S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బట్టీ

చింటూకి బట్టీపట్టటం అంటే ఇష్టం లేదు. అర్థం తెలియని వాటిని నేర్చుకోవడం అంటే చిరాకు.
సంస్కృత శ్లోకాన్ని బట్టీపడుతూ బన్నూ... చింటూకి కనిపించాడు.
‘‘మిమిక్రీ మిమిక్రీ’’ అంటూ గేలి చేయడం మొదలుపెట్టింది.
ఏడుస్తూ బన్నూ వెళ్లి టీచర్‌కి చెప్పాడు.
‘‘అలా గేలిచేయడం తప్పు’’ అంటూ చింటూని మందలించింది టీచర్.
‘‘అర్థం తెలుసుకోకుండా నేర్చుకోవడం అంటే జంతువులు, పక్షుల అరుపులను నేర్చుకోవడం వంటిదే’’నంటూ మాధవి టీచర్‌కి బదులిచ్చింది చింటూ.
టీచర్ మాధవి కోపంగా చూస్తూ ‘‘అదే శ్లోకాన్ని ఇరవైసార్లు బిగ్గరగా చదువు’’ అంటూ చింటూకి శిక్ష విధించింది.
భయంతో అలాగే చేసింది చింటూ. ఫలితంగా ఆ శ్లోకం కంఠతా వచ్చింది చింటూకి.
అదృష్టవశాత్తు అదే శ్లోకం చింటూకి సంవత్సరాంతపు పరీక్షల్లో వచ్చింది. చక్కగా వ్రాసింది. ఫలితంగా తెలుగులో క్లాసుకే ఫస్టు వచ్చింది చింటూ.
తంతే గారెల బుట్టలో పడ్డట్టు పెద్దలు విధించే శిక్షలు. పిల్లలకు మేలే చేస్తాయని అర్థమైంది చింటూకి.

- జి.సందిత