S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కవి దేశం

అలౌకికం, లౌకికం
ఏ పారవశ్యం నన్ను ముంచెత్తినా
మట్టిని మర్చిపోని
మట్టి పుత్రున్ని నేను
మట్టి నా ప్రాణం
కవిత్వం, మట్టి రెండూ కలగలిసిన
జీవితం నాది
కవిత్వం కూడా నా ప్రాణమే
మట్టి నాకు ప్రాణం పోస్తుంది
కవిత్వం నాకు ఊపిరినిస్తుంది
జీవితాన్ని నిటారుగా నిలబెట్టాలని
అడవులు, కొండలు, నదులు వంకలు
ఎన్నో దాటాను కానీ -
జీవితం ఒక సాగర కెరటమయ్యంది
జీవితం నీకు నీరు అవుతుంది
నిప్పు రవ్వ అవుతుంది
ఈ మట్టిలో పుట్టిన మహా భాగ్యానికి
కట్టె కూడా ఆయుధంగా మారుతుంది
శాంతి త్యాగంగా జన్మ పొందుతుంది
యుద్ధం కొరకు నడక కాదు కానీ
నడక యుద్ధమయతే ఏం చేయగలను
ఈ మట్టిలో పుట్టిన పుణ్యమే
కవిత్వం నదిలా ప్రవహిస్తుంది

-సిహెచ్.మధు, 9949486122