S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యంత్రాలొచ్చాకనే...

కురుస్తున్న మేఘం ఒకటి ఊరిపై కాసేపాగితే చాలు
సవాలక్ష సంబరాల అంకురాలు... కళ్లల్లో కోటిదీపాల వేకువలు
భవిష్యత్తు ఉషోదయాల్లా నేలపై
ఆశల మొలకలు పురుడు పోసుకుంటాయ
నాలుగు చినుకులు కయ్యనిండా రాలితే చాలు
మట్టి వాసన నేలబంధాన్ని గుర్తుచేస్తుంది
తొలకరి నుండి తుపాను తీరాల దాకా
చినుకు నుండి చెరువు దాకా...
దుక్కుల నుండి ధాన్యపు బస్తాల దాకా
రాస్తే కూలీల సంబరం మహాకావ్యమవుతుంది
కానీ యంత్రాలొచ్చాకే
సేద్యంతో చిరకాల బంధం తెగిపోయాక!
మెడలో పాత తువ్వాలుగుడ్డ, చేతిలో అన్నంబాక్సు
కాలినడకన, ఆటోల్లో క్రిక్కిరిసిపోయే మహిళా కూలీలు లేరు
గనేల మీద గుంపులుగా కూర్చొని గుప్పెడు చద్దన్నం మార్చుకోవడం
పంట కాలువలో దాహాన్ని తీర్చుకోవడం
దిగుడు బావుల్లో దేహాన్ని తడుపుకోవడం
పొద్దు దిగిపోయ గూడు చేరేవేళ ఆత్మీయతలు పంచుకోవడం!
రాతిరేళ రచ్చబండ్లపై రేపటి కర్తవ్యాన్ని చర్చించడం కనుమరుగైపోయాయ
యంత్రాలొచ్చాకే వెనకటి బంధం తెగిపోయంది!
సేద్యానికి స్వేదానికి మధ్య స్నేహదీపం కొడిగట్టిపోయ
ఆకలికి నాగలికి మధ్య శ్రమైక బంధపు పుస్తె తెగిపోయంది!
యంత్రాలొచ్చాకనే!
పనిముట్లు పనికిరాకుండా పోయ ముప్పూటలా...
తిండి మిధ్యై పైరుకు మధ్య దిష్టిబొమ్మైనాడు!
పనితో అనుబంధం సమాధై కూలీ అనాధైపోయాడు
శ్రమకు రాజీనామా చేసి వృత్తికి ముందు మాజీని చేర్చుకున్నాడు!
యంత్రాలొచ్చాకనే...!
నారుకట్టల కావిడిబద్దల నారేతల జానపదాలు
కొత్త కొడవళ్ల తయారీలు, కొలిమి శబ్దాలు అశ్రవణమైపోయాయ...
బారుగా సాగే జోడెద్దుల గడ్డిబండ్లు, మెడలో గంటలు దారితప్పాయ
మధ్యలో రంకెలు, కొయ్యచట్రాల ఇరుసునాదం శృతి తప్పింది!
చేతికోతలు యంత్రానివైపోయ గుండె కోతలు మిగిలాయ!
కలుపుతీతలు కాలధర్మం చెంది కడుపుకోతలైనాయ!
పంటనూర్పిడులు కనుమరుగైపోయ
బ్రతుకు మార్పిడులు ప్రశ్నార్థకాలైనాయ
యంత్రాలొచ్చాకనే...!
పసిడి పంటల్లో విషపు మందుల మోములొచ్చాయ
అంచనాలకు మించిపోయ పెట్టుబడులు అప్పులై
లాభాలు వడ్డీలయ్యాయ
సేంద్రియ ఎరువులు పోయ ప్రపంచీకరణ మందులొచ్చి
రైతు బ్రతుకులపై ఆత్మహత్యల పిచికారీ చేశాయ
ఊరికి రాజీనామా చేసి ‘ఉరి’కి చిరునామా అయనాడు కూలీ
యంత్రాలు పొలంలోకి దిగాకనే!

బ్రతుకు భరోసానిచ్చిన వ్యవసాయ పనులు కూలీలకు దూరమైనాయ
గతం తాలూకు జ్ఞాపకాలు కళ్లముందు ద్రవిస్తున్నాయ
దిక్కు తెలియక దిగులు చూపులు చూస్తున్న కనుపాపలు
ఎంత వాన కురిసినా
ఆకాశం ఎత్తుకు చూడకనే వాలిపోయాయ!
కారే కన్నీళ్లు కురుస్తున్న వర్షంతో కలిసిపోయాయ!!

-ఆనంద్ కాళిదాస్, 9133366955