S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇండియన్ బ్రూస్లీ

షి, దీక్ష, పట్టుదల ఎలాంటి వారినైనా ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి. అటువంటి వారికి కాలమాన పరిస్థితులు, వయోపరిమితులు కూడా అడ్డుకట్ట వేయలేవు. అటువంటి వ్యక్తే కేరళలోని మున్నార్‌కి చెందిన ఐరన్ మ్యాన్, ఇండియన్ బ్రూస్లీగా పేరు తెచ్చుకున్న కె.జె. జోసెఫ్. క్రీడలు, జిమ్నాస్టిక్స్ వంటి వాటిలో రాణించడానికి వయసు కొంత వరకే పరిమితి చేస్తుంది. అయితే మొక్కవోని దీక్ష, పట్టుదలతో జోసెఫ్ నలభై పైబడిన వయసులో కూడా ఒకపక్క కరాటే, మరోపక్క బలప్రదర్శనలు చేస్తూ అందరిచేతా ఔరా అనిపిస్తున్నాడు. అతను రెండు చేతులు ముడిచి దండీలు కొట్టడంలో ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. నిజానికి ఈ రికార్డు తొలుత అమెరికాకి చెందిన రాన్ కాపర్ పేరిట ఉండేది. అతను 60 సెకన్లలో 79 దండీలు తీయడం ద్వారా ఈ రికార్డును సాధిస్తే జోసెఫ్ అదే 60 సెకన్లలో ఏకంగా 82 దండీలు తీసి రాన్ కాపర్ పేరిట ఉన్న రికార్డును సొంతం చేసుకున్నాడు.
దీని కోసం జోసెఫ్ కఠోరశ్రమ చేసాడు. 2015లో జోసెఫ్ చేసిన ఈ ఫీట్‌ను మెచ్చిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ ఘనతను సగౌరవంగా నమోదు చేసారు.
సాధారణంగా మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిలో రాణించడానికి 35 ఏళ్ల వరకు అవకాశం ఉందని అంతా అనుకుంటారు. ఆ తర్వాత ఎంతటి ఘనాపాటిలైనా ఆ రంగం నుండి మెల్లగా నిష్క్రమిస్తారు. కానీ జోసెఫ్ అలా అనుకోలేదు. మనసు, శరీరంపై నియంత్రణ సాధిస్తే ఇటువంటి వాటికి ఒక వయస్సంటూ ఉండదని అతను భావిస్తుంటాడు. అందుకు తగ్గట్లే అతను తన మనస్సు, శరీరానికి కఠోరమైన తర్ఫీదునిచ్చి నలభై దాటిన ఈ వయసులో కూడా పోరాట కళల్లో రాణిస్తున్నాడు.
ఒక పక్క కరాటేలో రాణిస్తూనే జోసెఫ్ ఆయుర్వేద వైద్యంలో కూడా ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నాడు. శాఖాహారం ప్రాణశక్తిని ఇనుమడింపజేస్తుందని భావించే జోసెఫ్ కొనే్నళ్ల క్రితమే మాంసాహారాన్ని మానేసాడు. తద్వారా శరీరం తన చెప్పుచేతల్లో ఉంటుందని అతనంటుంటాడు.
జిమ్‌కి వెళ్లకుండా తనంతట తానే ప్రాక్టీస్ చేసే జోసెఫ్ నియమబద్ధ జీవితం ద్వారా చక్కటి ఆరోగ్యంతో పాటు మనసును కూడా నియంత్రణలో పెట్టుకోవచ్చని చెబుతుంటాడు. ఇతరులకు సాధ్యపడని రీతిలో విజయాలు సాధిస్తున్న జోసెఫ్ మరో అరుదైన ఫీట్ సాధించి అందరి చేతా కితాబులు అందుకున్నాడు. 17.99 ఎంఎం ఇనుప ఊచను అతను వట్టి చేతులతో వంచేసి చూపరులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసాడు. అలాగే యూనివర్సల్ రికార్డ్స్ ఫోరం కోసం అతను మరో ఘనతను కూడా సాధించాడు. అదేమిటంటే ఒక్క గంటలో ఏకంగా 2092 దండీలు తీయడం. ఇది సాధించాలంటే యువకులకే సాధ్యం. కాని జోసెఫ్ శరీరం యువకులతో పోటీ పడుతూ ఉంటుంది. అందుకే అతను ఈ ఫీట్‌ని సునాయాశంగా ప్రదర్శించి తనకు మరెవరూ సాటి రారని నిరూపించాడు.
మున్నార్‌లోని ఆయుర్వేద సెంటర్‌లో పని చేసే జోసెఫ్ ప్రతిరోజూ దాదాపు రెండున్నర గంటల సేపు సాధన చేస్తాడు. సాధన చేయనిదే అతను బయటికి కూడా రాడు. ఇక అతని తర్వాతి లక్ష్యం 60 సెకన్లలో ఆగకుండా 90 దండీలు తీయడం. అది కూడా సాధిస్తానని అతను ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. కరాటేలో రాణించాలని ఉబలాటపడే యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న జోసెఫ్ గెలవాలంటే శ్రమించక తప్పదని, కష్టపడితే పట్టుబడనిది ఏదీ లేదని అంటున్నాడు.

- దుర్గాప్రసాద్ సర్కార్