S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ చేపలు నడుస్తాయ్!-

టాస్మేనియాలో మాత్రమే కనిపించే ఈ చేపలను ‘స్పాటెడ్ హ్యాండ్ ఫిష్’ అని పిలుస్తారు. శరీరంపై ఉండే మచ్చలు, సముద్రం అడుగుభాగాన నేలపై చేతులతో నడిచినట్లు అవి సంచరించడం వల్ల వాటికి ఆ పేరు వచ్చింది. మన వేలిముద్రల్లాగే ఈ చేపల్లో ఏ రెండింటికి మచ్చలు ఒకేలా ఉండవు. తమ జీవితకాలంలో చాలా అరుదుగా మాత్రమే ఈ చేపలు ఈదుతాయి. ఉదరభాగంలో ఉండే ‘్ఫన్స్’ను చేతుల్లా ఉపయోగించి అవి నేలపై నడుస్తూ ఆహారాన్ని అనే్వషిస్తాయి. సముద్ర జలాల్లో 6.5 అడుగుల నుంచి 92 అడుగుల లోతువరకు ఇవి నేలపై ఇవి జీవించగలవు. ఆస్ట్రేలియా, టాస్మేనియా సముద్ర జలాల్లోకి పొరపాటుగా చేరిన నార్తర్న్ పసిఫిక్ స్టార్‌ఫిష్‌ల వద్ద ఈ స్పాటెడ్ హాండ్‌ఫిష్ జాతికి పెద్ద ముప్పు ఏర్పడింది. ఈ చేపల గుడ్లను అమాంతం స్టార్‌ఫిష్‌లు ఆరగించేస్తూండటంతో వీటి ఉనికి ప్రశ్నార్థకమవుతోంది.

ఎస్.కె.కె. రవళి