S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చీమలు వీటిని రక్షిస్తాయి!

‘అఫిడ్స్’ అని పిలిచే ఈ కీటకాలు పంటలను అతివేగంగా నాశనం చేస్తాయి. ఆకులు, కాండాలపై వాలి రసాన్ని పీల్చి మొక్కలను నిర్వీర్యం చేస్తాయి. ఇవి రాత్రీపగలూ నిరంతరాయంగా ఈపని చేయడంవల్ల గంటల్లోనే పంట దెబ్బతింటుంది. అయితే ఇవి తనకు కావలసిన ఆహారాన్ని తినగా ఎక్కువైనదాన్ని విసర్జిస్తాయి. ఈ ద్రావకాన్ని ‘హనీడ్రాప్స్’గా పిలుస్తారు. చీమలకు ఈ పదార్థం అంటే ఇష్టం. అందుకే ‘అఫిడ్స్’ ఉండే చోట చీమలు ఎక్కువగా ఉంటాయి. ఆ బగ్స్‌ను ఇతర కీటకాలు, పరాన్నజీవులు ఏమీ చేయకుండా చీమలు రక్షిస్తూంటాయి. సంభోగం లేకుండానే సంతానోత్పత్తి చేసే శక్తి వీటికి ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనడం వల్ల పంటలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, తెలుపు రంగుల్లో ఇవి కనిపిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి