S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆహ్లాదకరం (మాతో-మీరు)

జనమే జయుడు మోదీ గురించిన కవర్‌స్టోరీ ఆహ్లాదకరంగా ఉంది. సామాన్యుడు అత్యున్నత పదవి చేపట్టి రాణించడం చాలా కష్టం. మోదీపై ఎన్ని కేసులు? ఎంత వ్యతిరేక ప్రచారం? ఎన్ని అవమానాలు? అయినా మోదీ విజేత అయ్యాడు. ప్రపంచంలో ఏ నేతా ఇంత విష ప్రచారాన్ని ఎదుర్కోలేదు. అలాగే ప్రపంచానికి మనం ఏమి ఇస్తామో ప్రపంచం మళ్లీ మనకు అదే ఇస్తుందన్న ధర్మసూక్ష్మం ‘సండే గీత’లో బాగా వివరించారు. దక్షిణ కొరియాలో కొత్తకొత్త నిరసన ప్రదర్శనలు, చైనాలో మది దోచే పూల తోటల విశేషాలు అలరించాయి.
-ఆర్.సత్య (కరప)
ఆలోచింపజేసింది
నిరంతరాయంగా పనిచేసే గుండె, విరామం లేకుండా ఇంటిలో పనిచేసే అమ్మ శ్రమలను పోల్చుతూ చెప్పిన ఓ చిన్న మాట మా గుండెల్ని తాకింది. ఆలోచింపజేసింది. మనుషులు శక్తి మేరకు పని చేస్తూ అమ్మకు, గుండెకు శ్రమ తగ్గించాలని గ్రహించాం. అక్షరాలోచనల్లో ‘ఒక గుప్పెడు రాత్రులు’ కవిత బాగుంది. అవినీతి చింత గల మీలాంటి వారు దేవం కోసం ఏం చేస్తున్నారన్న మీ ప్రశ్నాపూర్వక సమాధానం భేషుగ్గా ఉంది. ర్యాంకులు జ్ఞాపకం లేవుగాని అవినీతిలో మనల్ని మించిన దేశాలు చాలానే ఉన్నాయి. గతంలో కంటే మన ర్యాంక్ రెండు పాయింట్లు మెరుగుపడిందని ట్రాన్స్‌పరెన్సీ సంస్థ చెబుతోంది.
-కె.సుభాష్ (శ్రీనగర్)
కృతజ్ఞత
దానం చేసి కృతజ్ఞత ఆశిస్తారు చాలామంది. కానీ అది తప్పు. ఏదీ ఆశించకుండా దానం చేయడమే గొప్ప - అని చెప్పిన ‘సండే గీత’ బాగుంది. గద్దలకు శిక్షణ ఇచిచ అక్రమంగా చొరబడే డ్రోన్‌లను ధ్వంసం చేయించడం అన్న కొత్త ఐడియా భలేగా ఉంది. మోదీ గెలవడం తనకిష్టం లేదని జయపాల్‌రెడ్డి చెప్పడంపై అడిగిన ప్రశ్నకు మీ జవాబు బాగుంది. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కూడా మోదీ ఆ పదవికి తగడు అన్నాడు. ఏం చేస్తాం? కొందరికి అరిసెలు, బూరెలు ఇష్టం. ఇంకొందరికి పిజ్జాలు, బర్గర్లు. అక్షరాలోచనల్లో ‘మల్లె మనసు’ కవితలో ‘అనురాగం నా నడక, ఆప్యాయత నా మాట, ఆత్మీయత నా పాట’ అనడం బాగుంది.
-బి.సోనాలి (సూర్యారావుపేట)
తెలుగు తల్లి
స్వాతంత్య్ర సమరంలో గుర్తింపు లేక గతించిన ఎందరో యోధుల సరసన ఎందరో మన తెలుగు కవులు, గాయకులు, రచయితలు కూడా మరుగున పడిపోయారు. వీరెవరూ తమకు గుర్తింపు, కీర్తి రావాలని తపించలేదు. ఇదీ వీరి గొప్ప మనసు. శంకరంబాడి సుందరాచారి గుర్తింపులేని గొప్ప కవి. ఆయన కలం అనే మనసు నుండి జాలువారిన వెనె్నలే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’. గతంలో ఎలిమెంటరీ స్కూళ్లలో ఈ పాట వినిపించేవారు. విద్యార్థుల చేత ఈ పాటను కంఠస్థం చేయించేవారు. ఈనాడెవరికీ తెలియదు. వినిపించినా శ్రద్ధగా వినేవారు కరువయ్యారు. ఏడాదిలో రెండుసార్లు వినిపించే జాతీయ గీతానికి కూడా ఈ దుస్థితి పడుతున్నది. ‘అమృతవర్షిణి’ ద్వారా ఎన్నో విషయాలను పాఠకులకు అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
అమృతవర్షిణి
వారం వారం ‘అమృతవర్షిణి’ సంగీత, సాహిత్యాల గురించి ఎన్నో అపురూపమైన విషయాలను సవివరంగా అందిస్తోంది. భారతదేశంలో లబ్దప్రతిష్టులైన సంగీత విద్వాంసుల జీవన ప్రస్థానం చదువుతుంటే మనస్సు ఆనందంతో పరవశించింది. ‘నమ్మండి ఇది నిజం’ శీర్షిక ద్వారా ఊహకు అందని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. యాసిడ్ దాడులకు గురై, సమాజంలో తిరస్కారానికి గురైనా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, నూతన జీవితం ప్రారంభించి అవరోధాలను, అవహేళనలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ‘షీరోస్’ సంస్థను స్థాపించి, ప్రపంచ ఖ్యాతి గడించిన ఆ ఐదుగురు షీరోలు గురించిన కవర్‌స్టోరీ అద్భుతంగా ఉంది. చిన్నపాటి సమస్యలకే కృంగిపోతూ నిరాశా నిస్పృహులకు లోనై జీవితం పట్ల నిరాసక్తత పెంచుకుంటున్న మానవాళికి ఈ షీరోలు స్ఫూర్తిదాతలు.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
ఓ చిన్న మాట
ప్రతి విషయంలోనూ ఓ మాట ముందుగా చెప్పడం వల్ల చాలా అనర్థాలు, అపోహలూ ఎలా నివారించబడతాయో ‘ఓ చిన్న మాట’లో బహు చక్కగా వివరించారు. గోడ మీద 3-డి ఎఫెక్ట్ బొమ్మ, లాంగ్‌జంప్‌లో జంప్ చేసిన ఇసుక ఫొటో భలేగా ఉన్నాయి. అమృతవర్షిణిలో వేంకటరావు గారి స్పందన మమ్మల్ని అమితంగా అలరించింది. టిఫిన్‌తోబాటు కస్టమర్ కోరుకున్న కపిలవాయి పాట వేయడం అద్భుతమైన ఆలోచన. లక్ష సంవత్సరాల ముందు ఈ భూమీద సంచరించిన పక్షి మానవుల ఉదంతం ఆకట్టుకొంది.
-ఆర్.మరుదకాశి (కరప)
లోకాభిరామమ్
ప్రపంచం అంటే సైన్స్ అంటూ గోపాలంగారు చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నిజమే. ఒక పనిని చిత్తశుద్ధితో చేస్తుంటే అందుకు తగిన మరిన్ని అవకాశాలు వాటికవే వస్తాయని చెప్పడం బావుంది. కాంపియాన్ ఎల్‌ఫెర్రో ద్వీపానికి వెళ్లడం, అక్కడి హోటల్‌లో అందరూ చాలా పరిచయం ఉన్నట్లు మాట్లాడటం, అతడు గతంలో నాలుగు నిమిషాలు గుండె ఆగిపోయి మరణించి మళ్లీ జీవించడం అంతా సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది. ప్రపంచంలో భలేభలే వింతలు జరుగుతూ ఉంటాయి. ‘కథాసాగరం’లో నచికేతుని వృత్తాంతం ద్వారా ఆత్మజ్ఞానం కలిగించారు.
-డి.అభిలాష (సాంబమూర్తినగర్)