S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

03/05/2016 - 20:17

అందాల తార కాజల్ అగర్వాల్ తన రూటును మార్చుకునే ప్రయత్నంలో పడిందట. సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా వెలుగొందుతున్న కాజల్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తన హవాను చాటుకున్న విషయం తెలిసిందే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని ఫాలో అవుతున్న ఈ అమ్మడు తాజాగా సినిమా రంగంతో పాటు బిజినెస్ రంగంలోనూ తన హవా చాటుకునేందుకు ప్రయత్నిస్తుందట.

02/28/2016 - 14:29

బాలీవుడ్ తారలపై రూమర్స్ మామూలే! అలా అని అందరి తారలపై ఇలాంటి రూమర్స్ పెద్దగా లేవు. ఏవో కొందరి విషయాల్లో అలా పుట్టుకొచ్చాయంతే! బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా విషయాన్ని తీసుకుంటే...ఈ ముద్దుగుమ్మపై లేనిపోని రూమర్స్ అంటూ ఏవీ లేవు. అయితే అందుకు ఆమె ఎన్నో జాగ్రత్త తీసుకున్నానంటోంది. అందులో భాగమే మీడియాతో ప్రతీ విషయాన్ని చెప్పేయటమేనట. అందుకే తనకు రూమర్స్ దూరంగా వున్నాయంటోంది.

02/22/2016 - 22:22

అందచందాలతోనే కాదు, కళ్లతోనూ కైఫ్ ఎక్కించే ‘నషా’్భమ, బాలీవుడ్‌లో అత్యంత వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండేకు నిత్యం వార్తల్లో వుండటం ఎలాగో బాగా తెలుసు అంటున్నారు ఆమె సన్నిహితులు. పూనమ్‌కే కాదు, ఇది బాలీవుడ్ భామలందరికీ వర్తిస్తుంది. అయితే ఇలాంటి పూనమ్‌పై వార్తలు ఇటీవల మరీ ఎక్కువయ్యాయి. లేని పోని రూమర్స్‌తో ఆమెను మానసికంగానే కాదు, కెరీర్ పరంగా కూడా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాయి.

02/14/2016 - 18:15

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్ ఎవరిమీద పడితే వారిమీద కస్సు..బుస్సుమంటోందిట! కారణం లేకపోలేదు. తనను కలిసిన ప్రతీసారీ తనపై వచ్చే రూమర్స్ గురించే ప్రశ్నలు గుప్పించడం ఆమె జీర్ణించుకోలేకపోతోందిట. ఇంతకీ విషయంలోకి వెళితే.. ఇంతకాలంగా ప్రేమాయణం నడుపుతోన్న బాలీవుడ్ జంట కత్రీనాకైఫ్-రణబీర్‌కపూర్‌లు విడిపోవడానికి సిద్ధంగా వున్నారట. దీనికి కారణం మరో బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనేనట. అవునా..ఇది నిజమా?

02/09/2016 - 22:22

సహజంగా ఎవరైనా తమ పని చేయించుకోవాలంటే ఎదుటివాళ్లని అద్భుతంగా పొగిడేస్తుంటారు. సినిమా పరిశ్రమలో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరిని ఎట్లా పొగిడితే ఎలాంటి లాభాలొస్తాయో లెక్కలువేసి మరీ పొగిడేస్తుంటారక్కడ! ఈ విషయంలో మాత్రం తాను ఖరాకండీ అంటోంది అనుష్క. ఎవరైనా తనను పొగుడుతున్నారు అంటే వెంటనే వెనకనుండి గొయ్యి తవ్వేస్తున్నారు అనే అర్థం గుర్తొస్తుంది. అందుకే అలాంటి వాళ్లకి దూరంగా ఉంటానంటోంది.

02/01/2016 - 09:23

ఎక్కడైతే ఏమి.. అవకాశాలు గుక్కతిప్పుకోకుండా వస్తే అంతకన్నా అదృష్టం ఏముంది? ఇన్నాళ్లూ అవకాశం ఒక్కటన్నా తలుపు తడుతుందేమోనని ఎదురుచూసి ఎదురుచూసి చివరికి ఒక్కసారిగా వచ్చిపడుతున్న హీరోయిన్ పాత్రలు కేథరీన్ థెరిసాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో ఆమె చేసిన ఓ చిత్రం టాలీవుడ్‌లో విడుదలైనా సరైన బ్రేక్ ఇవ్వలేకపోయింది.

01/23/2016 - 18:25

తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ‘గౌరవం’ చిత్రం ద్వారా ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ‘మిక్కీ డోనర్’ చిత్రం ఫేమ్ యామీ గౌతమ్‌ని మరచిపోలేదు కదా. ఈ భామకు ఎప్పుడూ వార్తల్లో ఉండడమే ఇష్టంగా ఉన్నట్లుంది. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. సినిమా అవకాశాలు సరిగా లేకున్నా మీడియా దృష్టిలో మాత్రం ఎప్పుడూ హాట్ హాట్‌గానే చోటు సంపాదించుకుంటుంది.

01/14/2016 - 17:55

‘‘ఇటీవల బాలీవుడ్ భామలపై వస్తున్నన్ని రూమర్స్ మరే తారలపై రావడం లేదు. కారణాలు ఏమైనా రూమర్స్ అనేవి ఒక ఫ్యాషన్‌లా తయారైపోయాయి. ఇలా చేయకుంటే మీడియా నెగ్గుకు రావడం లేదేమో’’అంటూ గట్టిగానే స్టేట్‌మెంట్ ఇచ్చింది బాలీవుడ్ భామ దీపికాపదుకొనే. ఇటీవల ముంబయ్‌లో జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో దీపికాను చుట్టిముట్టిన మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది.

01/09/2016 - 17:31

ఇప్పుడు అందరి నోటా నటి కాజల్ అగర్వాల్ మాటే. ఎందుకంటారా? కారణం లేకపోలేదు! ప్రతి ఏటా అధిక ఆదాయం, మంచి పాపులారిటీ పొందిన వారి పట్టికను ఒక సర్వే సంస్థ విడుదల చేస్తుంది. అలా ఈ ఏడు అధిక ఆదాయం, ప్రాచుర్యం పొందిన వారిలో రజనీకాంత్, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళిలను నటి కాజల్ అగర్వాల్ అధిగమించిందట. అవునా..ఇది నిజమా? అని కాజల్‌నే కదిలిస్తే- ‘‘అవును.

01/02/2016 - 17:40

‘‘వెండితెరపై కథానాయిక అందంగా కనిపించాలి. కానీ అదే సమయంలో నటనకూడా ఎంతో ముఖ్యమన్న విషయం మరచిపోకూడదు. అందుకే నేను నటించే చిత్రాల్లో అందంతో పాటు నటనపై కూడా ఎక్కువ శ్రద్ధపెడతాను. అందుకు నాకు అదృష్టం కూడా తోడవుతోంది. కాబట్టే మంచి అవకాశాలు వస్తున్నాయి. నాకు వచ్చిన అవకాశాలను నేను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నానన్న తృప్తి కలుగుతోంది’’ అని ఆనందంగా చెబుతోంది అందాలభామ రాశీఖన్నా.

Pages