S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గంటకు అంగుళం పెరిగే ఆస్పరాగస్

ఉల్లి పొరకలా, అంతకన్నా పొడుగ్గా పెరిగే ఆస్పరాగస్ నిజానికి హెర్బ్‌జాతికి చెందినప్పటికీ కూరగాయగానే వాడతారు. వాతావరణం అనుకూలిస్తే వీటి పొరక గంటకు అంగుళం చొప్పున అతివేగంగా ఎదుగుతుంది. అందుకే వీటిని మరీ ముదిరిపోకుండా కోసేందుకు రైతులు నిరంతరం పరిశీలిస్తూంటారు. వీటిని సాగుచేసే రైతులు మడులన్నీ తిరిగివచ్చేసరికి ఇవి చాలాఎత్తుకు పెరిగిపోతూంటాయి. సి, బి2, బి9, ఇ విటమిన్లు పుష్కలంగా ఉండే వీటిని సాగుచేయడంలో చైనా ఎవరికీ అందనంత ఎత్తున ఉంది. రెండోస్థానంలో పెరూ, మూడో స్థానంలో జర్మనీ ఉన్నాయి. అన్నట్లు వీటి ‘షూట్స్’ ఎంత పౌష్టికాహారంగా పనికివస్తాయో వీటి పళ్లు మనుషులకు అంత హాని చేస్తాయి.

- ఎస్.కె.కె. రవళి