S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం ( ఎడిటర్‌తో ముఖాముఖి)

అక్షతల మురళీధర శాస్ర్తి, అవుకు, కర్నూలు జిల్లా
ఏప్రిల్ 16వ తేదీ పజిల్‌లో నిలువు, అడ్డము గళ్ళు చాలా తికమక పెట్టేశాయ. ప్రతి అడ్డం గళ్ళు, ప్రతి నిలువు గళ్ళల్లో చాలా పొరపాట్లు ఉన్నాయ.
ఔను. పొరపాటైంది. ఆధారాలు కరెక్టే కాని, ఇచ్చిన గళ్ళబొమ్మ వేరొక పజిల్‌ది. ఆ సంగతి మరుసటి వారం జవాబుల గడులు చూశాక మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇకముందు ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాం.

గూడూరు శ్రీహరిరావు, గంగవరం, నెల్లూరు జిల్లా
ఆ పజిల్ మొత్తం తప్పుల తడకగా తయారైంది. తప్పెవరిది? నిశాపతిగారిదా? మీదా?
మాదే.

జి. మాధురి, హైదరాబాద్
కథల పోటీకి వచ్చిన కథలను వచ్చినట్లు చదువుతారా? అన్ని కథలు ఆఖరు తేదీనాటికి వచ్చిన తర్వాత చదువుతారా? అంతకుముందు పోటీకి పంపిన కథలు సాధారణ ప్రచురణకు కూడా నోచుకోనప్పుడు వాటిని తిరిగి పంపిస్తారు కదా! అలాంటి కథా రచయతల పేర్లు గుర్తుపెట్టుకుని వారు మళ్లీ పోటీకి పంపిన కథలను చదువుతారా? చదవరా? ఇంతకుముందు వీళ్లు రాసిన కథలు బాగోలేదని ఇప్పుడు కూడా బాగా రాసి ఉండరని భావించి అలాంటివారి కథలు చదవకుండా వదిలేస్తారా?
వచ్చిన కథలు వీలు వెంబడి చదువుతాం. కథను బట్టి నిర్ణయం చేస్తాం.
ఎస్.బి. విజయసారథి, మెదక్
ఎవరైనా నేతలకు తమ విధేయతో, కృతజ్ఞతో ప్రకటించదలిస్తే వారి ఫొటోలకు, విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేసి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్‌గా మారింది. దీనివల్ల ఎన్ని ‘పాలు’ నేలపాలు అవుతున్నాయో? దానికి బదులుగా ఆ ‘పాలు’ బీదవారికి పోస్తే బాగుంటుంది కదా? తమ మెప్పుదల వ్యక్తపరచడానికి మరో మార్గం లేదా?
ఇదో రకం ‘పాల’వెర్రి!

ఎన్.ఆర్. లక్ష్మి, సికిందరాబాద్
చినబాబుకు వర్ధంతి, జయంతులకు తేడా తెలియదు. అనుభవ రాహిత్యంతో ఆదిలోనే హంసపాదయంది. వీరికి మంత్రి పదవా?
బిడ్డకు ప్రేమతో....

సానా రాజేష్, హైదరాబాద్
మహానుభావులు, గురు సమానులు, నేను అత్యంత ఇష్టపడే మీరు యూట్యూబ్ వీడియోలలో చాలా తక్కువగా ఉండటం బాధ కలిగిస్తోంది. మహోన్నతమైన మీ వ్యక్తిత్వం నాలాగే భావితరాలనూ కదిలించేలా, అపారమైన మీ జ్ఞానం అందరికీ అందుబాటులో ఉండేలా యూట్యూబ్‌లోను ఇంకా బాగా మీరు వినిపించాలి, కనిపించాలని కోరుకుంటున్నాను.
మీ కోరిక తీరుగాక.

పుష్యమీసాగర్, హైదరాబాద్
రాజ్యాంగం లెక్క ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు.
రాజ్యాంగం లెక్క కాదు. సుప్రీంకోర్టు గీసిన గీత.

కానీ ఎవరికి అనుకూలంగా వాళ్లు మార్చేసుకుంటున్నారు. తాజాగా కొన్ని వర్గాల మెప్పు కోసం పెంచడం తగ్గించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా?
ఆ మాటకొస్తే - పదేళ్ల కోసం ఉద్దేశించిన తాత్కాలిక రక్షణను తరాల తరబడి పొడిగిస్తూ పోవడమే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

డా. ములుగూరి శ్రీనివాస్, వరంగల్
ముస్లింలు అందరూ సామాజికంగా వెనుకబడినవారని, అందరూ బీదవారు అని 12% జనాభా ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని తెలంగాణ సర్కారు అంటోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టులో నిలవదనీ తెలిసీ చెయ్యడం వెనక మతలబు ఏంటండీ?
ఓట్ల కోసం కుచ్చుటోపీ.

సి. ప్రతాప్, శ్రీకాకుళం
ఒక పార్టీ జెండా, అజెండాపై గెలిచి, పదవుల కోసం అధికార పార్టీలోకి జంప్ జేసే అవకాశవాదులకు తగిన గుణపాఠం చెప్పాల్సింది పోయ పదవుల కండువా కప్పడం వలన ప్రజలకు పార్టీలు ఎలాంటి సందేశం ఇస్తున్నాయ?
రాజకీయ సంతలో నీతికి విలువ లేదని.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక,
36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్ - 500003.
: email :
sundaymag@andhrabhoomi.net