S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రూటే వేరు!

బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ రూటే వేరు. పలు హిందీ చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. చేసిన చిత్రాల్లో పోషించిన వెరైటీ క్యారెక్టర్ల ద్వారా నర్గీస్ అంటే ఏంటో ప్రేక్షకులకే కాదు, బాలీవుడ్‌కూ తెలిసొచ్చేలా చేసింది. తాజాగా హాలీవుడ్‌లోనూ మెరుస్తోంది. ఇంతకు ముందు ‘స్పై’ అనే ఆంగ్ల చిత్రంతో ఆడిపాడిన ఈ అమ్మడు ‘5 వెడ్డింగ్స్’ అనే మరో హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్‌కు జోడీగా కవ్వించనుంది. బాలీవుడ్ వివాహల గురించి ఓ అమెరికన్ జర్నలిస్టు వివరించే నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో నర్గీస్ ఫక్రీ తన పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేసే దిశగా అడగులు వేస్తోంది. బాలీవుడ్.. హాలీవుడ్ ఇలా రెండు పడవల ప్రయాణాన్ని విజయవంతంగా ఏలుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దటీజ్..నర్గీస్ ఫక్రీ!!

-సమీర్