S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జోరుగా.. హుషారుగా!

బాలీవుడ్ బ్యూటీ ‘పీకే’ భామ అనుష్కశర్మ జోరు జోరుగా.. ఎంతో హుషారుగా కెరీర్‌ని సాగిస్తోంది. ఓ పక్క నటిస్తూనే మరో పక్క నిర్మాతగానూ మారి ఎంతో కష్టమైన రెండు పడవల ప్రయాణం చేస్తూ మెప్పిస్తోంది. ఇలా రెండింటిలోనూ తన సత్తా చాటుకుంటోంది. ‘్ఫలౌరీ’ చిత్రంతో నిర్మాతగా తన రెండో విజయాన్ని కైవసం చేసుకోవడమేగాక, ఆ చిత్రంలో కీలక పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకుంది. అనుష్కశర్మ వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితమంతా సోషల్ మీడియాలో హాట్ టాపిక్కే. క్రికెటర్ విరాట్ కోహ్లీతో అనుబంధం నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో వుంటూనే వస్తోంది. అయినా అనుష్క ఇవన్నీ ఏం పట్టించుకోదు. తన కెరీర్ తనదే. అంతా కెరీర్‌పైనే దృష్టి. అందుకే తన జీవితమంతా జోరుగా..హుషారుగా సాగిపోతూనే వుంది. నిర్మాతగా, నటిగా ఎలా వుంది కెరీర్ అని అనుష్కను అడిగితే- ‘‘చాలా హ్యాపీగా వుంది. నిర్మాతగా విజయాల్ని అందుకోవడం కొత్త అనుభూతినిస్తోంది. నటిగా సాధించిన విజయాలకంటే నిర్మాతగా అనుభవిస్తున్న కెరీర్‌లో అదో ఆనందం’’ అంటూ సెలవిచ్చింది. వాహ్..అనుష్కశర్మ!!