S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

06/25/2016 - 21:50

ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కెరీర్‌ని చక్కగా ప్లాన్ చేసుకోవడంలో తమన్నాను మంచి మరొకరు లేరేమో అనిపిస్తుంది. అందుకే కాబోలు..టాలీవుడ్..కోలీవుడ్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు దూసుకెళుతుంది. తనపై ఎలాంటి రూమర్స్ వచ్చినా అస్సలు లెక్క చేయదు. అంతేకాదు..వాటిపై ఏ మాత్రం స్పందించదు కూడా.

06/18/2016 - 22:37

బాలీవుడ్ భామ విద్యాబాలన్ ఆసక్తి అంతా ఇప్పుడు జీవితకథలపైనే ఉందట. తాజాగా విద్యాబాలన్ మరాఠీ చిత్రం ‘ఏక్ అల్బెలా’లో నటి గీతాబాలి క్యారెక్టర్‌ను పోషిస్తోంది. ప్రఖ్యాత నటుడు భగవాన్ దాదా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రం గురించి విద్యను కదిలిస్తే- ‘‘ఇది గీతాబాలి జీవిత కథ మాత్రమే కాదు. ఆమె జీవితంలోని అన్ని పార్శ్వాలు చూపించారు. ఈ మధ్య జీవిత కథలతో నావద్దకు చాలా మంది వస్తున్నారు.

06/18/2016 - 22:36

...అంటోంది అందాల భామ అనుష్క. మూడు పదుల వయస్సు దాటిన ఈ సుందరాంగి ముందు ఎవరైనా పెళ్లి మాట ఎత్తితే ఈ విధంగానే సమాధానమిస్తుంది. వెండితెరపై అడుగుపెట్టే ముందు వున్న ఆలోచనలు వేరు..పాదం మోపాక కెరీర్‌లో అన్నీ చూసేశాక ప్రతీ హీరోయిన్ ఈ విధంగానే కాకమ్మ కథలు చెబుతారు. ఇది పరిశ్రమలో మామూలైపోయింది.

06/18/2016 - 22:34

బాలీవుడ్ బ్యూటీ ‘దబాంగ్’ భామ సోనాక్షి సిన్హా రూటే వేరు. చేసే ప్రతి చిత్రంలో..పోషించే ప్రతి క్యారెక్టర్ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోవడమేగాక ఆ పాత్ర తన కెరీర్‌కు ఎలా ఉపయోగపడగలదో కూడా బాగా ఒంట బట్టించుకుంటోంది. తండ్రికి తగ్గ తనయగా విశేష ప్రాచుర్యాన్ని అతి తక్కువ సమయంలోనే సంపాదించుకుంది. కెరీర్‌లో ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తింది. అదే..పాత్రికేయురాలిగా తన తాజా చిత్రం ‘నూర్’లో నటించబోతోంది.

06/11/2016 - 20:13

తెలుగులో ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’, ‘బస్‌స్టాప్’, ‘కేరింత’ చిత్రాలతో మంచి అభినయం వున్న నటిగా అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య మంచి మార్కుల్నే కొట్టేసింది. ఆయా చిత్రాలో ఈ అమ్మడు చేసిన పాత్రలు టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి..ఆకట్టుకున్నాయి కూడా. అయితే టాలీవుడ్ మాత్రం ఈమె వైపు చిన్నచూపునే చూస్తోంది.

06/11/2016 - 20:12

బాలీవుడ్‌లో ‘బాజీరావు మస్తానీ’ చిత్రం తర్వాత విన్ డీజిల్ సరసన ‘ట్రిపుల్ ఎక్స్: ది జాండర్ కేజ్’ చిత్రంతో హాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన దీపికా పదుకొనే పరిస్థితి ప్రస్తుతం బాలీవుడ్‌లో అంత ఆశాజనకంగా లేదని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. హిందీలో యువ కథానాయికల జోరు కొనసాగుతుండడంతో ఇలాంటి తారల కెరీర్ రోజు రోజుకీ మసకబారుతోందని అంటున్నారు.

06/11/2016 - 20:10

వెండితెరపై తమ అందచందాలతో గ్లామర్‌ని చిందిస్తూ.. హొయలు ఒలకబోస్తూ ఎంతో పాపులారిటీని సంపాదించుకుంటున్న తారలు హాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ వున్నారు. అలా వచ్చిన పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు ఈ భామలు. అలా ఒక్క మాటతో రాత్రికి రాత్రే ఎంతో పాపులారిటీని తన వశం చేసుకుంది సెక్సీక్వీన్ పూనమ్‌పాండే.

06/05/2016 - 03:19

అందాలతార సమంత క్రేజ్ రోజు రోజుకీ బాగా పెరిగిపోతూనే వుంది. ఈ క్రేజ్ ఒక్క టాలీవుడ్‌లోనే కాదు...తమిళంలోనూ ఊపందుకుంటోంది. తెలుగులో ‘అ ఆ’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుండగా, ‘జనతా గ్యారేజ్’ సెట్స్‌పై ఉరకలు వేస్తోంది. తమిళంలోనూ సమంత హవా బాగానే ఉంది. ‘24’, ‘తెరి’ చిత్రాలు అక్కడ మంచి విజయాలను నమోదు చేసుకోవడంతో కోలీవుడ్ మొత్తం ఈ ముద్దుగుమ్మ వైపే చూస్తోంది. సమంత కోరిక కూడా ఇదే.

06/05/2016 - 03:16

అగ్ర హీరోల చిత్రాల్లో నటించిన చాలా మంది భామలు యువతరం హీరోల చిత్రాల్లో నటించడంపై పెద్దగా ఆసక్తి చూపరు. అతి తక్కువ కాలంలో తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది అందాలతార హన్సిక. తమిళంలో అగ్ర హీరోల చిత్రాల్లో వరుసగా అవకాశాలు వస్తున్న తరుణంలోనే యువ, కొత్త హీరోల సరసన నటించేందుకు హన్సిక ప్రాముఖ్యత ఇస్తుండడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

06/05/2016 - 03:14

బాలీవుడ్‌లోని సక్సెస్‌ఫుల్ హీరోయిన్లలో అందాలతార ప్రియాంక చోప్రా ఒకరు. హిందీ చిత్రసీమలో తన చిత్రాల ద్వారా, ఆమె చేసిన పాత్రల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా అమెరికన్ టీవీ సీరిస్ క్యాంటికోతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొందారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న మొట్టమొదటి భారత వ్యాఖ్యాతగా రికార్డు సృష్టించారు. అంతే గాకుండా ‘బేవాచ్’ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు.

Pages