S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చేవ్రాలు చెయ్యాలని...

కవి సమ్మేళనానికి వెళ్లిరావాలి
పద్యం పదవీ విరమణ చేశాక
భావ కవిత్వం సెలవు పెట్టాక
అభ్యుదయ కవిత్వం
సమతను మీటుతూ
విప్లవం చాటుతూ
దళిత వాదమై ఎలుగెత్తి
స్ర్తీవాదమై ప్రజ్వరిల్లి
మైనారిటీ వాదమై మెరుస్తూంది
ఏ వాదానిది ఎంత సాంద్రతో
మరెంత తులాభారమో
ఎంతెంత మానవ కళ్యాణమో
శోధనకెళ్లిరావాలి!
సర్కారు దవాఖానాకెళ్లిరావాలి
మంచాల్లోంచి లేవని రుగ్మతల్ని
నడిచే కట్టెపుల్లల్ని
విలపించే గాజుకళ్లని
మూగబాధల గాథల్ని
ప్రార్థించే చేతుల్ని
ప్రార్థనలు స్వీకరించే పటాల్ని
మానవ సేవలో
వైద్యసేవను పరికించి రావాలి!
డంపింగ్ యార్డుకు వెళ్లిరావాలి
నెలలు నిండని మరణాల్ని
పారేసిన శిశువుల్ని
భ్రూణహత్యల్ని
దాచేసిన రహస్యాల్ని
జారేసిన మానవత్వాన్ని
ఏరుకుని కూడుకుని రావాలి!
చెలియలికట్టకు వెళ్లిరావాలి
పరిధి దాటి సముద్రం
ప్రజలపై దూకే ప్రయత్నాన్ని
ప్రతిఘటించి చెలియలికట్ట
అహర్నిశం పోరుతుంటే
అలుపెరగక అలల ఆయుధాల్తో
అడుగడుగునా సముద్రం
చెలియలికట్ట శరీరాన్ని
ఛిద్రం చేస్తుంటే
గాయపడ్డ చెలియలికట్ట
దూకే తరంగాలకు అడ్డుకట్ట
మానవ సేవలో క్షతగాత్ర కరకట్ట
దృఢ సంకల్పం దర్శించి రావాలి!

- అడిగోపుల వెంకటరత్నమ్ 9848252946