నీడలు
Published Saturday, 29 April 2017ఎన్ని నిశ్శబ్దాలు కబళిస్తున్నా
ఎన్ని నిరాశలు కమ్మేసినా
ఎన్ని నిస్పృహలు ఆవరించినా
కొంత ఏకాంతం ఊరడిస్తుంది
నిదానించమని నిమ్మళించమని
సంద్రాన్ని సంగమం అలరిస్తున్నా
కెరటాలు కేరింతలతో కవాతు చేస్తున్నా
ఆటుపోటులు తప్పవంటూ
ఉప్పెనలు ఊపిరాడనివ్వవనుకుంటూ
దిగులు దిగులుగా దిగమింగేస్తున్నా
ఏదో ఒకనాడు
కొన్ని వౌనాలు పగుల్తాయ
కొన్ని నిశ్శబ్దాలు శబ్దిస్తాయ
కొన్ని జ్ఞాపకాలు చిట్లుతాయ
కొన్ని నీడలు జడలిప్పుతాయ
కొన్ని నమ్మకాలు నిలబెడతాయ
నిజాలు భగ్గుమన్నా పర్వాలేదు
నీ హృదయం ముక్కలు కానివ్వకు