S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తంపటి

సర్దుకుపోవడం
సరైన పద్ధతి కాదు
సర్దుకుపోవడమంటే
తప్పును సమర్థించడమే
జరిగే తప్పుని ఎదిరించలేక
ఓ మూల ఒదిగిపోవడమే

తప్పును తప్పించుకుపోతే
తప్పు తప్పులతో కలిసి
తడికలా అల్లుకుపోతుంది
కదిపే ప్రయత్నం జరిగితే
కల్లోలం సృష్టించి
ఒప్పును కప్పేస్తుంది

మొహమాటం వీడి
ఎప్పటికప్పుడు
తప్పుకి ‘తంపటి’ పెట్టిస్తేనే
దుంపలా కంపరమెత్తి
తప్పు తప్పుకుంటుంది
నిజ సౌఖ్యానికి ఎప్పటికీ
దారి దొరుకుతుంది.

- గగనం శ్రీనుకుమార్ 8008262514