S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కుల రాజకీయాల్లో..

దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ నిజంగా ఆ పదవికి అర్హుడే. కుల రాజకీయాల్లో మగ్గిపోతున్న రాష్ట్రాన్ని ఉద్ధరించడం చాలా కష్టమే అయినా ఎవరైనా ఉద్ధరించే వారున్నారా అని ఆలోచిస్తే ఆ యోగి ఒక్కడే జ్ఞాపకం వస్తాడు. ఇక - దురదృష్టకర పరిస్థితుల్లో మరణించిన 128 మందిని బతికిస్తానని చెప్పి మరణించిన వారు ఒక్కొక్కరే వస్తున్నట్టు నాటకం ఆడి వాళ్లు రాకుండా ఉండేందుకు డబ్బు వసూలు చేసిన మోసగాడు క్రైం కథ కొత్తగా ఆసక్తికరంగా ఉంది. రివాల్వర్ బదులు బుర్ర ఉపయోగించే పోలీసు ఆఫీసరే బోల్తాపడటం అసలు ట్విస్ట్!
-కె.సుభాష్ (శ్రీనగర్)
యోగులు
యోగులే పాలకులు కావాలి.. ధర్మబద్ధంగా న్యాయపరంగా రాజ్యపాలన సాగాలంటే మూడే మూడు కారణాలున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మొదటిది రాజ్యపాలకుడు నిస్వార్థ జీవి కావాలి. రెండవది స్ర్తిలు పవిత్రులుగా ఉండాలి. మూడవది బ్రాహ్మణులు గౌరవింపబడాలి. ఉత్తరప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ యోగి కాబట్టి నిస్వార్థి అయ్యాడు. రాజకీయాలలో యోగులే కాని భోగులుండరాదని ఆయన సెలవిచ్చారు. వివాహ బంధాల వలయంలో చిక్కకుండా రాజ్యపాలన చేసేవారే ఉత్తములని ప్రముఖ గ్రీసు రాజనీతి శాస్త్ర పితామహుడని పేరున్న ప్లేటో తన తత్వశాస్త్రంలో రాశాడు. ఈ అభిప్రాయాన్ని అరిస్టాటిల్ లాంటి వారు ఖండించారనుకోండి. పరమార్థమేమంటే అసలు వివాహాలు చేసుకోవద్దని కాదు. ప్రజా సంక్షేమంలో నిస్వార్థ సేవే ప్రాధాన్యం కావాలి. ఆదిత్యనాథ్ స్ఫూర్తి ఆదర్శవంతం కావాలి.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
చరిత్ర
చారిత్రక చిత్రాల్లో కల్పనల గురించి అడిగిన ప్రశ్నకు మీ సమాధానం ఎక్స్‌లెంట్. అయినా చరిత్ర గురించి ఎవరు అడుగుతారు? చరిత్రను గ్రంథస్థం చేయడం మనకు అలవాటు లేదు. బ్రిటిష్ వారు వక్రీకరించిన చరిత్రనే మనం స్కూళ్లల్లో చదువుకుంటున్నాం. అలాగే గోపాలంగారి నాగపూర్ యాత్ర, తైత్తిరీయ ప్రసక్తి, భృగువల్లి వివరణ అమితంగా ఆకట్టుకొన్నాయి. పునర్జన్మ కథలు మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ వినిపిస్తాయి. వీటిని బలంగా విశ్వసించే వారున్నట్లే తిరస్కరించేవారూ ఉన్నారు. ఎందుకంటే పునర్జన్మకు శాస్ర్తియ నిరూపణ లేదు. ‘ఒక్క తూటా చాలు’ సీరియల్ ఆసక్తికరంగా చకచకా సాగుతూ అలరిస్తున్నది.
-కె.ఎల్.ప్రసన్న (పేర్రాజుపేట)
జీవనశైలి
రెండు చిన్న బహుమతుల వల్ల అతడు ఇంటిని, తన ఆలోచనల్ని శుభ్రపరచుకోవడం వల్ల అతని జీవనశైలి మారిందన్న నిజం ‘సండే గీత’లో బాగా చెప్పారు. ముంజేతిపై పెళ్లికళ ఫొటోలు, యుద్ధ పాఠాలు నేర్పే పాఠశాల అలరించాయి. మన దేశంలో మాదిరిగా వియత్నాంలోనూ మొక్కులు తీర్చుకోడానికి ఆనందంగా నిప్పుల్లో నడవడం ఉందని తెలిసి ఆశ్చర్యపోయాం. అక్షరాలోచనల్లో ‘మేఘం బద్దలైన వేళ’ బాగుంది. అలాగే సత్తా ఉన్న ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. వారసులు రాకూడదనడం సరికాదు. ఎలాంటి వారు రావాలో ఎలాంటి వారు రాకూడదో చెప్పడానికి రాహుల్, నారాలే ఉదాహరణలు.
-సదాప్రసాద్ (గొడారిగుంట)
ప్రతిభ
ఈ లోకంలో ఇతరరుల గొప్పతనాన్ని, ప్రతిభను గుర్తించడానికి ఇష్టపడదంటూ పొగడ్తకు ప్రశంసకు ఉన్న తేడాను ‘ఓ చిన్న మాట’గా బాగా విశే్లషించారు. ఇక - ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాల్ని పంపడం శ్లాఘనీయమే. ప్రయత్నిస్తే రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించగలం. అయితే ఇతర దేశాల ఉపగ్రహాల్ని మనం రోదసిలోకి పంపడం వల్ల మనకు డబ్బు లభిస్తుంది. కాని ఆయుధ తయారీకి కోట్లాది రూపాయలు ఖర్చవుతుంది. బడ్జెట్ సరిపోదు. అయినా ఇజ్రాయిల్ లాంటి దేశాలతో కలిసి ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా స్వయం సంపత్తికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
- జె.జ్ఞానబుద్ధ (సిద్దార్థనగర్)
ప్రశంస
ఓ చిన్న మాటలో ప్రశంస గురించి చక్కగా విశే్లషించారు. ‘సండే గీత’లో రెండు బహుమతులు చాలా బాగుంది. ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో బాగా చెప్పారు. అవీ ఇవీలో ముంజేతిపై పెళ్లికళ అందంగా ఉంది. నిప్పుల్లో నడక భయంగొలిపేదిగా ఉంది. మల్లాది సూరిబాబు గారి ‘అమృతవర్షిణి’ చదువుతుంటూ మనసుకు ఎంతో హాయి కలుగుతోంది. అన్నింటికన్నా వింతైంది పునర్జన్మ. ఇది చదివాక పునర్జన్మలు నిజంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. ‘మీకు మీరే డాక్టర్’ శీర్షికన అందిస్తున్న వ్యాసాలు ఉపయుక్తంగా ఉంటున్నాయి.
-డి.వి.తులసి (విజయవాడ)
రాజకీయ ఆదిత్యుడు
‘రాజకీయ ఆదిత్యుడు’ వ్యాసం ద్వారా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి గురించిన వివరాలు తెలుసుకున్నాం. యు.పి.లో పలు సంస్కరణలు చేయటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మద్యపాన నిషేధంపై కూడా దృష్టి సారిస్తే ప్రజలకు మరింత మేలు చేసిన వారవుతారు. ఇక ఓ చిన్న మాట, సండే గీత గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ‘ఓ చిన్న మాట’లో ప్రశంస -చాలా బాగుంది.
-కోలిపాక శ్రీనివాస్ (బెల్లంపల్లి)
లోకాభిరామమ్
ఈ శీర్షికన గోపాలంగారు అందిస్తున్న వ్యాసాలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. ఒక్కో వ్యాసం ఒక్కో ఆణిముత్యం. ఇది బాగుంది.. ఇది బాగోలేదు అని లేదు. దేనికదే ప్రత్యేకం. ‘సండే గీత’లో రెండు బహుమతులు కథ చాలా బాగుంది.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)