S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వర్షం ఆగాక పాడే పక్షులు

యురేసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపించే ‘బ్లాక్ బర్డ్స్’ అద్భుతంగా కూస్తాయి. వాటి పాట వింటే మనసు తేలికపడుతుంది. మన కోకిల మాదిరిగా వాటి పాటలను అక్కడివారు ఆస్వాదిస్తారు. వీటిలో ఏడాదిలోపు పక్షులు జనవరి చివరి నుంచి ఫిబ్రవరిలో మాత్రమే పాట అందుకుంటాయి. ఎదిగిన పక్షులు మార్చి నుంచి జులై మధ్య పాడటం అలవాటు. సాధారణంగా వర్షం కురిసిన తరువాత కూయడం వీటికి ఎంతో ఇష్టం. కళ్ల చుట్టూ పసుపుపచ్చని వలయం, అదేరంగులో ఉండే ముక్కు వీటికి అందాన్నిస్తాయి. మగపక్షులు నల్లగా ఉంటాయి. ఆడపక్షులు కాస్త లేత గోధుమవర్ణంలో ఉంటాయి. ఎదపై ఎర్రటి మచ్చతో ఉండే పక్షులూ వీటిలో ఉంటాయి. గుడ్లు పొదిగే సమయంలో ఆడపక్షులు మిగతాపక్షులను దరిచేరనివ్వవు. ఆ సమయంలో మగపక్షులు ఎరుపుతిరిగిన ముక్కులున్న మగపక్షులను తరిమికొడతాయి. వాటికి పోటీ వస్తాయన్న భయంతో అలా చేస్తాయట. ఐస్‌లాండ్‌లో మాత్రం ఈ పక్షులు కనిపించవు.

- ఎస్.కె.కె. రవళి