S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎగరలేని చిలుకలు

ఆకుపచ్చగా అందంగా కనిపించే రామచిలుకలంటే ఇష్టపడనివారుండరు. కానీ న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే ‘కకాపో’ అనే చిలుకలు ఎగరలేవు. పైగా వీటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలో ఎగరలేని, అతిపెద్ద రామచిలుకలు ఇవే. వాటి రెక్కలు మిగతా చిలుకలకన్నా చిన్నగా, బలహీనంగా ఉంటాయి. కానీ వాటికి వాసన గ్రహించే శక్తి చాలా ఎక్కువ. వాటి కాళ్లు బలంగా ఉండి చెట్లు ఎక్కడానికి ఉపయోగపడతాయి. ఆహారం కోసం కనీసం 5 కి.మీ. దూరమైనా నడచివెళ్లే శక్తి వాటికి ఉంది. చెట్లపై నుంచి నేలమీదకు రావడానికి కొద్దిదూరం వరకు ‘పారాచ్యూటింగ్’ శైలిలో దిగుతాయి. వీటికి మరో విశిష్టత ఉంది. సాధారణంగా చిలుకలన్నీ పగలు చురుకుగా ఉండి రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటాయికదా! కానీ ఈ చిలుకలు పగలు విశ్రాంతి తీసుకుని రాత్రి ఆహారాన్ని వెదుక్కుంటాయి. కానీ గుడ్లు మాత్రం పగలే పెడతాయి. పైగా వీటి శరీరం నుంచి ఒక ప్రత్యేకమైన పరిమళం ఆహ్లాదాన్నిస్తుంది. సంపర్క సమయంలో ఆ పరిమళం ద్వారా తన జతకు సంకేతం ఇస్తాయన్నది శాస్తవ్రేత్తల అంచనా. అయితే వీటి ప్రధాన శత్రువు గద్దలు ఈ పరిమళం ద్వారానే వాటిని గుర్తించి దాడి చేస్తూంటాయి. ప్రమాదం ఎదురైనప్పుడు గడ్డకట్టి, రాయిలా అయిపోయినట్లు నటించడం వీటి ప్రత్యేకత. దాదాపు అంతరించిపోయే దశలో ఉన్న ఈ చిలుకలు ప్రస్తుతం 200 లోపు మాత్రమే ఉన్నాయి.

- ఎస్.కె.కె. రవళి