S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

09/10/2016 - 21:37

తెలుగు, తమిళ, హిందీ ఇలా మూడు భాషల్లో దశాబ్దకాలంగా వెండితెరపై వెలుగులు విరజిమ్ముతూ అగ్ర కథానాయకులతో జోడీ కట్టి ఇప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటున్న అందాల భామ కాజల్ అగర్వాల్. అందానికి తోడు ఆత్మవిశ్వాసం కాజల్‌లో మెండుగా వుండడం వల్లే మంచి మంచి అవకాశాలు.. అంతకటే మంచి బ్యానర్లు ఆమెను వరించాయి. ఆత్మవిశ్వాసమే కెరీర్‌లో ఆమెను ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేసింది.

09/10/2016 - 21:34

చాలామంది తారలు టాలీవుడ్‌లో తమను తాము నిరూపించుకున్నాక.. బాలీవుడ్‌పై గురి పెట్టడం మామూలే. గత ఎంతో కాలంగా చిత్రసీమలో మనం ఇలాంటి భామల పరుగులు చూస్తూనే వున్నాం. అదే దారిలో మిల్క్‌బ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది. పదేళ్ల సినీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఈ బ్యూటీ తెలుగు, తమిళంలో నటిస్తూనే బాలీవుడ్‌వైపు గురి పెట్టింది.

09/10/2016 - 21:32

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలో భలే క్రేజ్‌ని సంపాదించుకున్న తారల్లో రాశీఖన్నా కూడా చేరిపోయింది. చేసినవి కొద్ది చిత్రాలే అయినా అవి ఈ గ్లామర్ భామకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అంతేకాదు, గ్లామర్ బ్యూటీ అని కూడా పిలిపించుకుంటోంది. తాజాగా గోపీచంద్‌తో కలిసి ‘ఆక్సిజన్’ అనే చిత్రంలో ఆడిపాడుతోంది. అలాగే రామ్‌తో ‘హైపర్’లోనూ జతకట్టింది.

09/04/2016 - 06:34

అందాలతార రకుల్ ప్రీత్‌సింగ్‌కు గ్లామరే రక్షగా మారింది. టాలీవుడ్‌కి పరిచయమైన అతి తక్కువకాలంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ అంతే జోరుగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అగ్ర హీరోలు సైతం తమ చిత్రాల్లో రకుల్‌నే ఎంచుకుంటున్నారంటే ఆమె క్రేజ్ ఎలా పెరిగిపోయిందో ఇట్టే అర్థమవుతోంది. వరస అవకాశాలతో యమబిజీగా వున్న ఈ అమ్మడి డైరీ ప్రస్తుతం ఖాళీగా లేనేలేదట.

09/04/2016 - 06:31

శత్రఘ్నసిన్హా తనయగా తెరపై అడుగులు పెట్టినా..ఆ తర్వాత నటిగా తానేంటో నిరూపించుకుంటూ బాలీవుడ్‌నే తన వైపునకు తిప్పుకునేలా చేసుకుంది అందాలభామ సోనాక్షి సిన్హా. చేస్తున్న చిత్రాలు.. ఆయా చిత్రాల్లో సోనాక్షి పోషిస్తున్న పాత్రలు ప్రేక్షకులనే కాదు, బాలీవుడ్‌కి చెందిన ప్రతీ ఒక్కర్నీ ఆలోచింపజేస్తున్నాయి.

09/04/2016 - 06:28

టాలీవుడ్‌లో ఒక దశలో మంచి క్రేజ్ మీదున్న గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ఇక్కడ ఆశలన్నీ వదులుకున్నట్లే వుంది. తెలుగు చిత్రసీమలో కొత్త తారల రంగప్రవేశంతో ఇలాంటి సీనియర్ భామలు చాలామంది ఇలాంటి ఆశలే వదులుకున్నారు. అవకాశాలు లేక ఒకవైపు.. సీనియర్ కథానాయికలపై వున్న అశ్రద్ధ మరోవైపు వీరి పాలిట శాపమైంది. తాజాగా బాలీవుడ్‌లో నటించిన రెండు చిత్రాలూ ఇలియానాకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి.

09/04/2016 - 06:27

పోర్న్‌స్టార్‌గా బాగా పాపులర్ అయిన భామ సన్నీలియోన్ హిందీ చిత్రాల ద్వారా బాలీవుడ్‌కి పరిచయమై అందర్నీ కవ్వించింది. అయితే బాలీవుడ్‌లో తానేంటో నిరూపించాలనుకున్న ఈ సెక్సీభామకు ఇక చిక్కులు తప్పేట్టులేవు. సన్నీకి సైతం పోటీ బాగానే పెరిగిపోయింది. సన్నీకి పోటీయా? అనుకుంటున్నారా? అవును..మరి! పోర్న్‌స్టార్‌గా వెలుగులు విరజిమ్మిన మరెందరో తారలు బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారట.

08/28/2016 - 00:58

చేసినవి తక్కువ చిత్రాలే అయినా..అగ్రతారే! అదెలా అనుకుంటున్నారా? తెరపై రూ.300 కోట్ల వసూళ్లు కురిపించడం అంటే మాటలా మరి! ‘రబ్ నే బనాదో జోడీ’తో బాలీవుడ్‌కు పరిచయం అయిన అందాలభామ అనుష్కశర్మ అంటే ఇప్పుడు బాలీవుడ్‌లో యమక్రేజీ. తాజాగా వచ్చిన ‘పీకే’, ‘సుల్తాన్’తో ఉన్నతస్థాయిలో ఎంతోగుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

08/21/2016 - 06:18

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న భామల సంఖ్య మెల్లమెల్లగా ఊపందుకుంటోందిప్పుడు. ‘స్పై’తో హాలీవుడ్‌లోకి తొంగిచూసిన నర్గీస్ ఫక్రికి ఆ చిత్రం నటిగా మంచి పేరునే తెచ్చిపెట్టింది. అదే ఊపుతో తాజాగా మరో హాలీవుడ్ చిత్రంలో నటించేందుకు సిద్ధమయింది. అదే ‘5 వెడ్డింగ్స్’. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం బాలీవుడ్ వివాహంపై ఓ పుస్తకం రాయడానికి వచ్చిన ఓ అమెరికన్ రచయిత్రి కథతో సాగుతుంది.

08/21/2016 - 06:16

ఎంతో ఇష్టపడి..పైగా ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకున్న చాలా మంది తారల జీవితాలు తొలి అడుగులోనే నిర్వీర్యమైపోతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలోనే తమిళ దర్శకుడు విజయ్‌తో పీకలోతు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తార అమలాపాల్. ఈ జంట చూస్తుండగానే విడిపోతున్నారు. వీరిపై చాలా సార్లు పుకార్లు షికార్లు చేశాయి.

Pages