S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టెక్ వీసా దరఖాస్తుల్లో అగ్రస్థానంలో భారత్

లండన్: బ్రిటన్‌లోని టెక్నాలజి రంగంలో పని చేయడానికి ఎక్కువ మంది వీసా దరఖాస్తులు పెట్టుకున్న దేశాలలో అమెరికాతో పాటు భారత్ ఉందని తాజా గణాంకాలు వెల్లడించాయి. టెక్ వీసాల కోసం బ్రిటన్ హోం ఆఫీస్ డిజిగ్నేటెడ్ బాడీ అయిన టెక్ నేషన్ గణాంకాల ప్రకారం భారత్ నుంచి వచ్చిన వీసా దరఖాస్తులు విస్తృత రంగాలకు విస్తరించి ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజి కోసం టెక్ నేషన్ టైర్ 1 ఎక్సెప్షనల్ ట్యాలెంట్ వీసా కోసం 2018-19లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య క్రితం సంవత్సరంతో పోలిస్తే 45 శాతం పెరుగుదలతో 650కి చేరుకున్నాయి. క్రితం సంవత్సరం 450 వీసా దరఖాస్తులు వచ్చాయి. ‘వీసా దరఖాస్తులు ఎక్కువ వచ్చిన దేశాలలో భారత్, అమెరికా కొనసాగుతున్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఏఐ అండ్ మెషిన్ లర్నింగ్, ఫిన్‌టెక్, ఎంటర్‌ప్రైజ్/ క్లౌడ్ రంగాలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బిజినెస్ డెవలపర్ల నుంచి వీసా దరఖాస్తులు వచ్చాయి’ అని టెక్ నేషన్ నివేదిక ఈ వారంలో వెల్లడించింది. నైజీరియా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, దక్షిణాఫ్రికాల నుంచి కూడా వీసా దరఖాస్తులు భారీగా వచ్చాయని వివరించింది.