S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజులా...

ఈ మధ్య ఓ మిత్రుడు రాజులా బతకాలని చెప్పాడు. ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పాడు. అందరికీ ఎలా వర్తిస్తుందో అర్థం కాలేదు. రాజులా బతకాలంటే ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. ఆ విషయం అతనే్న అడిగాను. అతను ఓ నాలుగు విషయాలు చెప్పాడు. వాటిని పాటిస్తే రాజులా బతకొచ్చని చెప్పాడు.
* నీ జీవితంలో నీవు ఏమి సాధించాలనుకున్నావో వాటిని పూర్తిచేయి. చేద్దామని అనుకున్న పనుల కోసం కాలాన్ని వృథా చేయకు. మంచి క్షణం అనేది ఏమీ లేదు. ఈ క్షణమే మంచి క్షణం. ఇప్పుడే దాన్ని ప్రారంభించు. ముహూర్తం కోసం కాలాన్ని వృథా చేయకు.
* చేయాలని అనుకున్న పనులని ప్రాధాన్యతా క్రమంలో ఏర్పరచుకో. అదే క్రమంలో వాటిని పూర్తిచేసే ప్రయత్నం చేయాలి. ఆ చేసే క్రమంలో అందరినీ సంతోషపరచలేం. కానీ బాధపెట్టకుండా ఉంటే చాలు. సమయాన్ని బట్టి సందర్భాన్ని ప్రాధాన్యతా క్రమాన్ని మార్చుకో.
* సహచరులకి సహకారం అందించు. వాళ్లని ఇష్టపడు. నిన్ను ఇష్టపడేలా ప్రవర్తించు.
* నేర్చుకోవడం అనేదానికి ముగింపు లేదు. అది జీవితాంతం వరకు ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. నాకు అంతా తెలుసు అన్న భ్రమలో వుండకూడదు.
జీవించడంలో ప్రతి వ్యక్తికి ఒక్కో పద్ధతి ఉంటుంది. కాని మా మిత్రుడు చెప్పిన నాలుగు సూత్రాలు అందరికీ వర్తిస్తాయి. ఈ సూత్రాలని అందరూ పాటించాల్సిందే. ఈ విషయంలో లింగవివక్ష లేదు. హోదాతో ప్రాంతంతో పనిలేదు.
ఏ పనిని తిడుతూ చేయకూడదు. ఇష్టపడుతూ చేయాలి. మనం ఎలా చూస్తే ఆ పని అలా కనిపిస్తుంది.
జీవితంలో ప్రతి క్షణం అమూల్యమైందే. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఓ మధురక్షణంగా మార్చుకుందాం. యుక్త వయస్సులో చనిపోయి, వార్థక్యంతో ఖననం అయిపోవడం కాదు. జీవితాన్ని పూర్తిగా అనుభవిద్దాం. అర్థవంతం చేద్దాం.
మన జీవితానికి మనమే రాజులం. అందుకని రాజులాగా బతుకుదాం.

- జింబో 94404 83001