S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ పక్షులకు గడ్డి ఇష్టం

సాధారణంగా పళ్లు, గింజలు, కీటకాలను పక్షులు తింటాయి. కానీ న్యూజిలాండ్‌లో ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన పక్షి ‘టకాహే’ గడ్డిని ఇష్టంగా తింటుంది. ఫెర్న్‌వంటి మొక్కల మొదళ్లను, కాడలను ఆరగిస్తుంది. 1800-1900 సంవత్సరాల మధ్య విస్తృతంగా కనిపించిన ఈ పక్షులు ఉన్నట్లుంది కనుమరుగయ్యాయి. దాదాపు అంతరించిపోయాయనుకున్నారంతా. కానీ డాక్టర్ జెఫ్రీ ఆర్‌బెల్ అనే శాస్తవ్రేత్త న్యూజిలాండ్ అంతటా వీటి ఆచూకీ కోసం వెతికివెతికి విజయం సాధించాడు. శత్రుపీడ లేని ఒక కొండలోయల్లో తిరుగుతున్న వీటిని 1948లో ఆయన కనిపెట్టాడు. అనేక సంరక్షణ చర్యలు తీసుకున్న తరువాత ప్రస్తుతం వీటి సంఖ్య 150కు పెరిగింది. ఎగరలేని ఈ పక్షులు బలమైన ఎరుపు, గులాబీ రంగు ముక్కుతో, నీలి, ఆకుపచ్చ వర్ణపు ఈకలతో అందంగా కనిపిస్తాయి. ఓ పెద్దకోడి సైజులో ఈ పక్షులుంటాయి.

- ఎస్.కె.కె. రవళి