S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నా ప్రపంచంలో..

కూలిపోయన వంతెనలగుండా
మాటలు చిక్కుకుని విలవిలలాడినప్పుడు
ఎండ సోకని మూలాలలో నన్ను నేను
ఎప్పటికప్పుడు తప్పిపోతాను

కడవల కొద్దీ కన్నీళ్లను
అనుభవాల దొంతరలో
పాతరేసి పోరాడుతున్న
ఒంటరి కెరటాన్ని

అనుభూతులు ఒంటినిండా
సీతాకోక చిలుకలై ఎగిరినప్పుడు
అవ్యక్త లోకంలో తిరుగుతూ
సంతోషపడే అల్పజీవిని
కాల పరీక్షలో, రోజుల లెక్కలలో
కొట్టివేతగా మిగులుతూ
కొంచెం కొంచెంగా
అదృశ్యమవుతున్న రేపటి స్వప్నాన్ని

రెక్కల కింద దాచుకున్న
ప్రేమ అక్షరాలని నింగికి ఎగరేసి
పతాకమై రెపరెపలాడాలని

ఉవ్విళ్లూరుతున్న వర్తమానపు ఆశని
జీవిక ఉన్నంతవరకు
నాలో నేను, నాతో నేను
ఇదే సత్యం, మిగిలినది అంతా అవాస్తవం
నాదైన ప్రపంచంలో...

- పుష్యమీ సాగర్, 9032215609