S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కూల్... కూల్... కొడైకెనాల్

మండు వేసవి... ఒకపక్క నిప్పులు చెరిగే భానుడు... మరోపక్క చెమటలు కక్కే శరీరం.. ఎన్ని నీళ్లు తాగినా ఎండిపోయే నాలుక... ఇదీ భానుడి ప్రతాపానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు... చల్లదనం కోసం, చల్లగాలి కోసం అర్రులు చాచే కాలమిది. అలాంటి వేసవిలోనూ ఓ ప్రాంతం మాత్రం భిన్నంగా ఉంటుంది. దారి పొడవునా సన్నని వాన తుంపరలు శరీరాన్ని తాకుతూ.. గాలిలో వేడి హఠాత్తుగా మాయమై.. చల్లని గాలులు శరీరాన్ని ఉల్లాసపరుస్తుంటే ఆ అనుభూతి ఒక్కసారి ఊహించుకోండి.. ఆకాశంలో విహరించే మేఘం అక్కడ మీ శరీరాన్ని తాకుతుంది... మరికొన్ని మీ కింది నుంచి వెళ్లిపోతుంటాయ.. ఇది వింటుంటేనే అద్భుతంగా ఉంది కదూ... మండు వేసవిలో అలాంటి వాతావరణం అనుభవంలోకి వస్తే వర్ణించటానికి ఎవరికైనా మాటలే కరువవుతాయ. తమిళనాడులోని కొడైకెనాల్‌కు వెళ్తే కచ్చితంగా ఇదే అనుభూతి కలుగుతుంది. భారత దేశపు పశ్చిమ కనుమల్లో, సముద్ర మట్టానికి దాదాపు రెండువేల మీటర్ల ఎత్తున ఈ కొండప్రాంతాన్ని మండు వేసవిలో సందర్శించటం కంటే అపూర్వమైన అనుభూతి మరొకటి ఉండదు. మండే ఎండల్లో కొడైకెనాల్‌కు వెళ్తే నగరానికి దాదాపు 50 కి.మీ. దూరంలో కూడా చండ ప్రచండుడై నిప్పులు చెరుగుతుంటాడు. కానీ కొడైకెనాల్‌లో మాత్రం చల్లగా... ఆహ్లాదంగా ఉంటుంది. అదే అద్భుతం. హిల్ స్టేషన్ అయిన ఈ నగరం పలు పర్వతశ్రేణుల మధ్య నిర్మితమైంది. అనేక కొండలను కలుపుతూ ఏర్పాటైన ఈ నగరం ఘాట్‌రోడ్ ప్రారంభం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. బయటి నుంచి ఒక్కసారిగా ఏసి హాల్‌లోకి వస్తే వాతావరణం ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. ఒక కొండ నుంచి మరో కొండ.. ఆ కొండ నుంచి ఇంకొక కొండ.. ఇలా దారి ఒకటే. ఒక కొండ నుంచి మరో కొండకు ఎలా దాటిపోతున్నామో తెలియకుండానే జరిగిపోతుంది. పైకి వెళ్తున్న కొద్దీ కింద ఎక్కడో దూరంగా మరో కొండ పైనున్న రహదారిని గమనిస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. కొండల్ని తవ్వుకుంటూ నిర్మించిన రోడ్డుపై మలుపుల మీద మలుపులు తిరుగుతూ..వెళ్తుంటే ఆ అనుభూతికి ఏమని పేరు పెట్టగలం?
కొడైకెనాల్ పశ్చిమ కనుమల్లో శీతల ప్రదేశాల్లో ఒకటి. నూటయాభై అడుగులకు పైగా నిటారుగా ఎదిగిన వృక్ష సముదాయంతో దట్టమైన అడవి. సరస్సులు, జలపాతాలు, కొండ గుహలు ఒకటా రెండా దాదాపు పది నుంచి పాతిక కిలోమీటర్ల పొడవైన ప్రయాణంలో చూసేందుకు ఎన్ని కళ్లున్నా చాలవు. డాల్మిన్ సర్కిల్‌లో జలపాతాలు అద్భుత సుందర దృశ్యం. అక్కడి నుంచి సైలెంట్ వ్యాలీ, పిల్లర్ రాక్‌ల దగ్గరకు వెళ్తే మేఘాలు మిమ్మల్ని ఆత్మీయంగా స్పృశించి వెళ్తాయి. మనం నిలుచున్న చోటి నుంచి చూస్తే మేఘాలు మన కింది నుంచి కదిలిపోతుంటాయి. అవి మనల్ని తాకుతుంటే, వాటిని మనం కదిలిస్తుంటే ఒక్కసారి మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందో.. అది దాటాక గుణ గుహ.. కమల్‌హసన్ గుణ సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమా షూటింగ్ జరిగింది ఇక్కడే... ఆ తరువాత అక్కడే ఉన్న చెట్టియార్ పార్క్, కోకర్స్ వాక్, బ్రయాంట్ పార్క్ ఇలా ప్రతి ఒక్కటీ చూడదగిన ప్రదేశమే. వీటన్నింటికీ మించి అక్కడ ఉన్న వాక్స్ మ్యూజియం చాలా అద్భుతమైంది. చివరగా కొడైకెనాల్ సరస్సులో బోటు షికారు.. దాని పక్కనే 7డి మోషన్ మూవీ థియేటర్.. ఆ పక్కనే అమ్మ క్యాంటిన్‌లో అయిదు రూపాయలకే భోజనం.. హాట్ సమ్మర్‌లో కూలెస్ట్ కొడైకనాల్.. ఒక్కసారి విజిట్ చేసి రావలసిందే.

- ఆనంద