S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
సాక్షి మహరాజ్, యోగి ఆదిత్యనాథ్, ఉమాభారతి అనబడే సర్వసంగ పరిత్యాగులు అధికారంలో ఉన్నారు. రామ్‌దేవ్, ఆశారాం బాపూ, రవిశంకర్ లాంటి సర్వసంగ పరిత్యాగులు వ్యాపారంలో ఉన్నారు. మరి దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు నేలలో డబ్బున్న ‘సన్యాసులు’ అధికారంలో కానీ, రాజకీయాల్లోగానీ లేరేమిటి?
ఇంతకుపూర్వం లేనంతమాత్రాన ఇకముందు రారని ఎందుకు అనుకోవాలి? యు.పి.లో యోగికి అధికార యోగం తరవాత మన సన్యాసులలోనూ కొందరికి గుబులు మళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఉత్తరప్రదేశ్ విజయం తర్వాత రాజ్యసభలో సీట్లు పెరుగుతాయ కదా. ఇప్పుడైనా 370 అధికరణం రద్దు చేస్తాడా?
చేస్తానని చెప్పాడా?

బి.ఆర్.సి. మూర్తి, విజయవాడ
బాబు అధికారంలోకి వస్తే జాబులు వస్తాయని ఎదురుచూశారు నిరుద్యోగులు. ఇప్పుడు నిరుద్యోగ భృతి వూరికే ఇవ్వం. కొంత సమాజ సేవ చేయాలంటున్నారు. వృద్ధాప్య పెన్షన్‌కు కూడా ఇదే లింక్ పెడ్తారేమో మున్ముందు!
చేయాలంటే తప్పేమిటి?

ఎల్. ప్రపుల్లచంద్ర, ధర్మవరం
చిరునవ్వులతో మీరిచ్చే జవాబులు భూమికే కూల్... కూల్...
మీకు కాదా?

ఆర్.కె., హైదరాబాద్
వాక్కును కట్టేసి, మనుషులను పలుకుండగానే మూగవాళ్లను చేసిన ఘనత వాట్సప్‌దేనంటారా?
వెర్రివాళ్లను చేసిన ఘనత కూడా.

డబ్బుతో ఎవరికివారే గొప్పవారమనుకునే నేటి సంస్కృతిలో అసలు గొప్పవారు లేరేమో అనిపిస్తుంది. ఏమంటారు?
తన గొప్పతనాన్ని గుర్తించనివాడే గొప్పవాడు.

సి. ప్రతాప్, శ్రీకాకుళం
ఒక సాధారణ ఎమ్మెల్యే తీవ్ర అస్వస్థతకు గురై, ప్రాణాపాయ స్థితిలో పడితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేందుకు ఆఘమేఘాల మీద హెలికాప్టర్ పంపిన రాష్ట్ర ప్రభుత్వం అదే ఉత్సాహం, కమిట్‌మెంట్ సాధారణ ప్రజానీకం విషయంలో ఎందుకు కనబరచదు? వీరి ప్రాణాలకు విలువ లేదా? పన్నులు కట్టే వీరికి ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు పొందే అర్హత లేదా?
అయ్యే పనేనా?

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్ కోర్టు ధిక్కారం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనంపై తీవ్ర స్థాయలో ధ్వజమెత్తడంపై సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ ఆయనకు బహిరంగ లేఖ ద్వారా హితవు పలకడం లాంటి సంఘటనలు, న్యాయవ్యవస్థలో ఉన్నత విలువలు కాపాడవలసిన న్యాయమూర్తి వైఖరి దేనికి సంకేతం?
కుహనా రాజకీయాల రంధిలో పవిత్ర న్యాయ వ్యవస్థకు మనం చేతులారా పట్టించిన చీడకు.

వాడ్రంగి కొండలరావు, పొందూరు, శ్రీకాకుళం జిల్లా
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల్లో మేధావులకు, రచయతలకు స్థానం కల్పించే పరిస్థితి రాదా?
రాజకీయ ప్రాపకం సంపాదించగలిగితే...

శివాని, విశాఖ
ఆదివారం అనుబంధం పుస్తక రూపంలో వస్తే రచయతలకి (అచ్చు అయనవి) వాటిని కట్ చేసి దాచుకోవడానికి వీలుండేది.
ఇప్పుడూ ఆ పని చేయవచ్చు.

ఒక్క మంగళవారం తప్ప మిగిలిన వారాలు కూడా చిత్రతో పాఠకున్ని చితక్కొట్టడం ఏం బావుంది? భూమిక కాక ప్రియదర్శిని అని ఉన్నప్పుడే నయం. మంచి మంచి రచనలకి చోటిచ్చి పత్రిక ఆసక్తికరంగా ఉండేది. భగవంతుని గురించి రాసే రచనలకి చోటువుండటం లేదు. బుల్లితెర కబుర్లు కూడా లేవు. ప్రతి శనివారం భూమికలో కథ ప్రచురించండి. భూమిని మరికాస్త ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి.
ప్రయత్నిస్తాం.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
రాహుల్, కేజ్రీ, ఏచూరిలకు స్వప్నంలో కూడా మోదీగారే సింహంలా కనిపిస్తున్నారా? దేశ సమగ్రత, విదేశీ శత్రువుల ఆగడాలు కనిపించవా?
ఎవరి పని వారు చేయాలి.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్ - 500003.
: email :
sundaymag@andhrabhoomi.net