S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నదీ తీరాన...

ఒంపులు తిరిగే అడవి కన్య వాల్జడలా
నా ఒంటరి నదీ తీరమా... ఎంత బావున్నావో!
అలసిన వేళ అలా నీ నీటి పయ్యాడతో
నా మోము తుడిచి
నీ యసుక తినె్నల మీద సేదదీర్చిన
నదీమతల్లీ... నీకు నమస్కరిస్తాను
రాతిరి చెప్పిన నీ అలల గుసగుసలు
ఎంత మధురమో...!

నదీ ఆవలితీరం నుండి
ఎగిరొచ్చే పక్షుల గుంపు కువకువలూ
తీరం పొడవునా పరచుకున్న
రెల్లుపూల సొగసులూ జాస్తే...
బతుకు పీల్చి పిప్పి చేసిన శైధిల్యంలోంచి
సారవంతమైన ఓ మొలక
ఉదయస్తుందన్న ఆశగా ఉంది!

నదీ అలల ఉయ్యాలలో నన్ను సేద తీరనీ...
బీటలు వారిన బీడు దేహం తాపం తీరనీ
జలదేవతా... నీ చనుబాల ధారలు తాగీతాగీ
శిశువులా కేరింతలు కొట్టనీ...
గాయపడ్డ మనసు మీద
చల్లగాలి చలువ గంధాలు పూయనీ...
హృదయమా... వికసిత పద్మంలా విప్పారవే!!

- సిరికి స్వామినాయుడు, 9494010330