు దూరం చేసింది.

Pages