S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రితికా.. మజాకా!!

స్వతహాగా బాక్సింగ్ క్రీడల్లో రాటుదేలిన ఈ ముద్దుగుమ్మ వెండితెరపై నటిగా అడుగులు పెడతానని ఏ మాత్రం ఊహించలేదట. ఏషియన్ బాక్సింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన రితికా సింగ్‌ను చూసిన నటుడు మాధవన్ తన తమిళ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అదే ‘ఇరుదు సుట్రు’. అలా అనుకోకుండా చిత్రసీమలోకి పాదం మోపింది. తాజాగా రాఘవ లారెన్స్‌తో ‘శివలింగ’లో నటించింది. మేకప్ లేకుండా వెంకటేష్ ‘గురు’లోనూ కనిపించింది. వీటితో పాటు ఓ తమిళ సినిమా చేస్తోంది. తెలుగులో అవకాశాలు బాగానే తలుపుతడుతున్నాయి. కెరీర్ ఎలా వుంది అని రితికాను కదిలిస్తే- ‘‘చాలా హ్యాపీగా వుంది. మాధవన్, వెంకటేష్‌తో నటించిన నేను ఎన్నో నేర్చుకున్నా. తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. వైవిధ్యమైన పాత్రలతో పాటు గ్లామర్‌తో నిండిన క్యారెక్టర్లతోనూ కవ్వించాలనుంది. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలన్నదే నా ఆలోచన. నాకు నటనలో ప్రియాంక చోప్రా, అనుష్కశర్మలే స్ఫూర్తి’’ అంటూ ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చింది రితికాసింగ్!!

-సమీర్