S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేహంపై పచ్చబొట్టు

నా దేహాన్ని
నాకు నేనుగా స్పర్శించుకుంటుంటే
కొత్తగా... తోస్తోంది
నన్ను నేను తెలుసుకోలేకపోయానని
ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది
లోలోన ఇన్నిన్ని రాగాలా?!
ఇన్నిన్ని స్వప్నాలా?!
ఇంతకాలం...
దేహం దేహంగానే ఉండిపోయందేమో!
లోతుగా స్పర్శించుకోలేకపోయానేమో?!
నన్ను నేను చూసుకోలేకపోయానేమో?!

ఇప్పుడు...
నా దేహం ఒక అచంచలం
అనిర్వచనీయం
వెయ్య వీణల తన్మయత్వం

ఇన్నాళ్లూ...
ఈ దేహాన్ని ఒంటరి పక్షిగా
ఏ స్వప్నం... చొరబడని ఒడిలో
వదిలేశానా?!
పర్వాలేదులే..
ఆలస్యంగానైనా...
నా దేహంలోకి జారిపోతున్నా

ఇప్పుడు
నా దేహం... నన్ను నన్నుగా
పోల్చుకుంటుంది
నన్ను నన్నుగా లాలిస్తుంది
ననె్నరిగిన తన్మయత్వమై
నాతో మాత్రమే రమించే
ఓ అంతరంగం

ఇప్పుడు నా దేహం
పగలు... రాత్రి
నను ఊయలలూపే
కమ్మని పాట
తరగని... చెరగని పచ్చబొట్టు.

-గంగాధర్ వీర్ల, 9502328972