S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పునర్జన్మ

ఇది ఇండియాలో నిజంగా జరిగిన సంఘటన.
21 ఆగస్టు 1927లో మధురలో ఓ అందమైన భార్య మరణించింది. ఆమె పేరు సీతా వెర్నాయ్. ఏడాది తర్వాత 31 ఆగస్ట్ 1928న ఢిల్లీలోని సుధా నాయుడికి ఓ అందమైన కూతురు పుట్టింది. ఆ పాపకి శాంత అనే పేరు పెట్టారు. ఊహ తెలిసినప్పటి నించే శాంత తనకో భర్త, ఓ కొడుకు ఉన్నారని చెప్పేది. కాని తల్లి అవి పిల్లలు ఆడే అబద్ధాలుగా కొట్టి పారేసేది.
ఆమె యుక్త వయస్కురాలు అయ్యాక రామ్ అనే వ్యక్తి ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఓ రోజు అతను సుధా నాయుడ్ని, ఆమె కూతుర్ని పెళ్లి చేసుకోడానికి అనుమతి అడిగాడు. శాంత అతన్ని ఆ దృష్టితో చూడటం లేదని తనకి అనిపిస్తోందని, చిన్నప్పటి నించే ఆమె తనకో భర్త, కొడుకు ఉన్నారని వాదిస్తోందని సుధానాయుడు రామ్‌కి చెప్పింది. శాంతకి పెళ్లైందనుకుని అతను నిర్ఘాంతపోయాడు. శాంత అతనితో తర్వాత ఇలా చెప్పింది.
‘మా అమ్మ చెప్పింది నిజమే. నా గత జన్మలో నాకు పెళ్లైంది. కొడుకు కూడా పుట్టాడు. వారు నాకు ఇంకా గుర్తున్నారు. వాళ్ల మీద నాకు గాఢమైన ప్రేమ కూడా ఉంది’
రామ్ ముందు తల్లీకూతుళ్లు తనని ఆట పట్టిస్తున్నారని అనుకున్నాడు. కాని శాంత తన భర్త ఊరు, పేరు గుర్తున్నాయని చెప్పాక, ఆమె చెప్పేది నిజమని తెలిసాక ఏం చేయాలో నిర్ణయించాడు.
కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోని మధురలో ఆ సమయంలో వెర్నాయ్‌ని అతని ఇరవై మూడేళ్ల కొడుకు పై చదువులకి అమెరికాకి పంపమని అడుగుతున్నాడు. ఆయన ఔనని కాని, కాదని కాని జవాబు చెప్పలేదు. ఎందుకంటే ఆర్నెల్ల క్రితం ఆయన వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. ఒక్కడే కొడుకు కాబట్టి వదిలి ఉండలేనని అబద్ధం చెప్పినా తర్వాత నిజం చెప్పాడు. అతని తల్లి సీత జీవించి ఉంటే తమ దగ్గర డబ్బు ఉండేదని, తను సంపాదించిన దాంతో ఆమె కొన్న నగలు అమ్మితే తమ ఆర్థిక ఇబ్బందులు తొలగేవని కాని ఆమె మరణానంతరం వాటిని సీత ఏం చేసిందో తెలీదని వెర్నాయ్ చెప్పాడు.
సుధానాయుడు, శాంతలతో రామ్ మధుర రైల్వేస్టేషన్‌లో రైలు దిగాడు. అక్కడ నించి జట్కా బండి అవసరం లేదని, ఐదు నిమిషాల నడక దూరంలో మ్యూజియం పక్కన ఉన్న ఇల్లే తమ ఇల్లని శాంత చెప్పింది. ఇంటికి వెళ్లే దారిలో ఓ ఇల్లు చూపించి, తన నగలు చేసిన కంసాలి ఇల్లు అదే అని శాంత రామ్‌కి చెప్పింది.
ఆ ఇంటికి చేరుకున్న శాంత తోట పనిచేసే తనకన్నా పెద్దవాడైన యువకుడ్ని అతని పేరు ‘కృష్ణా?’ అని అడిగింది. అవునని చెప్పగానే ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకుని అతను తన కొడుకు అని చెప్పింది. కృష్ణ ఆమె పిచ్చిదని అనుమానించాడు. ఆమె చెప్పేది నిజమే అని, ఆమె అతన్ని వదిలి వెళ్లినప్పుడు అతనికి రెండు వారాలని రామ్ చెప్పాడు. అంతా లోపలకి వెళ్లి కృష్ణ తండ్రి వెర్నాయ్‌ని కలిసారు. ఆమె ఆయన్ని కౌగిలించుకుని తను సీత అని చెప్పింది. వెంటనే ఆయన కోపంతో ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ తన మీద వేయద్దని కొడుకుని మందలించాడు. తను జోక్ చేయడం లేదని, తను వెర్నాయ్ భార్య సీత అని శాంత చెప్పింది. కృష్ణ పుట్టిన రెండు వారాలకి తన భార్య మరణించిందని వెర్నాయ్ చెప్తే, మరణించింది తన శరీరమేనని శాంత చెప్పింది. పక్కనే ఉన్న వెర్నాయ్ కజిన్ ప్రొఫెసర్ ప్రకాష్‌ని కూడా ఆమె గుర్తుపట్టి, పేరుతో పలకరించింది. పెళ్లిచూపుల్లో అతను భర్త వెంట వచ్చినప్పుడు జరిగిన ఓ సంఘటనని శాంత గుర్తు చేసింది. వారికి మజ్జిగ ఇచ్చేప్పుడు కొంత ప్రకాష్ తండ్రి చొక్కా మీద వొలకడం ప్రస్తావించింది. అది నిజంగా జరిగింది!
మీసం ఎందుకు తీసావని వెర్నాయ్‌ని ప్రశ్నించింది. మీసం తీసినప్పుడల్లా సీత వెర్నాయ్‌తో దెబ్బలాడేది. ఏకాంతంలో ఆయన తనని గుజరాతీ భాషలో ‘లిటిల్ స్టార్’ అని పిలవడం కూడా గుర్తుచేసింది. తను మళ్లీ జన్మించి త భర్త, కొడుకు దగ్గరికి వచ్చానని శాంత చెప్పింది. కృష్ణ ఆమె మోసగత్తె అని భావించాడు.
తను తన భార్యని గాఢంగా ప్రేమించేవాడినని కాని తన కూతురు వయసు ఉన్న శాంతని భార్యగా చూడలేనని వెర్నాయ్ చెప్పాడు. కృష్ణ వాళ్లని వెళ్లిపొమ్మని శాసించాడు. వారికి ఎలా నచ్చజెప్పాలో తెలీని శాంత ఏడవసాగింది. ఆమె చాలా మంది బంధువుల గురించి ప్రశ్నించి వారితో తనకి గల చిన్నచిన్న అనుభవాలని కూడా చెప్పింది. ఆ రాత్రి వారికి తమ ఇంట్లోనే ఓ గదిని కేటాయించారు. వాళ్లు ఆ విషయాలు తెలుసుకుని తమని మోసం చేయడానికి వచ్చారని అంతా భావించారు.
కాకపోతే సీత కంఠస్వరమే శాంతకి ఎలా వచ్చిందో వెర్నాయ్‌కి అర్థం కాలేదు. తాము ఇద్దరికే తెలిసిన కొన్ని విషయాలు ఆ అమ్మాయి ఎలా చెప్పగలిగింది? పునర్జన్మ నిజం కాకపోతే ఇలా జరగడానికి ఇంకేదో కారణం ఉండి ఉంటుందని ప్రకాష్, వెర్నాయ్ అనుకున్నారు కాని అదేమిటో వాళ్లకి బోధపడలేదు.
మర్నాడు ఉదయం కృష్ణకి అమెరికాకి వెళ్లాని ఉందని, కాని ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్లలేక పోతున్నాడని విన్న శాంత వెంటనే తన నగలని అమ్మి తన కొడుకుని అమెరికా పంపమని వెర్నాయ్‌తో చెప్పింది.
తన భార్య సీత వాటిని ఏం చేసిందో తనకి తెలీదని చెప్పాడు.
శాంత ఓ ఫ్లవర్ వేజ్ స్టాండ్ దగ్గరికి వెళ్లి దాన్ని కిందకి వంచి, దాని అడుగున ఉన్న రహస్య సొరుగు మూతని తెరిచి అందులోని నగల పెట్టెని తీసి వెర్నాయ్ చేతిలో ఉంచింది. సీతకి మాత్రమే తెలిసే విషయం ఆమెకి తెలీడంతో వెర్నాయ్ ఆమే సీతని అంగీకరించాడు. కాని అతను సీత తనతో ఉండటానికి ఇష్టపడక పోవడంతో, బ్రహ్మ తనని ఈ జన్మలో ఇంకొకరి భార్యగా పుట్టింటి ఉంటాడని భావించిన శాంత ఆ సాయంత్రమే తిరిగి వెళ్లిపోయింది.
శాంతే సీతా? తన కొడుక్కి అవసరమైన సమయంలోనే ఆమె ఆ ఇంటికి వెళ్లడం కాకతాళీయమా? లేక విధా? ఈ ప్రశ్నలకి జవాబు దేవుడికే తెలియాలి.
*

- పద్మజ