S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అగ్నిగోళంపై అన్యజీవులు!

అసాధ్యమైన అంగారక గ్రహం మీద జీవ వాస్తవాలను పరిశోధించడానికి అమెరికా వంటి దేశాలు సాహసోపేతంగా చేస్తున్న ప్రయోగాలు కొన్ని విస్మయకరమైన వార్తలను వెలువరిస్తున్నాయి. దాదాపు సూర్యగ్రహమంత వేడిమితో వెలిగిపోయే అంగారక గ్రహానికి చేరుకోవడం అంతసాధ్యం కానప్పటికీ శాస్తవ్రేత్తల ప్రయోగాలు మాత్రం అక్కడి వాస్తవాలను తెలుసుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. ఆ ఫలితంగానే అశ్చర్యం కలిగించే ఒకటి, రెండు విశేషాలు ఇవే.. అంతరిక్షంలోని మహాగ్నిగోళం అంగారకుడిపై కొన్ని అన్యగ్రహాలకు చెందిన జీవుల కదలికలను నాసా (ఉత్తర అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) శాస్తజ్ఞ్రులు, అంతరిక్ష నావికులు కనుగొన్నట్టుగా పరిశోధనలు రూఢి చేస్తున్నాయి. నాసా నుంచి విడుదలైన ఛాయాచిత్రాల ద్వారా అంగారక గ్రహం మీద బల్లి, పీతల వంటి కొన్ని ప్రాణులు జీవిస్తున్నట్టుగా తెలుస్తోంది. క్యూరియాసిటీ అనే రోబో అంగారక గ్రహం మీద ఉన్న లేదా జీవిస్తున్న కొన్ని ప్రాణుల ఛాయాచిత్రాలను నాసాకు అందించింది. ఈ ప్రాణులు లేదా జీవుల ఉనికిని అంగారకుడిపై రోబోల ద్వారా ప్రయోగాలు చేస్తున్న ఉపగ్రహాలు వెల్లడించాయి. ‘ఆ బల్లి వంటి జీవి మార్స్ క్యూరియాసిటీ ఉపగ్రహం కెమెరాకు అంటుకుని వేలాడుతున్నట్టు కనిపించింది,’ అని ఒక శాస్తవ్రేత్త తెలిపారు. బల్లిలాంటి రెక్కలు గల అటువంటి ప్రాణులు కొన్ని అక్కడ ఉంటున్నాయి. అంతేకాకుండా, కొన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు భూమీద కనిపించిన రాక్షసబల్లి వంటి ప్రాణులు కూడా కనిపించాయని కూడా వెల్లడించారు. ఆ శాస్తవ్రేత్త చెప్పిన ప్రకారం, రోవర్ మొదట తీసి, పంపించిన ఛాయాచిత్రాల తర్వాత వెంటనే, మరో పది నిముషాల తర్వాత మళ్ళీ పంపించిన ఫొటోల్లో ఆ జీవి ఒకచోట నుంచి మరోచోటకు గెంతినట్టుగా స్పష్టంగా కనిపించింది. దీని ప్రకారం ఆ శాస్తవ్రేత్త రూఢిగా ధ్రువీకరించింది ఏమిటంటే.. ‘పరగ్రహ జీవులు లేదా ప్రాణులు అంగారకుడి మీద ఉన్నాయి. అవి భూమీద నుంచి వెళ్ళి, పరిభ్రమణం చెందే ఉపగ్రహాల కెమెరాలకు స్పష్టంగా కనిపించాయి.
అయితే, ఈ సమాచారాన్ని వ్యతిరేకించిన వార్తలు కూడా లేకపోలేదు. ఒక వెబ్‌సైట్ విడుదల చేసిన వార్త ప్రకారం.. అంగారకుడి మీద పరిశోధనలు చేస్తున్న ఉపగ్రహం లోపలి క్లీనర్లు పనిచేస్తున్నప్పుడు రేగిన ధూళి కణాలు ఇటువంటి ఛాయా చిత్రాలను సృష్టించాయట. నాసా కూడా ఈ వాదనను బలపరుస్తూ అంగారక గ్రహం నుంచి వెలువడే వేడి వాయువులు ఇటువంటి ఆకారాలను భ్రమింపజేస్తాయని పేర్కొంది.

- గున్న కృష్ణమూర్తి