S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్చ్..అసిన్!

దక్షిణాదిన ప్రేక్షకులు ఇచ్చిన బూస్ట్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అసిన్ ‘గజిని’తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాదు, ఆ చిత్రమే అసిన్‌ని కెరీర్‌లో ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎంతగానో ఆశించిన కెరీర్ నత్తనడకనే సాగింది. అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇలా ఎందుకు జరిగింది అని అసిన్‌ని కదిలిస్తే- ‘‘ఇలా జరగాలి.. అలా జరగాలి అని అందరూ అనుకుంటారు. ఎన్నో కలలుగంటారు. ఆ కలలన్నీ నిజం కావాలన్న రూలేమీ లేదు కదా. ఎవరి అదృష్టం వారిది. ఎవరి అవకాశాలు వారివి. తెలుగు, తమిళంలో నటించిన చిత్రాలు నాకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. అదే ఉత్సాహంతో బాలీవుడ్ ప్రేక్షకులకూ పరిచయం కావాలనుకున్నాను. ఇక్కడా మంచి అవకాశాలే వచ్చాయి. నాకు మంచి ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి హిందీ చిత్రాలు. అయితే అనుకున్న రేంజ్ మాత్రం రాలేదనే చెప్పాలి. అంత మాత్రానా కెరీర్ ఇక ముగిసినట్లే అనుకుంటే పొరపాటే. కెరీర్‌లో సాధించాల్సింది ఎంతో వుంది. సాధిస్తానన్న నమ్మకం కూడా నాకుంది’’ అంటూ ఎంతో గట్టిగా అదే ఉత్సాహంతో చెప్పుకొచ్చింది. అయితే ఈ కేరళకుట్టి అసిన్‌కు కొచ్చి సమీపంలోని రవిపురంలో డబుల్ బెడ్‌రూం ప్లాట్ వుంది. ఇంటీరియర్ డెకరేషన్‌కుగాను కొచ్చికి చెందిన ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చింది. దీనికిగాను, పది లక్షల రూపాయలు బిల్లు అయింది. ఎంతకీ అసిన్ బిల్లు చెల్లించకపోవడంతో ఆ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం 10లక్షలు వెంటనే కోర్టులో చెల్లించాలని ఆదేశించింది. చెల్లించని పరిస్థితుల్లో ఇంటిని వేలం వేయాలని తీర్పు చెప్పింది.

-సమీర్