S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? ( మే 14 నుండి 20 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆర్థిక ప్రగతి. మధ్యమధ్య ఆటంకాలు ఎదురైనా చివరకు మీరు అనుకున్నట్లే అవుతుంది. కొత్త పరిచయాలు ప్రయోజనకారి. స్ర్తిలు, దంపతులు శ్రమానుకూలంగా లబ్ధిని పొందుతారు. పెట్టుబడులు అనుకున్నది ఒకటి అయినది వేరొకటి అన్నట్లుగా ఉంటుంది. మిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. సావకాశంగా పనులను నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు, వ్యవహారాలు ఫలప్రదం. స్పెక్యులేషన్ మిశ్రమం. మీ కార్యాలకు ప్రశంసలు అందుకుంటారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఆర్థిక లబ్ధి. పనులందు మార్పులు చోటు చేసుకుంటాయి. మీ బంధువులు, మిత్రులతో సంయమనం పాటించాలి. స్వవిషయాలందు గోప్యత పాటించాలి. మొహమాటం చేటు కలిగిస్తుంది. కార్యసిద్ధి. శక్తి మేరకు కార్యాలు నిర్వర్తించండి. వృత్తి, వ్యవహార, ఉద్యోగాలందు మార్పు. నిరుద్యోగులకు ప్రయత్న పూర్వకంగా విజయం. శుభకార్యాలు మీ ప్రమేయంతో పూర్తవనున్నాయి. స్పెక్యులేషన్ ఆలోచింపజేస్తుంది. కష్టాలను ఇష్టాలుగా మార్చుకొనే ప్రయత్నం చేయండి. స్ర్తిలకు అన్నింటా సౌఖ్యం. పరిచయాలు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆదాయ వ్యయాల నియంత్రణ అవసరం. సంతోష ప్రాప్తి. మీ వృత్తి, వ్యాపార, విద్య, వ్యవహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సమయానుకూలంగా అన్నింటా వ్యవహరించాలి. పోటీ పరీక్షలందు విజయం. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. కొన్ని విషయాల్లో మతిమరుపు. ముఖ్యమైన పత్రాలు, చిత్రాలు జాగ్రత్త పరచండి. ధనం విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికంగా ఫలదాయకం.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ధనాదాయం తప్పనిసరిగా ఉంది. ఖర్చులు కొత్తవి వచ్చేట్లున్నాయి. స్ర్తిలకు ఆభరణాల లబ్ధి. దంపతులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శుభ పరిణామాలు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. నిలకడ మంచిది. పరిశీలన అంతటా లాభదాయకం. స్పెక్యులేషన్ ఫలప్రదం. దంపతులు మిశ్రమ ఫలితాల నందుకుంటారు. కోపతాపాలు వద్దు. ప్రయత్నాలు ఆలస్యమవనున్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

సమయం వృథా కానివ్వకండి. తడబాటుతో కార్యాలు చేయకండి. ఎడబాటు, పొరబాట్లు, శిగపట్లకు అవకాశమివ్వకండి. యత్న కార్యసిద్ధి. ఆధ్యాత్మిక భావనలు ఆనందింపజేస్తాయి. వృత్తి, వ్యాపార, వ్యవహార, ఉద్యోగ రంగాలు గతంలానే ఉంటాయి. దూరపు బంధువుల రాక. వ్యవసాయ దారులు అనుకోని అనుభవాలను పొందుతారు. స్పెక్యులేషన్ మిశ్రమం. అనుకోని శుభవర్తమానాలుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ధనాదాయం. వ్యయ వితరణతో పొంతన కోల్పోతారు. అదుపు, పొదుపు మంచిది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలు నత్తనడకన ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. ప్రతి విషయంలోనూ ఆందోళన పడకండి. స్పెక్యులేషన్ స్వల్ప లాభం. హితుల రాకపోకలు ప్రయోజనకారి. గుర్తింపు పొందుతారు. గౌరవ ప్రతిష్ఠలను అందుకుంటారు.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

ఆర్థిక ఉన్నతిని వీక్షిస్తారు. గౌరవ మన్ననలు పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త. నిర్ణయాలు పరిశీలనాత్మకంగా మార్పు చేసుకోవాలి. హితులు అనుకోని లాభాలను అందుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు గతం కంటె మెరుగు. పరుగుపరుగున పనులు నిర్వహించకండి. ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. స్ర్తిలు, దంపతులు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ధనాదాయముంది. అనుకోని ఖర్చులున్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నేత్ర ఇబ్బందులు, శ్వాస సమస్యలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు చేసే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కుటుంబ సభ్యుల ఐకమత్యం, శుభకార్యాలు, అనుకున్నవి పూర్తవుతాయి. అనుకోకుండా ఆర్థిక ప్రగతి అందుతుంది. మీ వృత్తి, వ్యాపార, విద్య, వైద్య, వ్యవహారాదులు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకోండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఆర్థిక వ్యయాలు, ఆదాయాలు సమానంగా ఉంటాయి. స్ర్తిలు అనుకున్నవి అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు మీ లౌక్యంతోనే లాభదాయకం. స్ర్తిలు, నిరుద్యోగులు, పోటీ పరీక్షదారులకు మంచి కాలం. వదంతులు నమ్మకండి. సంయమనం పాటించాలి. అధ్యాత్మిక ప్రయాణాలందు అప్రమత్తంగా మెలగాలి. స్పెక్యులేషన్ మిశ్రమం. మంచి వార్తలు వింటారు. హితుల రాక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. విదేశీ, కోర్టు వ్యవహారాదులు అనుకూలిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆర్థికంగా వృద్ధి చెందుతారు. సమస్యలను వివేకంతో పరిష్కరించుకోవాలి. వాహన సౌఖ్యముంది. యత్న కార్యసిద్ధి. యశోవృద్ధి. శుభ కార్య నిర్వహణలో మీ తోడ్పాటు ఉంటుంది. అవివాహితులకు కళ్యాణ యోగముంది. వృత్తి, వ్యాపార, వ్యవహార, రియల్ ఎస్టేట్ రంగాలు అనుకూలం. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలుంటాయి. ప్రయత్నాలు ఆలస్యమవనున్నాయి. పెట్టుబడి మార్గాలు రాబడిని సూచిస్తున్నాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆర్థికంగా అనుకోని మార్పులు. అన్నింటా శ్రేయస్కరం. శుభకార్య యత్నాలు అనుకూలం. ప్రతికూల వాతావరణంలోనూ కార్యసిద్ధి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. వృత్తిలో మార్పులు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు మన్ననలు, ప్రశంసలు. స్ర్తిలు, దంపతులు అనుకున్నవి అందుకుంటారు. స్పెక్యులేషన్‌లో ఆర్థిక లాభం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. చిరుద్యోగులకు ఆర్థిక లాభం. ఇతరులను తక్కువగా అంచనా వేయకండి. ఆందోళన పడకండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ధన వ్యయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. యత్న కార్యసిద్ధి. మిత్రుల సంఖ్య పెరుగుతుంది. కళాకారులకు మంచి ప్రోత్సాహం లభించనుంది. గుర్తింపు పొందుతారు. గౌరవ ప్రతిష్ఠలను అందుకుంటారు. మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహార రంగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అనుకోని లాభాలు ఈ రాశివారు అందుకుంటారు.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855